Simple Dot One సింపుల్ ఎనర్జీ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 151 కి.మీ రేంజ్
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ సింపుల్ ఎనర్జీ(Simple Energy) నుంచి మరో కొత్త స్కూటర్ నేడు(శుక్రవారం డిసెంబర్ 15) లాంచ్ అయింది. గత మేలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన సంస్థ.. ఇప్పుడు సరసమైన ధరలో సింపుల్ డాట్ వన్ స్కూటర్‌ను విడుదల చేసింది.
భారత మార్కెట్లో సింపుల్ ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. కాగా నేడు కొత్త Simple Dot One Electric Scooter ను రూ. 99,999 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఈ స్కూటర్ డెలివరీలు ముందుగా బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత దేశంలోని ఇతర నగరాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. కాగా కంపెనీ ప్రకటించిన రూ. 99,999 ధర ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. జనవరి 2024 లో సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ధరను సంస్థ ప్రకటిస్తుంది.
Simple Dot One ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. స్కూటర్ డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. సింపుల్ ఎనర్జీ ఈ స్కూటర్‌ను బ్రజెన్ బ్లాక్, గ్రే వైట్‌తో సహా 4 కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది. సింపుల్ డాట్ వన్ ఇ-స్కూటర్ కూడా సింపుల్ వన్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. కాగా ఫీచర్లు, డిజైన్‌లో కొన్ని మార్పులను చూడవచ్చు.

సింపుల్ Dot One ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. కాగా ఈ స్కూటర్ గరిష్ఠంగా 160 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 151 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.
సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 72 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పనితీరు పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ అని చెప్పవచ్చు.
ఇక సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ట్యూబ్‌లెస్ టైర్లతో ముందు మరియు వెనుక 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంకా CBS (Combi Braking System), భద్రత కోసం డిస్క్ బ్రేక్ ఎంపికను చూడవచ్చు. ఇందులో 35-లీటర్ కెపాసిటీ అండర్-సీట్ స్టోరేజీ సౌకర్యాన్ని కల్పించారు.
సింపుల్ డాట్ వన్ ఇ-స్కూటర్‌లో ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, OTA అప్‌డేట్‌లతో కూడిన Android OS వంటి డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు, గరిష్ఠ రేంజ్‌తో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.
కాగా గత మేలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1.45 లక్షల నుంచి రూ. 1.5 లక్షల (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ధరతో సంస్థ విడుదల చేసింది. ఇందులో 5 kWh కెపాసిటీ గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. పూర్తి ఛార్జ్‌పై 212 కిమీ (IDC) రేంజ్‌ను అందిస్తుంది.
దీని ఎలక్ట్రిక్ మోటార్ 11.39 bhp గరిష్ట శక్తిని, 72 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ తెలిపింది. సింపుల్ వన్ ఇ-స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 - 40 కిమీ వేగాన్ని అందుకోగా.. గరిష్ఠంగా 105 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీని 0-80 శాతం ఛార్జ్ చేయడానికి 5 గంటల 54 నిమిషాల సమయం పడుతుంది.


Click it and Unblock the Notifications








