CNG బైక్‌ని ఎలాంటి భయం లేకుండా కొనవచ్చు.. 11 సేఫ్టీ టెస్ట్‌ల్లో పాస్.. మంటలు వచ్చే ఛాన్సే లేదు!
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ (Bajaj Freedom CNG 125) బైక్ జూలై 5న అధికారికంగా విడుదలైంది. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌గా బజాజ్ తీసుకువచ్చిన ఈ మోటార్ సైకిల్ చరిత్ర సృష్టించింది. ఈ బైక్ సీఎన్‌జీ మరియు పెట్రోల్ ఇంధనం రెండింటితో నడిచేలా రూపొందించబడింది. బైక్‌లో సీఎన్‌జీ సిలిండర్‌ని అమర్చడం ఇదే తొలిసారి కావడంతో దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిలో సిలిండర్ ఏ ప్రాంతంలో ఉంది? ఇది సురక్షితంగా ఉంటుందా? మంటలు చెలరేగే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు పలువురిని వెంటాడుతున్నాయి. బజాజ్ ఇప్పటికే దీనిపై వివరణ ఇచ్చింది.
ఈ బైక్ అన్ని రకాల సేఫ్టీని పూర్తి చేసుకున్న తర్వాతే విపణిలోకి విడుదల చేశారు. ముఖ్యంగా ఈ బైక్ 11 రకాల సేఫ్టీ టెస్ట్‌ని ఎదుర్కొంది. ఆ టెస్టులల్లో బజాజ్ సీఎన్‌జీ బైక్ ఎలా ఫర్‌ఫార్మ్ చేసింది? ప్రమాదం జరిగినప్పుడు బైక్ ఫైర్ అవ్వకుండా నిరోధించే ఫీచర్లు ఏమిటి? అని విషయాలను బజాజ్ స్పష్టంగా వెల్లడించింది. ఆ 11 టెస్ట్‌లకు సంబంధించి కీలక విషయాలు మీకోసం..

ఈ బైక్‌కి మొదట సీఎన్‌జీ వాల్వ్ ఇంపాక్ట్ అని పిలువబడే టెస్ట్‌ని నిర్వహించారు. దీని ప్రకారం సీఎన్‌జీ వాల్వ్ ప్రాంతం దెబ్బతిన్నట్లయితే సీఎన్‌జీ వాయువు లీకైందా అని పరీక్షించారు. ఈ పరీక్షలో గ్యాస్ పీడనం (Pressure) తగ్గకపోగా బైక్ పూర్తి స్థాయిలో పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి పరీక్షలోనూ ఈ బైక్ సక్సెస్ అయ్యింది.
రెండో పరీక్ష పెండ్యులమ్ టెస్ట్ (Frontal Pendulum Test) వాహనాన్ని ఒకే చోట పార్క్ చేసినప్పుడు ఇతర వస్తువులు పడిపోవడం లేదా ఢీకొట్టడం వల్ల కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి ఈ పరీక్షను నిర్వహించారు. ఆ ప్రయోగం కూడా విజయవంతమైంది. ఇక మూడో పరీక్ష రియర్ ఇంపాక్ట్ టెస్ట్.. ఈ పరీక్షలో వాహనం వెనుక నుంచి ఏదైనా వస్తువును ఢీకొనడం వల్ల కలిగే నష్టాన్ని రివ్యూ చేస్తారు.

రియర్ ఇంపాక్ట్ టెస్ట్‌లోనూ ఈ బైక్ సిలిండర్‌కి ఎలాంటి నష్టం జరగలేదు. నాలుగో పరీక్ష లేటరల్ ఇంపాక్ట్ టెస్ట్.. ఏదైనా వాహనం సైడ్ ఏరియాను ఢీకొంటే సీఎన్‌జీ సిలిండర్ దెబ్బతినకుండా ఉండనుంది. ఇది కూడా సక్సెస్ చేసుకుంది. ఇక ఐదో పరీక్ష ఫ్రంట్-ఎండ్ కొలిషన్ టెస్ట్ చాలా కీలకమైనది. సుమారు 1.5 టన్నుల బరువున్న వస్తువుతో ఈ బైక్‌ని ఢీకొట్టారు. ఇందులో బైక్ ముందు భాగం కొద్దిగా దెబ్బతింది.
అయితే ఈ క్రాష్ టెస్ట్‌లో బైక్ ప్రభావం సీఎన్‌జీ సిలిండర్ మరియు దాని పీడనం (Pressure)పై ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఆరో పరీక్ష వాహనం ఒక చోట పార్క్ చేసినప్పుడు సైడ్ ఏరియా నుంచి మరో వాహనం రావడం వల్ల కలిగే నష్టాన్ని తనిఖీ చేయడం. అధిక ఎత్తు నుంచి వాహనం పడితే ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడటం ఏడో పరీక్ష. ఆ పరీక్షల్లోనూ ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు.

ఎనిమిదో పరీక్షలో సుమారు 10 టన్నుల బరువున్న పెద్ద ట్రక్కును ఈ బైక్ పైకి ఎక్కించి పరీక్షించారు. అయినా సిలిండర్ చెక్కుచెదరలేదు. ఇక తొమ్మిదవ పరీక్ష ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ప్రకారం సీఎన్‌జీ వాల్వ్ సురక్షితమా? అనే విషయాన్ని పరీక్షించారు. ఈ పరీక్షలోనూ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించింది. పదో పరీక్షలో సీఎన్‌జీ ఇంధనాన్ని లోడ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలపై తనిఖీ చేశారు.
పదో టెస్ట్‌ని ఆటోమోటివ్ స్టాండర్డ్ ఇండస్ట్రీ (Automotive Industry standards) నిర్వహించింది. ఈ పరీక్షలోనూ సిలిండర్ ఎటువంటి ప్రభావం లేకుండా సురక్షితంగా ఉంది. చివరిగా బజాజ్ సీఎన్‌జీ బైక్ ఇంధనం నింపేటప్పుడు సంభవించే టెస్ట్‌లు మరియు ఇతర లీకులను సైతం విజయవంతంగా అధిగమించింది. పెట్రోల్ బైక్‌ల మాదిరిగానే ఈ బైక్‌ని కూడా విరివిగా ఉపయోగించవచ్చని నిర్ధారించుకున్న తర్వాతే ఈ బైక్‌ని మార్కెట్లోకి బజాజ్ ఆటో తీసుకువచ్చింది.


Click it and Unblock the Notifications








