బుకింగ్స్‌లో దూసుకుపోతున్న ఓలా ఎస్1 ఎయిర్.. ఆ ఆఫర్ ఆగస్టు 15 వరకు పొడిగింపు.!!
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ జూలై నెలలో ఆకట్టుకునే అమ్మకాలను సాధించి ఈవీ టూ వీలర్ మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 40 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఇది జూలైలో 19,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 375 శాతం వృద్ధిని సాధించింది.
ఓలా తన S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సరసమైన ధరలో జూలై 27 నుంచి బుకింగ్‌లు ప్రారంభించింది. ఈ స్కూటర్ బుకింగ్‌లతో బిజీగా ఉండగా.. ఇప్పటివరకు 50,000 మందికి పైగా కస్టమర్లు బుక్ చేసుకున్నారు. కొనుగోలుదారుల నుంచి ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఎలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌ల గురించి ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడారు. ఐసీఈ స్కూటర్లకు సమాధానంగా కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఎయిర్ రాబోతోందన్నారు. ఇది, ICE శక్తితో నడిచే వాహనాలకు ఒక శకం ముగింపుని ఇస్తుందన్నారు. S1 ఎయిర్ డెలివరీలు ఆగస్టులో ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు జూలై 27 నుంచి రూ.1,09,999 బేసిక్ ధరతో ప్రారంభమయ్యాయి. కేవలం మూడు గంటల్లోనే 3 వేలకు పైగా ఆర్డర్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ ధరలో బుకింగ్ జూలై 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత, జూలై 31 నుంచి ధర రూ.1,19,999గా ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1,09,999 ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచాలని చాలా మంది కస్టమర్లు అభ్యర్థించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన కంపెనీ ఆగస్టు 15 లోపు బుకింగ్ చేసుకునే వారికి అదే ధరకే ఈ స్కూటర్‌ను అందించాలని నిర్ణయించింది.
కాగా Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా వినియోగదారులకు డెలివరీ చేయనుంది. ఎస్1 ఎయిర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో దేశంలో ఈవీ వ్యాప్తిని వేగవంతం చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఓలా ఎలక్ట్రిక్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
S1 ఎయిర్ 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దాని హబ్ మోటార్ 6 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త S1 ఎయిర్ కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. గంటకు 90 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. హై స్పీడ్‌తో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయనుంది.
ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫీచర్లను పరిశీలిస్తే.. 7-అంగుళాల TFT స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, OTA అప్‌డేట్‌లతో సహా డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తుంది. స్టెల్లార్ బ్లూ, పోర్సిలైన్ వైట్‌తో సహా వివిధ రంగుల్లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, అరుదైన ట్విన్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్ మరియు డ్రమ్ బ్రేక్ ఆప్షన్ ఉన్నాయి.
ఇంకా, ఓలా S1 ఎయిర్‌ను ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మరియు S1 ప్రోను టాప్-ఎండ్ మోడల్‌గా విక్రయించాలని ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది. ఈ క్రమంలో మిడ్ వెర్షన్ S1 విక్రయాన్ని నిలిపివేసింది. ప్రస్తుతం ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్స్‌లో సునామీ సృష్టించగా, ఇప్పటివరకు 50,000కు పైగా బుకింగ్‌లు అందుకుంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








