తక్కువ ధరలో ఓలా నుంచి కొత్త స్కూటర్.. ఆగస్టు 15న లాంఛ్ చేసే అవకాశం..!!

ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ హవా కొనసాగుతోంది. ఓలా S1 సిరీస్‌ స్కూటర్‌లకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ఇటీవలే S1 ఎయిర్‌ను లాంచ్‌ చేసిన సంస్థ.. తమ స్కూటర్ల శ్రేణిలో నుంచి S1 స్కూటర్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓలా మరో స్కూటర్‌ను సిద్ధం చేస్తోంది.

దేశీయ మార్కెట్‌లో ఈవీ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్​ మంచి జోరు మీద ఉంది. S1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను నిలిపివేసిన అనంతరం మరో ఎలక్ట్రిక్​ స్కూటర్​ను సిద్ధం చేస్తోంది. దీని పేరు ఓలా ఎస్​1ఎక్స్(Ola S1X)​. ఈ మోడల్‌ను ఈ నెల 15న మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు సమాచారం. ఈ స్కూటర్‌ ధర.. ఎస్​1 ఎయిర్​ ధర కన్నా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

Ola-S1X

ఇటీవలే S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఓలా విడుదల చేసింది. ఊహించని రీతిలో బుకింగ్‌ల ద్వారా ఇది హాట్‌ టాపిక్‌గా నిలిచింది. కాగా S1X పేరుతో కొత్త స్కూటర్‌ను అభివృద్ధి చేయడంలో కంపెనీ బిజీగా ఉంది. ఈ స్కూటర్‌ను ఓలా యొక్క ఎంట్రీ-లెవల్ మోడల్‌గా తీర్చిదిద్దనుంది. సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెతుకుతున్న కొనుగోలుదారులకు ఇది మంచి ఆప్షన్‌.

కొత్త S1X ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది. ఓలా కంపెనీ స్వయంగా 'ICE కిల్లర్‌'గా దీనిని అభివర్ణించింది. ఎందుకంటే భారత్‌లో 125సీసీ పెట్రోల్ పవర్డ్ స్కూటర్ల ధర దాదాపు రూ.1 లక్ష ఉంది. ఈ S1X ఎలక్ట్రిక్ స్కూటర్ దాని కంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా అధునాతన ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఓలా ఎలక్ట్రిక్​.. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను న్యూ జనరేషన్​ ప్లాట్​ఫామ్‌పై రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎస్​1 ఎయిర్​కు సంబంధించి కొన్ని ఫీచర్స్ అలాగే​ ఉండొచ్చు. వీల్స్​, సస్పెన్షన్స్​, హార్డ్​వేర్​ కాంపోనెంట్స్​ ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా ఓలాకు ఈ కొత్త స్కూటర్‌ డెవలప్​మెంట్​ కాస్ట్​ తగ్గుతుంది.

ఓలా కంపెనీ విడుదల చేసిన S1X చిత్రాలను పరిశీలిస్తే, దీని డిజైన్ ప్రస్తుతం ఉన్న S1 సిరీస్ స్కూటర్లను పోలి ఉంటుంది. ఓల్​ ఎస్​1 ఎయిర్​లో ఉన్న హెడ్​ల్యాంప్​ డిజైన్​, ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్​, ప్రొజెక్టర్​ సెటప్​, రేర్‌ టెయిల్‌ ల్యాంప్‌ లాంటి డిజైన్‌తోనే ఎస్1ఎక్స్​ ఉండొచ్చు.

ఇక కొత్త S1X ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫ్రంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో గ్యాస్​ ఛార్జ్​డ్​ షాక్​ అబ్సార్బర్స్​ ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్​, రేర్​ వీల్స్​కు డ్రమ్​ బ్రేక్స్​ వస్తాయి. కంబైన్డ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ ఉండొచ్చు. అలాయ్​ వీల్స్​ స్థానంలో స్టీల్​ వీల్స్​ వస్తాయని సమాచారం. ఇక పూర్తి ఛార్జింగ్‌పై 100 కి.మీల రేంజ్‌ను అందించవచ్చు. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

ఈ రెండు స్కూటర్లలో ఫీచర్లు కూడా ఒకేలా ఉండొచ్చు. స్క్రీన్​ రిసొల్యూషన్​ తక్కువగానే ఉండనుంది. మరి ఈ కొత్త ఈ-స్కూటర్​లో నేవిగేషన్​, బ్లూటూత్​, కనెక్టివిటీ, ఇంటర్నెట్​ కనెక్షన్​ వంటి ఫీచర్స్​ ఉంటాయా? లేదా? అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఆగస్ట్​ 15న స్కూటర్‌ను లాంచ్‌ చేశాక ఈ మోడల్​పై మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.

ఓలా లైనప్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే, Ola S1X మినిమలిస్టిక్ డిజైన్‌తో రావచ్చు. ధర తక్కువగా ఉన్నంతమాత్రాన ఈ లేటెస్ట్ వెహికల్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్‌లో ఏమాత్రం రాజీపడకపోవచ్చు. ఎంట్రీ లెవల్ ఇ-స్కూటర్‌గా రానున్న ఓలా S1X రోజువారీ ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. పెట్రోల్‌ టూవీలర్స్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త వాహనాన్ని కొనాలనుకునే వారికి ఈ పర్యావరణ అనుకూలమైన, చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

ఎస్1​ ఎలక్ట్రిక్​ స్కూటర్​కు ఓలా గుడ్​ బై చెప్పేశాక.. ఇప్పుడు ఈ సంస్థ పోర్ట్​ఫోలియోలో ఎస్​1 ఎయిర్​, ఎస్​1 ప్రో మోడల్స్​ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు S1X విడుదలయ్యాక ఆ జాబితాలో ఈ స్కూటర్‌ చేరనుంది. జూలై 27 నుంచి ఎస్‌1 ఎయిర్‌ స్కూటర్‌కు కంపెనీ ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. వారం రోజుల్లోనే 50,000కు పైగా బుకింగ్స్‌ని పొంది రికార్డు సృష్టించినట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, August 7, 2023, 15:21 [IST]
English summary
Ola s1x to be launched on august 15th price less than rs 1 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+