Ola S1 X+ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెలివరీలు ప్రారంభం.. ఏకంగా రూ. 20,000 తగ్గింపు, 151 కి.మీ రేంజ్‌

ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ దూసుకుపోతోంది. సరసమైన ధర, అద్భుతమైన పనితీరుతో కస్టమర్లలో ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో సంస్థ ఇటీవల విడుదల చేసిన S1 X ప్లస్‌ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. కాగా దీనిపై రూ. 20,000 ఫ్లాట్‌ క్యాష్‌ డిస్కౌంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే..

ప్రముఖ భారతీయ EV కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా S1 X+ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. రూ. 20,000 వేల ఫ్లాట్‌ క్యాష్‌ డిస్కౌంట్‌తో S1 X+ ధర ఇప్పుడు కేవలం రూ. 89,999 పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. దేశీయ మార్కెట్లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఓలా ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

Ola-S1-X+-Electric-Scooter

కాగా ఓలా S1 X ప్లస్(Ola S1X +) ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సంస్థ రూ. 1,09,999 ధరతో ప్రవేశపెట్టింది. ప్రత్యేక ఆఫర్‌ కింది. రూ. 20,000 తగ్గింపును ప్రకటించడంతో ఇప్పుడు ఈ స్కూటర్‌ కేవలం రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఈ డిసెంబర్ నెల మొత్తం చెల్లుబాటు అవుతుంది.

కొత్త ఓలా S1 X+ స్కూటర్(Electric Scooter) ఫీచర్ల విషయానికొస్తే.. దీనిని టాప్ Gen 2 ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ అద్భుతమైన పనితీరుతో పాటు అధునాతన సాంకేతిక లక్షణాలను కలిగి ఉంది. అంతే కాకుండా రైడర్లు అద్భుతమైన రైడ్ క్వాలిటీని పొందవచ్చు.

Ola-S1-X+-Electric-Scooter

ఓలా S1 X+ స్కూటర్ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 3kWh బ్యాటరీని పొందుపరిచారు. సింగిల్‌ ఛార్జ్‌పై 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్‌తో సంస్థ దీనిని ప్రవేశపెట్టింది. ఈ ఇ స్కూటర్‌లో 6kW ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అమర్చారు. S1 X+ కేవలం 3.3 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 90 km వేగంతో ప్రయాణిస్తుంది.

ఆకర్షణీయమైన ఫీచర్లతో ఓలా S1 X+ స్కూటర్‌ను తక్కువ ధరలో అందించడంతో దీనికి డిమాండ్‌ కూడా అధికంగా ఉంది. అయినప్పటికీ కస్టమర్లను వెయిటింగ్‌ పీరియడ్‌లో ఉంచకుండా త్వరితగతిన డెలివరీలు ప్రారభించింది. దేశీయ మార్కెట్లో మరో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సంస్థ ఈథర్‌.. ఓలా ఎలక్ట్రిక్‌కు గట్టి పోటీనిస్తోంది.

అంతేకాకుండా 'డిసెంబర్ టు రిమెంబర్' ప్రచారంలో భాగంగా, ఓలా స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు. ఓలా అన్ని స్కూటర్లపై పొడిగించిన వారంటీపై 50% తగ్గింపును పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రతి విజయవంతమైన రిఫరల్‌పై రూ. 2,000 క్యాష్‌బ్యాక్‌ సదుపాయాన్ని సంస్థ కల్పించింది.

S1 ప్రో Gen-2 లేదా S1 ఎయిర్ కొనుగోలుపై రిఫరీ రూ. 3,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చని ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ఓలా స్కూటర్ సెగ్మెంట్ విషయానికొస్తే.. కంపెనీ ఇటీవల తన S1 పోర్ట్‌ఫోలియోను మొత్తం ఐదు స్కూటర్‌లకు విస్తరించింది. వాటి వాటి విభాగాల్లో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు భారీ డిమాండ్‌తో దూసుకుపోతోంది.

ఓలా ఫ్లాగ్‌షిప్ స్కూటర్ S1 ప్రో (2nd Gen) ధర రూ. 1,47,499 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇక S1 ఎయిర్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రూ. 1,19,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. చివరిగా మిగిలిన S1X ను S1 X+, S1 X (3kWh), S1 X (2kWh) మోడల్‌లలో సంస్థ ప్రవేశపెట్టింది.

S1 X సిరీస్‌ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు.. S1 X (3kWh), S1 X (2kWh) రూ. 999తో బుక్ చేసుకోవచ్చని ఓలా తెలిపింది. S1 X (3kWh) మరియు S1 X (2kWh) స్కూటర్‌ల ధర రూ. 99,999 మరియు రూ. 89,999 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది.

More from DriveSpark

Article Published On: Saturday, December 9, 2023, 16:41 [IST]
English summary
Ola s1 x plus electric scooter deliveries start in india range price features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+