స్మార్ట్ ఫీచర్స్‌తో కొత్త హోండా యాక్టివా.. ఈ స్పెషాలిటీ చూస్తే వెంటనే కొనేస్తారు!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా 2025 యాక్టివా 125 స్కూటర్(Honda Activa 125) అప్‌డేట్ వెర్షన్‌నును విడుదల చేసింది. ఈ స్కూటర్ ఎంట్రీ-లెవెల్ వేరియంట్ ధర రూ. 94,422(ఎక్స్-షోరూమ్) గా సంస్థ నిర్ణయించింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త అప్‌డేట్‌లతో యాక్టివా 125 అందుబాటులోకి వచ్చింది.
భారత మార్కెట్లో హోండా యాక్టివా సేల్స్ పరంగా దూసుకుపోతోంది. ఇక అప్‌డేటెడ్ వెర్షన్‌లో మార్పులను పరిశీలిస్తే.. యాక్టివాలో TFT స్క్రీన్‌ను అప్‌డేట్ చేసింది. స్క్రీన్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు నావిగేషన్ యాక్సెస్‌ను అందిస్తోంది. దీంతో పాటు మీ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే కాల్స్, టెక్ట్స్ మెసేజ్‌లను కూడా ఈ స్క్రీన్ ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంది.

మీ మొబైల్ ఫోన్‌ను 'Honda Road-Sync' యాప్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌లను మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ఈ TFT స్క్రీన్ పరిమాణం 4.2 అంగుళాలుగా ఉంది. ఇది కాకుండా, 2025 యాక్టివా స్కూటర్(2025 Honda Activa 125) USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను సంస్థ అందిస్తోంది.
ఇక హోండా యాక్టివా 2025లో ఇంజిన్ విషయానికొస్తే.. ఈ స్కూటర్‌లో అందిస్తున్న OBD2B స్టాండర్డ్ ఇంజిన్ కఠినమైన ఉద్గార నిబంధనలను కలిగి ఉంది. కొత్త హోండా స్కూటర్‌లో ఇడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. తద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మీ స్కూటర్ ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీంతో మీ స్కూటర్ ఇంధన సామర్థ్యం మెరుగవుతుందని సంస్థ పేర్కొంది.

హోండా యాక్టివా స్కూటర్(Honda Activa 125CC Price) 123.92 cc, సింగిల్ సిలిండర్ PGM Fi ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 6.20 kW శక్తిని, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా యాక్టివా 2025 స్కూటర్ రెండు వేరియంట్లు DLX, H-Smart లలో అందుబాటులో ఉంటుంది.
హోండా యాక్టివా 125.. 6 ఆకర్షణీయమైన కలర్స్.. బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్ ఇంకా పెర్ల్ ప్రెషియస్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. కొత్త యాక్టివా 125 సిగ్నేచర్ సిల్హౌట్‌తో వస్తుంది. కొత్త కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్లు, లోపలి ప్యానెల్‌లతో ఆకర్షణీయంగా ఉంది. వ్యూ మోడ్ ఆకట్టుకుంటుంది.
వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఫేవరెట్‌గా ఉన్న హోండా యాక్టివా.. భారతీయులను మరింతగా ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన అప్‌డేట్లతో తీసుకొచ్చింది. ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, మెరుగైన మైలేజ్ అందించేందుకు సిద్ధమైంది. దీంతో కొత్త ఏడాదిలో విక్రయాల పరంగా సంస్థ ఆశాజనకంగా ఉంది. కొత్త యాక్టివా 125(New Honda Activa Launch) ఇప్పుడు భారతీయ మార్కెట్లో డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








