కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు షురూ..

దేశీయ మార్కెట్లో ఓలా గురించి తెలియని వారుండరు. క్యాబ్‌ సర్వీస్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా గుర్తింపు పొందింది. ఓలా తన S1 సిరీస్ లైనప్‌లో సరికొత్త స్కూటర్ల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే

ఓలా ఇ- స్కూటర్లను ఉన్న డిమాండ్‌తో గత కొంత కాలంగా విక్రయాల్లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది ఓలా. ఇటీవల ఓలా తన S1 సిరీస్‌లో S1 ఎయిర్ స్కూటర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది.

Ola-S1-Air-Scooter

కొత్త ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీని అందుకున్న మొదటి కస్టమర్లు దీనిపై ఆనందం వ్యక్తం చేశారు. కంపెనీ తన బుకింగ్‌లను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 50,000 పైగా ఆర్డర్లను అందుకుంది. ఆగస్టు 15 లోపు స్కూటర్‌ను బుక్ చేసుకున్న వారికి రూ.1,09,999 ధరకు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం దీని ధర రూ.1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

ఓలా దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నగరాల్లో S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పంపిణీని చేపట్టింది. రాబోయే రోజుల్లో ఇతర నగరాలకు సైతం ఈ సర్వీసులు విస్తరించనున్నాయి. ఈ స్కూటర్లకు ఉన్న డిమాండ్ కారణంగా తయారీ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని కూడా పెంచింది. ఓలా S1 Air Gen2 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించారు. ఇది అప్‌డేట్ చేసిన బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

Ola-S1-Air-Scooter

కొత్త Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో రూపొందించారు. ఇది పూర్తి ఛార్జ్‌పై 151 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇందులో ఉపయోగించిన BLDC హబ్ మోటార్ 6 kW (8 bhp) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

కొత్త Ola S1 ఎయిర్ కేవలం 5.7 సెకన్లలో 0 నుండి 60 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని బ్యాటరీ ప్యాక్ గృహ విద్యుత్తును ఉపయోగించి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు. దీనికి బదులుగా, ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు. ఇందులో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, అరుదైన ట్విన్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.

Ola-S1-Air-Scooter

Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులో ప్రవేశపెట్టారు. ఈ స్కూటర్ స్టెల్లార్ బ్లూ, నియాన్, కోరల్ గ్లామ్‌, పింగాణీ వైట్, మిడ్ నైట్ బ్లూ, లిక్విడ్ సిల్వర్ వంటి ఆకర్షణీయమైన ఆరు రంగుల ఆప్షన్లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 34-లీటర్ కెపాసిటీ గల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లలో ప్రయాణించవచ్చు. ఇందులో యువ కస్టమర్లను ఆకర్షించే అనేక ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల TFT స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, OTA అప్‌డేట్‌లు కలిగి ఉండటం ప్రత్యేకత.

ఇంకా, S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోని 1,000 కంటే ఎక్కువ ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్‌లు కంపెనీ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ఆకర్షణీయమైన ఫీచర్లతో సరసమైన ధరలో అందుబాటులో ఉంది. స్కూటోర్ డెలివరీలు ప్రారంభం కావడంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు కొన్ని రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, August 24, 2023, 12:55 [IST]
English summary
Ola s1 air electric scooter deliveries start in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+