దక్షిణ భారత దేశంలో తోపు స్కూటర్.. ఆ స్కూటర్‌కి మంగళ హారతులు పడుతున్న జనాలు!
హోండా యాక్టివా (Honda Activa) దేశంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. రెండు దశాబ్దాలుగా ఈ స్కూటర్ భారత్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇప్పటికీ సేల్స్‌లో ఇదే స్కూటర్ నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఈ స్కూటర్‌ని ఢీకొట్టేందుకు ఎన్నో కంపెనీలు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇందులోని ఫీచర్లు, రైడింగ్ కంఫర్ట్, అందరికీ అనువుగా ఉండేలా డిజైన్ ఉండడంతో జనాలు హోండా యాక్టివాకే జై కొడుతున్నారు. రోజువారి అవసరాల నుంచి భారీ పేలోడ్ సామర్థ్యం ఉన్న పనుల వరకు హోండా యాక్టివా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. దీంతో జనాలు ఈ స్కూటర్లను కొనేందుకు ఎగబడుతున్నారు. ఈ స్కూటర్ దక్షిణ భారతదేశంలో ఓసారి కొత్త రికార్డు నెలకొల్పింది. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహా మొత్తం దక్షిణ భారతదేశంలో ఈ హోండా ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. తాజాగా ఈ స్కూటర్ మొత్తం 10 మిలియన్ (1 కోటి) యూనిట్ల అమ్మకాలతో రికార్డు నెలకొల్పింది. హోండా యాక్టివా దేశంలో అత్యంత ఇష్టపడే స్కూటర్‌గా ఉందనే దానికి ఈ సేల్స్ రిపోర్ట్ ఓ ఉదాహరణగా చెప్పవచ్చు.

అయితే కేవలం దక్షిణ భారతదేశంలోనే ఈ రేంజ్‌లో అమ్మకాలను నమోదు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ స్కూటర్‌ని 2001లో తొలిసారిగా హోండా యాక్టివా విడుదల చేసింది. విడుదలైన తొలినాళ్లలోనే ఈ స్కూటర్ భారీ సంఖ్యలో అమ్ముడైంది. భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లోనే ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతీ నెలా వేల సంఖ్యలో స్కూటర్లను విక్రయిస్తుంది.
స్టైలింగ్, ఫీచర్లు, పర్ఫామెన్స్‌తో పాటు అన్నింటికంటే ముఖ్యంగా జనాలలో ఈ స్కూటర్ అత్యంత నమ్మదగిన స్కూటర్‌గా అవతరించింది. దక్షిణ భారతదేశంలో యాక్టివా తొలుత 5 మిలియన్ల (50 లక్షలు) అమ్మకాల మైలురాయిని 2017లో (16 సంవత్సరాల తర్వాత) సాధించింది. కానీ కేవలం 7 సంవత్సరాలలోనే మరో 5 మిలియన్ల విక్రయాలను సాధించి రికార్డు నెలకొల్పింది. ఇది 110cc, 125cc మోడళ్లతో స్కూటర్ మార్కెట్లు తిరుగులేని శక్తిగా ఉంది.

ఇక ఈ స్కూటర్ దరిదాపుల్లోనూ ఏ ఇతర కంపెనీ స్కూటర్లు కూడా లేవు. దీంతో ప్రతి నెల ఈ స్కూటర్ కంపెనీకి లాభాల వర్షాన్ని కురిపిస్తుంది. రాబోయే రోజుల్లోనూ మరెన్నో రికార్డులు సృష్టిస్తామనే నమ్మకంతో కంపెనీ ఉంది. మొత్తం సౌత్ ఇండియాలో మొత్తం 1,700 టచ్‌పాయింట్‌లతో హోండా స్ట్రాంగ్ సేల్స్, సర్వీస్ సెంటర్ నెట్‌వర్క్స్‌ని కలిగి ఉంది.
హోండా అందించే సర్వీస్ వల్ల ఆ కంపెనీలోని లైనప్స్ అన్ని ప్రతి మూలను చేరుకోవడానికి సహాయపడింది. డీలర్ భాగస్వాములు సపోర్ట్‌తో హోండా నిర్విరామంగా సర్వీస్‌ని అందిస్తుంది. ఇక యాక్టివాతో పాటు, కంపెనీ స్కూటర్ లైనప్‌లో 110సీసీ, 125సీసీ వెర్షన్‌లలో డియో స్కూటర్‌కి కూడా విక్రయిస్తోంది. 100-110cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో షైన్ 100, CD 110 డ్రీమ్ డీలక్స్‌తో పాటు మొత్తం ఇతర తొమ్మిది రకాల బెస్ట్ బైక్స్ ఉన్నాయి.
125cc విభాగంలో షైన్ 125 & SP125, 160cc విభాగంలో యునికార్న్ & SP160, 180-200cc సెగ్మెంట్‌లో హార్నెట్ 2.0 & CB200X ఉన్నాయి. 300cc - 500cc మిడ్ రేంజ్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో CB350, H'ness CB350, CB 350RS, CB 300F, CB 300R, NX500, XL750 ట్రాన్సల్ప్, ఆఫ్రికా ట్విన్, గోల్డ్ వింగ్ టూర్ ఉన్నాయి. హార్నెట్ 2.0, CB200X బిగ్‌వింగ్ షోరూమ్‌ల ద్వారా విక్రయించడుతోంది.


Click it and Unblock the Notifications








