Ola Electric Sales అమ్మకాల్లో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్.. టూవీలర్ మార్కెట్‌లో 40శాతం వాటా సొంతం!!
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ EV 2W విభాగంలో తన సత్తాను చాటుతోంది. జూన్ నెలలో 40% మార్కెట్ వాటాను సాధించడంతో తన ప్రథమస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. జూన్‌లో దాదాపు 18,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. భారతదేశ EV 2W రంగంలో ఓలా అగ్రగామిగా నిలిచింది.
ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం సబ్సిడీని తగ్గించింది. దీని కారణంగా మొత్తం పరిశ్రమ అమ్మకాలు క్షీణించినప్పటికీ ఓలా తనకు ఉన్న మార్కెట్‌ని నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఏథర్, టీవీఎస్‌తో పాటు ఇతర పేరొందిన కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే జూలైలో రెట్టింపు అమ్మకాలు ఉంటాయని ఈ విభాగం నిపుణులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్‌లో అత్యధిక వాటాను నిలబెట్టుకోవడంలో విజయవంతం అయినట్లు ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. జూన్ నెలలో పరిశ్రమకి మందకొడిగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలను సాధించినట్లు ఆయన తెలిపారు. మా సంస్థకు ఉన్న ప్రభావవంతమైన వ్యయ నిర్మాణాలు, బలమైన సప్లై చైన్స్ మరియు పటిష్టమైన ఇన్-హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు.
సబ్సిడీ తగ్గింపు ప్రభావాన్ని వినియోగదారులపై పడకుండా చూస్తామని ఆయన అన్నారు. జూలైలో S1 ఎయిర్‌తో మా రాబోయే పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా గట్టీ పోటిని ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ స్కూటర్ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను సాధిస్తామని అన్నారు. ఇది సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి భారతదేశం అంతటా అనేక ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECలు) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఓలా తన ఆఫ్‌లైన్ ఉనికిని వేగంగా పెంచుకుంటోంది. కంపెనీ ఇటీవలే తన 750వ ECని ప్రారంభించింది. ఆగస్టు నాటికి 1,000కి మరింత విస్తరించాలని యోచిస్తోంది.
ప్రతీ 20 కిలోమీటర్ల పరిధిలో 90% ఓలా కస్టమర్‌లకు అందుబాటులో ఉండేలా అనేక రకాల సేవలను ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను సులభంగా పొందవచ్చు. హైదరాబాద్‌లోను ఓలా తన మార్కెట్ ను వేగంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం ఓలా టూవీలర్ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది.
ఓలా S1 దేశంలోని 2W విభాగంలో అత్యంత ప్రభావితమై EVగా పేరుగాంచింది. సవరించిన సబ్సిడీలు జూన్ నుంచి అమలులోకి రావడంతో, ఇప్పుడు Ola S1 Pro రూ.1,39,999 కి, S1 (3KWh) ₹1,29,999 కి మరియు S1 Air (3KWh) ₹1,09,999 (ఎక్స్-షోరూమ్) ధరలలో అందుబాటులో ఉన్నాయి.
ఫేమ్ 2 పథకం కింద వచ్చే ఏడాది నాటికి పది లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు మద్దతునిచ్చేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ వాహనాలపై సబ్సిడీ మాత్రం తగ్గించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విభాగంలో సేల్స్ మందగించాయి. రానున్న రోజుల్లో ఇవి త్వరగానే పుంజుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగా సంస్థలు కూడా చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








