Ola Experience Center వేగం పెంచిన ఓలా ఈవీ.. శ్రీనగర్‌లో 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో తన 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించింది. తన D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను గత కొన్ని వారాలుగా చురుకుగా ప్రారంభించుకుంటూ వస్తుంది.
గత సంవత్సరం పూణేలో తన మొట్టమొదటి ECని ప్రారంభించినప్పటి నుండి కేవలం ఎనిమిది నెలలలోపు దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో అతిపెద్ద D2C రిటైల్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో, దాదాపు 300 నగరాల్లో ఓలా తన ఉనికిని కలిగివుంది. కంపెనీ యొక్క ఓమ్నిచానెల్ వ్యూహం మరియు ఆఫ్‌లైన్ విస్తరణ వేగం కారణంగా, ఓలా నేడు భారతదేశంలో దాదాపు అన్ని మార్కెట్‌లను కవర్ చేస్తూ 98% మార్కెట్ రీచ్‌ను సాధించింది.

ఇప్పటికే శ్రీనగర్‌లో 500వ EC ని ప్రారంభించిన ఓలా, ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని యోచిస్తోంది. భారతదేశంలో మా 500వ స్టోర్ ప్రారంభోత్సవంతో, మా డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) విధానం ద్వారా దేశం అంతటా విజయవంతగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ CMO అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. సుదూర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఎక్సపీరియన్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.
ఈ అద్భుతమైన మైలురాయి ఎలక్ట్రిక్ మొబిలిటీని అందరికీ అందుబాటులోకి మరియు సౌకర్యవంతంగా చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇకపై మరింత దూకుడుగా పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది సంస్థ అంకితభావానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. ఓలా ఎలక్ట్రిక్ ద్వారా భారతదేశంలో పరిశుభ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తు వైపు పరివర్తనకు నాయకత్వం వహించడానికి మేము నిబద్ధతతో ఉన్నామని వివరించారు.

ఈ 500వ స్టోర్ ప్రారంభించడం మా విజయాన్నీ సూచించడంతో పాటు ఇంకా ముందున్న సవాళ్లను కూడా గుర్తు చేస్తుందని చెప్పారు. మా D2C మోడల్‌తో, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో గణనీయమైన ప్రభావాన్ని సృష్టించడానికి తమ సంస్థ ముందు వరుసలో ఉండటం శుభసూచికమని తెలిపారు. అసాధ్యమనుకునే ఏ పనినైనా సుసాధ్యం చేయడానికి ఓలా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉపయోగపడతాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఔత్సాహికులకు ఓలా యొక్క ప్రపంచ స్థాయి ఉత్పత్తులను ఇక్కడ పొందవచ్చు. కొనుగోలు, ఫైనాన్సింగ్ మరియు అమ్మకాల తదితర సేవలను ఈ సెంటర్లు అందిస్తాయి. ఓలా వాహనాలను కొనుగోలు చేసేముందు సందర్శకులు S1 మరియు S1 ప్రో టెస్ట్ రైడ్ కూడా తీసుకోవచ్చు.

ఆటోమొబైల్ రంగంలో D2C సేల్స్ & సర్వీస్ మోడల్‌ను భారతదేశంలో తొలిసారిగా పరిచయం చేసింది ఓలా. ఇందులో భాగంగా, డోర్‌స్టెప్ డెలివరీ మరియు సర్వీసింగ్ సేవలను కంపెనీ అందిస్తుంది. కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 ECలను కలిగి ఉన్నప్పటికీ, కంపెనీ విక్రయాలలో గణనీయమైన భాగం ఇప్పటికీ ఓలా వెబ్‌సైట్ మరియు యాప్‌ల నుండి వస్తుంది. ఓలా యొక్క ఓమ్నిచానెల్ విధానం భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాల అందుబాటుని సులభతరం చేసింది.
ఓలా ప్రస్తుతం భారతదేశ ద్విచక్ర ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో 40% వాటాని స్వాధీనం చేసుకుంది. గత నెలలో, కంపెనీ తన అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేసింది, 30,000 యూనిట్లకు పైగా విక్రయించబడింది మరియు వరుసగా ఎనిమిదో నెలలో EV 2W అమ్మకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications








