Ola Electric: ఒక్క నెలలోనే 27,000 సేల్స్ తో దుమ్మురేపిన ఓలా.. కారణం ఇదే..!
భారత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు తగినట్లుగానే కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఓలా కంపెనీ దూసుకుపోతుంది. నెల నెల గణనీయమైన సేల్స్ తో ఈ విభాగంలో ఓలా తన సత్తాను చాటుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించి ఇప్పుడు వార్తలో నిలిచింది.
ఓలా మార్చి 2023లో విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. గత నెలలో ఓలా మొత్తం 27,000 యూనిట్ల విక్రయాలను సేల్ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న సేల్సో లో ఈ మార్చి అతిపెద్ద నెలవారీ విక్రయాల సంఖ్య అని పేర్కొంది. దీంతో ఓలా మార్కెట్ షేర్ 30 శాతానికి పైగా పెరిగిందని కంపెనీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది.

రెండు లక్షలకు పైగా సేల్స్..
బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు లక్షల వాహనాలను విక్రయించి 2022-2023 ఇయర్ ని ఘనంగా ముగించింది. ఓలా భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించిన మొదట్లో వినియోగదారుల పల్స్ ని పట్టుకోవడంలో చాలా కష్టపడింది. అనతి కాలంలోనే కొన్ని మార్పులు చేసి ప్రస్తుత మార్కెట్ ని ఏలుతోంది.
వరుసగా గత ఏడు నెలలుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచిన ఓలా నిలిచింది. దేశంలోని ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సర్వీస్ ను అందిస్తోంది. దేశంలో ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఇది సంస్థ అభివృద్ధికి మరింత దోహదపడనుంది.

అందుబాటులో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు..
దేశంలో ఇప్పటికే 400 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేశామని భవిష్ అగర్వాల్ తెలిపారు. ఆఫ్‌లైన్ విక్రయాలను మరింత చేరువ చేసేందుకు ముఖ్య నగరాల్లో ఒక్క రోజులోనే 50 కేంద్రాలను ఓపెన్ చేసింది. ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు ఏర్పాటు చేశామని తన కస్టమర్లలో 90 శాతం మందికి ఇవి అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు.
వేగానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు రాజీపడని నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటం వల్ల మార్కెట్‌లో అగ్రగామిగా చేరేందుకు సహకరించాయని ఆయన అన్నారు. గత సంవత్సరంలో EVలు అగ్రస్థానంలోకి తీసుకురావడంలో విజయం సాధించినప్పటికీ, రాబోయే రెండేళ్లలో EV విప్లవం మరో స్థాయికి తీసుకువెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విప్లవానికి నాయకత్వం వహించేందుకు ఓలా ముందు వరుసలో ఉంటుందని తెలిపారు.

అప్ గ్రేడ్ తో సేల్స్ లో టాప్..
గత నెల కూడా ఓలా ఎలక్ట్రిక్ వార్తల్లో నిలిచింది. ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉచిత సస్పెన్షన్ అప్‌గ్రేడ్ ప్రకటించిన తర్వాత ఈ సేల్స్ అమాంత పెరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫ్రంట్ సస్పెన్షన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కంపెనీ స్కూటర్లన్నింటిని రీకాల్ చేసింది. అయితే, ఇది రీకాల్ కాదని, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న చర్యలో భాగంగా తీసుకువచ్చిన 'అప్‌గ్రేడ్' అని కంపెనీ చెప్పుకొచ్చింది.
ఓలా ఇటీవల తన S1 ఎయిర్, S1, S1 ప్రో మోడళ్లలో 2 kWh, 3 kWh మరియు 4 kWh బ్యాటరీ మోడళ్లలో బైక్ లను అందుబాటులో ఉంచింది. ప్రస్తుత లైనప్‌లో S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. S1 ఎయిర్ వేరియంట్ లో ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, అయితే డెలివరీలు ఈ ఏడాది జూలైలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 2 kWh బ్యాటరీతో తీసుకువస్తున్న స్కూటర్ సిటీ కమ్యూట్ కి తగినట్లుగా ఉండనుంది.


Click it and Unblock the Notifications








