ఇదే Ola ప్రత్యేకత.. S1 ఎయిర్‌ స్కూటర్‌కు 5 లక్షల కిలోమీటర్ల టెస్ట్‌ డ్రైవ్‌..!!

ప్రస్తుతం అనేక మంది ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్ ఏంటని ఎవరిని అడిగినా వారు చెప్పే లిస్ట్‌లో Ola స్కూటర్‌ తప్పకుండా ఉంటుంది. అంతగా ఓలా స్కూటర్లు ప్రజలకు కనెక్ట్‌ అయ్యాయి. అయితే ఓలా నుంచి ఓ ఆసక్తికర ప్రకటన వచ్చింది.

Ola S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 5 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవ్‌ చేసి పరీక్షించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెలలో ఓలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ఎస్‌ 1 ఎయిర్‌ సహా కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓలా S1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని, సరసమైన ధరలో మోడల్‌ను తీసుకొస్తుంది.

Ola S1 Air electric scooter

Ola S1, S1 ప్రోలో వినియోగించిన బెల్ట్ డ్రైవ్‌కు బదులుగా S1 ఎయిర్‌ హబ్‌ మోటార్‌తో వస్తుంది. S1 ఎయిర్‌ స్కూటర్‌ను గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదల చేసినప్పుడు.. ఈ వాహనం 2.7kW మోటార్‌ను కలిగి ఉంది. అనంతరం దాన్ని 4.5kWకు పెంచింది. బ్యాటరీ ప్యాక్ 3kWhను కలిగి ఉంటుంది.

S1 ఎయిర్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో 125 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని సంస్థ చెబుతోంది. అయితే ఎంత సమయంలో బ్యాటరీ పుల్‌ ఛార్జి అవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. S1 ఎయిర్‌ గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని ఓలా వెల్లడించింది.

Ola S1 Air electric scooter

ఈ స్కూటర్‌ డిజైన్‌ ఓలా S1, S1 ప్రో తరహాలోనే ఉంటుంది. LED డే టైం రన్నింగ్‌ ల్యాంప్‌, హెడ్‌ల్యాంప్‌, ఫ్రంట్‌ ఆప్రాన్‌, బాడీ ప్యానల్‌లు అన్ని కూడా S1, S1 ప్రోను పోలి ఉంటాయి. ఓలా S1 ఎయిర్‌.. కోరల్‌ గ్లామ్, పింగాణి వైట్‌, మిడ్‌నైట్‌ బ్లూ, లిక్విడ్‌ సిల్వర్‌ రంగుల్లో లభించనుంది. ఎకో, నార్మల్‌, స్పోర్ట్‌ రైడింగ్‌ మోడ్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఓలా S1 ఎయిర్‌ ధరను తగ్గించేందుకు కొన్ని ఫీచర్లలో మార్పులు చేశారు. 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, MoveOS 3,0 కనెక్టివిటి, రివర్స్‌ మోడ్‌, OTA అప్‌డేట్‌లు, రివర్స్‌ మోడ్‌, ప్లాట్‌ ఫ్లోర్‌ బోర్డు, 34 లీటర్ల బూట్‌స్పేస్‌, రిమోట్‌ బూట్‌ లాక్‌/అన్‌లాక్‌ మరియు సైడ్‌ స్టాండ్‌ అలెర్ట్‌ను కలిగి ఉంటుంది.

Ola S1 Air electric scooter

తక్కువ ధర కారణంగా S1 ఎయిర్‌ స్కూటర్‌ సన్పన్షన్ వ్యవస్థలో మార్పులు చేశారు. ముందువైపు మోనోషాక్ సస్పెన్షన్‌ సెటప్‌కు బదులుగా టెలిస్కోఫిక్‌ ఫోర్క్‌లను కలిగి ఉంటుంది. వెనుకవైపు మోనోషాక్‌ సస్పెన్షన్‌కు బదులుగా షాక్‌ అబ్జార్బర్‌లతో వస్తుంది. డిస్క్‌ బ్రేకులకు బదులుగా డ్రమ్‌ బ్రేకులతో వస్తుంది.

ఓలా కమ్యూనిటీ, ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వారికి జులై 28 నుంచి 30 జులై మధ్య ప్రారంభ ధర కింద రూ.1,09,999కు సొంతం చేసుకోవచ్చని ఓలా సంస్థ తెలిపింది. మిగిలిన వారికి 31 జులై నుంచి ధర రూ.1,19,999కు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రారంభ ధర పొందేందుకు ముందస్తు బుకింగ్‌లు చేసుకోవాలని కోరింది. ఆగస్టు తొలివారం నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల‌్‌మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, July 21, 2023, 19:39 [IST]
English summary
Ola s1 air electric scooter has been tested over 5 lakh km and will be delivered by early august
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+