4 ఎలక్ట్రిక్ బైక్‌లను ఆవిష్కరించిన OLA.. డిజైన్, ఫీచర్లు అదుర్స్..!
భారత దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్న వేళ... ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ OLA ఏకంగా నాలుగు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఆవిష్కరించింది. డిజైన్, ఫీచర్లు పరంగా ఈ నాలుగు వాహనాలు భారీ స్థాయిలో కస్టమర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది.
ఇవాళ ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఆవిష్కరించిన మోటార్ సైకిళ్లలో ఓలా రోడ్‌స్టర్, ఓలా క్రూయిజర్, ఓలా అడ్వెంచర్, ఓలా డైమండ్ హెడ్ బైక్‌లు ఉన్నాయి. స్పోర్ట్స్ మోటార్ సైకిళ్లను ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకొని ఓలా ఈ నాలుగు బైక్‌లను ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. రైడర్‌లను బాగా ఆకట్టుకొనే అవకాశం ఉంది.

ఈ బైక్‌లకు సంబంధించి ఎటువంటి స్పెసిఫికేషన్లను ఓలా సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ బైక్‌లు కేవలం కాన్సెప్ట్ మోడల్‌లు మాత్రమేనని తెలుస్తోంది. ప్రొడక్షన్ మోడల్‌లు వీటికంటే కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న క్రూయిజర్ మోటార్ సైకిల్‌లతో పోల్చితే.. ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఆవిష్కరించిన ఓలా క్రూయిజర్.. డిజైన్ పరంగా కాస్త భిన్నంగా ఉంది. ఓలా క్రూయిజర్ టెలిస్కాపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌పై థిక్ కవర్ సహా పొడవైన స్వింగార్మ్‌లు ఉన్నాయి.

ఇక ఓలా రోడ్‌స్టర్ మోటార్ సైకిల్.. మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డిజైన్ బాగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. మరియు చాలా సింపుల్ మోటార్ సైకిల్‌గా కనిపిస్తుంది. ఈ ఓలా రోడ్‌స్టర్ ముందు భాగంలో అధునాతన USD ఫోర్క్‌లను కలిగి ఉంటుంది.
ఓలా అడ్వెంచర్... మరో కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఈ బైక్ చాలా మందిని ఆకట్టుకొనే అవకాశం ఉంటుంది. మార్కె్ట్‌లో మంచి స్థానం సంపాదించేందుకు ఈ అడ్వెంచర్ బైక్ భారీ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ ముందువైపు అధునాతన USD ఫోర్క్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఓలా డైమండ్‌హెడ్ సూపర్‌స్పోర్ట్స్ బైక్. ఈ మోటార్‌సైకిల్ ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. ఈ ఓలా బైక్ అధునాతన డ్యూయోలెవర్ ఫ్రంట్ సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఓలా ఇవాళ ఆవిష్కరించిన నాలుగు మోటార్ సైకిళ్లు ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ నాలుగు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు భారీ టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ డిస్క్, రియర్ డిస్క్ బ్రేక్, మోనో రియర్ సస్పెన్షన్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ థీమ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ బైక్‌లు కస్టమర్లను భారీగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని ఇచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








