MotoGP Bharat రేసింగ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ఓలా ఎలక్ట్రిక్ బైక్స్..
భారత్‌లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ రేస్ ఈవెంట్ MotoGP నేడు గ్రేటర్ నోయిడాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ రేసింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ అంతర్జాతీయ రేసులకు ఈ రోజు ప్రాక్టీస్ రేసులు జరుగుతాయి. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ ఈ ఈవెంట్‌లో తన ఎలక్ట్రిక్ బైక్ పోర్ట్‌ఫోలియోను ప్రదర్శిస్తుంది. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.
దేశీయ మార్కెట్లో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. నేటి నుంచి మూడు రోజుల పాటు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరగనున్న MotoGP Bharat ప్రారంభ ఎడిషన్ సందర్భంగా తన మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను ప్రదర్శిస్తుంది. భారత్‌లో జరుగుతున్న మోటోజీపీ రేసింగ్ గ్రాండ్ ప్రిక్స్‌ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విచ్చేస్తున్న ఔత్సాహికుల కోసం ఓలా తమ మోటార్‌సైకిల్ పోర్టుఫోలియోను ఫ్యాన్‌జోన్‌లోని ఓలా బూత్‌లో ప్రదర్శిస్తుంది.

బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఓలా.. MotoGP రేసింగ్ ఈవెంట్‌లో ఉపయోగించడానికి తమ S1 స్కూటర్లను అందిస్తోంది. ఫ్యూయెల్ బేస్డ్ వాహనాలకు బదులుగా, ఈ సారి మార్షల్ సపోర్ట్‌తో సహా ఇతర ఆన్-గ్రౌండ్ సపోర్ట్ యాక్టివిటీల కోసం Ola S1 స్కూటర్లను వినియోగించనున్నారు.
ఓలా(Ola Electric) మరియు బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ మధ్య ఈ భాగస్వామ్యం MotoGP యొక్క సస్టైనబుల్ ఆపరేషన్స్ కమిట్‌మెంట్‌కు అనుగుణంగా ఉంటుంది. మోటోజీపీ భారత్ రేసింగ్ ఈవెంట్ నేటి నుంచి సెప్టెంబర్ 24 వరకు జరగనుంది. అయితే MotoGP ఇప్పటికే 2024లో జరగనున్న MotoE వరల్డ్ ఛాంపియన్‌షిప్(World Championship) రెండవ సీజన్‌కు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ CMO అన్షుల్ ఖండేల్వాల్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్‌కు అత్యున్నత స్థాయి మోటార్‌సైకిల్ రేసింగ్‌లు రావడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఇప్పుడు ఇక్కడ మోటార్‌స్పోర్ట్ నిర్వహించడం రేసర్లకు, రేస్ లవర్స్‌కు ఉత్తేజాన్నిస్తుందని చెప్పారు. బైక్ రేసుల్లో MotoGP ఎలా ఉత్తమమైనతో, అలాగే ఉత్తమమైన EV ద్విచక్ర వాహనాలకు ఓలా నిర్వచనమని స్పష్టం చేశారు.

ప్రపంచ స్థాయి మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని అన్షుల్ ఖండేల్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ తమ మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియాతో పాటు ఓలా(Ola Electric) యొక్క విజన్, ఇంజినీరింగ్ మరియు సాంకేతికతను పంచుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాలుగా, టూ వీలర్ విభాగంలో EV ల సేల్స్‌లో ఓలా దేశీయ మార్కెట్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇటీవలే డైమండ్‌హెడ్, అడ్వెంచర్, క్రూయిజర్ మరియు రోస్టర్ పేర్లతో నాలుగు బెస్ట్-ఇన్-క్లాస్ మోడల్‌లతో తమ మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను ఓలా ప్రకటించింది.
బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో అట్టహాసంగా జరుగుతున్న MotoGP రేసింగ్ ఈవెంట్‌ను చూసేందుకు ఔత్సాహికులు, సాధారణ ప్రజలు దాదాపు లక్ష మంది వరకూ రానున్నారు. ఒకేసారి లక్షకు పైగా కూర్చుని రేసింగ్‌ను ఎంజాయ్ చేసేలా.. సర్క్యూట్‌లో ఏర్పాట్లు చేశారు. మోటోజీపీ భారత్ రేసింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

MotoGP భారత్ గ్రాండ్ ప్రిక్స్ టికెట్ ధర రూ. 800 నుండి మొదలై రూ. 1,80,000 వరకు ఉంటుంది. టేసాయం మెయిన్ గ్రాండ్ స్టాన్ టికెట్ ధర రూ.20,000 నుండి రూ.30,000 వరకు ఉంది. ప్లాటినం కార్పొరేట్ బాక్స్‌లో 40,000. బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








