ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి ఓలా కంపెనీ శుభవార్త.. ఇది చదివితే వెంటనే కొనేస్తారు..

భారత్‌లో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, ద్విచక్ర వాహనాల సెగ్మెంట్‌లో వినియోగదారులకు మరో శుభవార్తను తీసుకువచ్చింది. సరసమైన ధరల్లో వినియోగదారులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మోడళ్లను అందిస్తున్న ఓలా.. దాని అత్యుత్తమ S1 స్కూటర్ లైనప్ మరియు లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌లతో ఈవీ రంగంలో దూసుకుపోతోంది.

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99 శాతం వడ్డీ రేటుతో ఓలా స్కూటర్‌ని కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తుంది ఓలా ఎలక్ట్రిక్.

Ola E Scooter

ఓలా ఎలక్ట్రిక్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈవీలు సరసమైన ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. తద్వారా #EndICEAge కి తన నిబద్ధతను ఓలా తెలియజేస్తుంది. వినియోగదారులు ఇప్పుడు అతి తక్కువ నెలవారీ EMIలతో, జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌కి యజమాని అవ్వవచ్చు.

ఓలా చీఫ్ బిజినెస్ అధికారి అంకుష్ అగర్వాల్ మార్కెట్ లీడర్‌గా తాము ప్రముఖ ఫైనాన్సింగ్ భాగస్వాములతో పొత్తు ఏర్పరుచుకోవడం ద్వారా.. టైర్ 1 నగరాల్లోనే కాకుండా టైర్ 2 మరియు టైర్‌ 3 నగరాల్లో కూడా అత్యంత లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఎంపికల ద్వారా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందిస్తున్నట్లు చెప్పారు.

Ola E Scooter

"భారత్‌లో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల వినియోగం పెరుగుతోంది. మా ఫైనాన్సింగ్ ఆఫర్‌లు పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేస్తాయనే నమ్మకం ఉంది. ఈ ఫైనాన్సింగ్ సౌలభ్యంతో ఈవీని సొంతం చేసుకునేందుకు అయ్యే ఖర్చు ఇప్పుడు ICE వాహనాన్ని కొనడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే సగం ఉంటుంది. విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నాం" అని అన్నారు.

ఓలా యాప్ ద్వారా ఔత్సాహికులు ఈవీను కొనుగోలు చేసే ముందు ఫైనాన్సింగ్ ఆప్షన్‌లపై వివరణాత్మక సమాచారం కోసం తమ సమీప ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌కు వెళ్ళవచ్చు. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్స్‌ను ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌లో కూడా ఎంచుకోవచ్చు. ఓలా ప్రస్తుతం 700+ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లతో భారతదేశపు అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఆగస్టులో 1000వ ECని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.

Ola E Scooter

S1 Pro, S1 మరియు S1 Air లతో కూడిన S1 లైనప్ అత్యాధునిక సాంకేతికతతో పాటు అసమానమైన పనితీరును కలిగి ఉన్నాయి. సొగసైన మరియు మినిమలిస్ట్ డిజైన్‌ ఈ ఈవీలలో రూపొందించారు. ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాలుగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ విభాగంలో అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

Ola E Scooter

More from DriveSpark

Article Published On: Friday, June 16, 2023, 19:42 [IST]
English summary
Ola electric stays resolute to end iceage offers lucrative financing options
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+