Ola S1 Air లాంచ్‌కు ముందు ఓలా నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ఆకట్టుకుంటున్న టెస్ట్‌ రైడ్‌ వీడియో..

భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా ఓలా (Ola) ప్రజాదరణ పొందింది. ఓలా కంపెనీ విక్రయిస్తున్న 'S1' సిరీస్(Ola Electric Scooter) స్కూటర్ల పట్ల ఇప్పటికే మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇప్పుడు, ఈ S1 ఎయిర్ స్కూటర్‌(Ola S1 Air)కు సంబంధించి మరో తాజా అప్‌డేట్‌తో మీ ముందుకొచ్చాం.

ఓలా ఎస్‌1 ఎయిర్‌కు సంబంధించి ఓలా ఎలక్ట్రిక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ 'S1 ఎయిర్'ని మార్కెట్‌(Ola S1 Launch Date)లో విడుదల చేయనుంది. అయితే, లాంచ్ తేదీ గురించి వీడియోలో ఎటువంటి సమాచారం లేదు. గతంలో ఈ కంపెనీ బెంగళూరులో టార్మాక్‌పై 'S1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరీక్షించింది.

Ola-S1-Air

ప్రస్తుత వీడియోలో రైడర్లు వివిధ రంగుల్లో లభించే S1 ఎయిర్ స్కూటర్‌లను టార్మాక్‌పై వేగవంతంగా నడిపిస్తున్నారు. దీని ద్వారా వాటి సామర్థ్యాలను ప్రదర్శించడాన్ని మనం చూడవచ్చు. ఇది S1 సిరీస్ యొక్క ఎంట్రీ లెవెల్ స్కూటర్. ఈ స్కూటర్‌కు సంబంధించి ధర మరియు స్పెసిఫికేషన్ల గురించి కొన్ని నెలల క్రితం పూర్తి సమాచారాన్ని వెల్లడించింది. అంతేకాకుండా బుకింగ్‌లు(Ola S1 Launch details) కూడా ప్రారంభమయ్యాయి.

ఓలా S1 ఎయిర్ ప్రధానంగా FAME సబ్సిడీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 3 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికతో వస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 125 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

Ola-S1-Air

ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ (Ola S1 Air) డ్రమ్ బ్రేక్ ఎంపికతో వస్తుంది. బ్యాటరీ 4 గంటల 30 నిమిషాలలో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్స్. డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది. 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, LED లైటింగ్, మ్యూజిక్ కంట్రోల్, రిమోట్ అన్‌లాకింగ్, సైడ్-స్టాండ్ అలర్ట్, OTA అప్‌డేట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఓలా కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఇతర S1 సిరీస్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే, మిడ్ లెవల్ వెర్షన్ 'S1' ధర రూ.1.30 లక్షలు ఎక్స్-షోరూమ్‌లో ఉంది. ఇది 141 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. టాప్-ఎండ్ మోడల్, 'ఎస్1 ప్రో' స్కూటర్ రూ.1.40 లక్షల ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 181 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

Ola-S1-Air

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఓలా కంపెనీ భారతదేశంలో రెండవ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ తయారీ యూనిట్. ఈ తయారీ యూనిట్ తమిళనాడులోని కృష్ణగిరిలో 115 ఎకరాల్లో (సెల్ గిగాఫ్యాక్చరీ) విస్తరించి ఉంది. ఇది కంపెనీ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తుంది.

కాగా ఓలా కంపెనీ జూన్ చివరి నెలలో 18,000 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంతే కాకుండా 40 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్(Ola S1 launch in July) ఈ నెలలో విడుదల కానుంది. తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఈ స్కూటర్‌పై వినియోగదారులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, July 10, 2023, 18:01 [IST]
English summary
Ola s1 air electric scooter test ahead of official launch details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+