పిచ్చెక్కిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొత్త కలర్.. ఫీచర్లు చూస్తే ఖచ్చితంగా కొంటారు..!

ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ దూసుకెళ్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో కస్టమర్లను ఓలా ఆకర్షిస్తుంది. తాజాగా ఈ కంపెనీ నుంచి భారీ అంచనాల మధ్య విడుదలైన ఎస్ 1 ఎయిర్ స్కూటర్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఈ మోడల్‌లో తీసుకువచ్చిన నియాన్ గ్రీన్ కలర్ వినియోగదారుల చూపులను దోచుకుంటుంది. ఆ వివరాలు ఈ కథనంలో..

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఓలా ఎలక్ట్రిక్ ఒకటి. ప్రస్తుతం ఈ విభాగంలో ఓలా తన సత్తాను చాటుతోంది. జూలై 2023లోనే ఓలా బ్రాండ్ నుంచి దాదాపు 19,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. రాబోయే నెలల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Ola-S1-Air-Scooter

ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు డీలర్ల వద్దకు చేరుకున్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో నియాన్ గ్రీన్ స్కూటర్‌ చిత్రాలకు విశేష స్పందన వస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త కలర్‌ స్కూటర్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. దీంతో వీటిని కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ఎయిర్ బుకింగ్‌లను కొన్ని రోజుల నుంచి సంస్థ స్వీకరిస్తుంది. ఈ బుకింగ్స్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 50,000 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బుక్ అయ్యాయని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఎక్స్ (ట్విట్టర్‌)లో తెలిపారు. బుకింగ్‌లను మరింతగా ఆకట్టుకోవడానికి, ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగస్టు 1 వరకు రూ .1.09 లక్షల తగ్గింపు ధర (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉండనుంది.

Ola-S1-Air-Scooter

ఆగస్టు 15 తర్వాత ధర రూ.10,000 పెరిగే అవకాశం ఉండటంతో చాలా మంది పోటీ పడి అంతకంటే ముందే ఈ స్కూటర్లను బుక్ చేసుకుంటున్నారు. ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా డీలర్ షిప్ షోరూమ్ లకు చేరుకోవడం ప్రారంభించాయి. ఈ స్కూటర్ ను బుక్ చేసుకున్న వారికి త్వరలోనే డెలివరీ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

షోరూమ్ ల నుండి విడుదలైన ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ నియాన్ గ్రీన్ కలర్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈ కలర్‌లో తీసుకురావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎస్ 1, ఎస్ 1 ప్రో అనే రెండు వేరియంట్లలో అందించారు. వాటిలో ఈ కలర్‌లో విడుదల చేయలేదు.

ఎస్1 ఎయిర్ స్కూటర్‌ని 2022 అక్టోబర్‌లో సంస్థ లాంఛ్ చేసింది. అయితే, దాదాపు తొమ్మిది నెలల తర్వాత జూలై నెలాఖరున ఎస్ 1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎస్ 1 వేరియంట్ అమ్మకాలు నిలిపివేయడంతో ప్రస్తుతానికి ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ప్రో స్కూటర్లను మాత్రమే విక్రయిస్తున్నారు. వీటితో పాటు మధ్యలో ఏదైనా కొత్త వేరియంట్ ప్రవేశపెడుతుందో లేదో వేచి చూడాలి.

నియాన్ గ్రీన్ కలర్‌తో పాటు, కొత్త ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 5 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అత్యాధునిక మూవ్ ఓఎస్3 సాఫ్ట్‌వేర్‌తో అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పార్టీ మోడ్, బ్లూటూత్ కాలింగ్, మూడ్స్, ప్రొఫైల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే స్మార్ట్‌ అన్‌లాక్‌ సిస్టంతో కొంత దూరం నుంచి అన్లాక్ చేయవచ్చు.

ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకేజీని కలిగి ఉంది. 4.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు కలిగిన ఈ బ్యాటరీ ప్యాకేజ్ పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 125 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 125 కిలోమీటర్ల పరిధిని పొందడానికి మీరు ఎకో మోడ్లో వెళ్లాలి. ఇందులో ఎస్ 1 ఎయిర్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు మోడ్స్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 2, 2023, 17:04 [IST]
English summary
Ola s1 air scooters in new neon green color
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+