151 కి.మీ రేంజ్‌తో సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర రూ. లక్ష లోపే.!!
బెంగళూరుకు చెందిన స్టార్టప్ సింపుల్ ఎనర్జీ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరికొద్ది రోజుల్లో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఓలా ఎస్ 1 ఎక్స్‌కి పోటీగా సింపుల్ డాట్ వన్ స్కూటర్‌ను డిసెంబర్ 15 న మార్కెట్లోకి రానుంది. ఈ క్రమంలో సింపుల్ ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ పర్ఫామెన్స్ ఈ కథనంలో..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా నడుస్తోంది. నిత్యం భారత మార్కెట్లోకి విడుదలవుతున్న కొత్త ఈవీలే ఇందుకు ఉదాహరణ. లో మెయింటెనెన్స్, ఫ్యూయెల్ ఛార్జీలు లేకపోవడం, తక్కువ బరువు కారణంగా ప్రజలు ఎక్కువగా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా సరికొత్త డిజైన్‌లు, అధిక రేంజ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

సింపుల్ ఎనర్జీ నుంచి ఈ ఏడాది డిసెంబర్ 15 న Simple Dot One Electric Scooter ను విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. కాగా దీని ధర రూ. లక్ష లోపే ఉండనున్నట్లు సమాచారం. ప్రముఖ టూ వీలర్ సంస్థ ఓలాకు చెందిన S1X కు ఈ సరికొత్త స్కూటర్ గట్టి పోటీ ఇవ్వనుంది.
సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు అదే రోజు అంటే డిసెంబర్ 15 నే ప్రారంభం కాున్నాయి. కొత్త ఏడాది 2024 జనవరిలో స్కూటర్ డెలివరీలు ప్రారంభం అవుతాయని సంస్థ తెలిపింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌పై సింపుల్ డాట్ వన్ కూడా తయారవుతోంది.

ఇక సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. గరిష్ఠంగా ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 151 రేంజ్‌ను ఇస్తుందని సింపుల్ ఎనర్జీ తెలిపింది. కాగా ఈ స్కూటర్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌కు సంబంధించిన వివరాలను సంస్థ తెలుపలేదు. అయితే సింపుల్ వన్ కంటే తక్కువ శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ ఉండవచ్చని భావిస్తున్నారు.
కొత్త సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను పరిశీలిస్తే.. సింపుల్ వన్ మాదిరిగానే చిన్న కాస్మెటిక్ ట్వీక్‌లతో డిజైన్‌ను కలిగి ఉండవచ్చు. ఇందులు డిస్క్ బ్రేక్‌లు లేకపోవచ్చు. కానీ CBS తో డ్రమ్ బ్రేక్‌లు ఉండవచ్చు. సస్పెన్షన్ విషయానికొస్తే వెనుకవైపు మోనోషాక్‌తో, ఫ్రంట్ భాగంలో టెలిస్కోప్ యూనిట్ ఉండవచ్చని సమాచారం.

సింపుల్ డాట్ వన్ స్కూటర్‌లో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో యాప్ కనెక్టివిటీతో కూడి టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. LED లైటింగ్, నావిగేషన్, ఫోన్, మెసేజ్ నోటిఫికేషన్ల కోసం బ్లూటూత్ ఇంటిగ్రేషన్ సహా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో 30 లీటర్లకు పైగానే స్టోరేజ్ కెపాసిటీ ఉండొచ్చు.
రూ. లక్ష కన్నా తక్కువ ధరలో సింపుల్ డాట్ వన్‌ను సింపుల్ ఎనర్జీ లాంచ్ చేస్తుండటంతో.. కస్టమర్లకు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్‌గా ఉండనుంది. కాగా సింపుల్ వన్ ఇ స్కూటర్ విషయానికొస్తే.. ఇందులో 5kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 8.5 kW పవర్ అవుట్‌పుట్, 4.5 kW విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 105 కి.మీ వేగంతో దూసుకుపోగా.. పూర్తి ఛార్జ్‌పై 212 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇందులో ఎకో, రైడ్, డాష్, సోనిక్ ఇలా నాలుగు రైడ్ మోడ్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








