సెకండ్ హ్యాండ్ స్కూటర్లయినా సరే.. మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. డిమాండ్ కూడా ఎక్కువే.!!
కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలంటే చాలా మంది ముందుగా ఆలోచించేది ధర గురించే. అందరూ ఎక్కువ ధర వెచ్చించి టూ వీలర్ కొనుగోలు చేయలేరు. అందుకే చాలా మంది సెకండ్ హ్వాండ్ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. అలాంటి వారికోసమే ఇక్కడ సెకండ్ హ్యాండ్(Second Hand Scooters)లోనూ మంచి పనితీరును కనబరిచే స్కూటర్ల వివరాలు అందిస్తున్నాం.
మన రోజువారీ కార్యకలాపాలకు వాహనం తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా టూ వీలర్. ప్రస్తుత కాలంలో బైక్ లేదా స్కూటర్ లేని వ్యక్తి కనబడటం చాలా అరుదు. ఆ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త మోడళ్లలో ద్విచక్ర వాహనాలు విడుదలవుతున్నాయి. అయితే మార్కెట్లో సెకండ్ హ్యాండ్ వాహనాలకు కూడా డిమాండ్ అధికంగానే ఉంటుంది.

కొత్త స్కూటర్‌తో పోలిస్తే.. సెకండ్ హ్యాండ్ స్కూటర్ల ధర తక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ పనితీరు గురించి కొందరికి ఆందోళన ఉంటుంది. అయితే ఈ ప్రముఖ కంపెనీల స్కూటర్లు మాత్రం సెకండ్ హ్యాండ్‌లోనూ మంచి పర్ఫామెన్స్‌ను అందిస్తాయి. మీ బడ్జెట్ ధరలో లభించే హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ మరియు సుజుకి యాక్సెస్ స్కూటర్ల వివరాలు ఈ కథనంలో..
హోండా యాక్టివా 125: మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ Honda Activa 125. ధర వేరియంట్లను బట్టి రూ. 82,634 నుండి రూ. 91,807 ఎక్స్-షోరూమ్ మధ్యలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ గరిష్ఠంగా 8.3 PS శక్తిని మరియు 10.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 60 కి.మీ మైలేజ్‌ని అందిస్తుంది.

సుజుకి యాక్సెస్ 125: భారత మార్కెట్లో Suzuki Access 125 ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్లను బట్టి రూ. 83,482 మరియు రూ. 94,082(ఎక్స్-షోరూమ్) ధర మధ్యలో అందుబాటులో ఉంది. 124 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 8.7 PS శక్తిని మరియు 10 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సుజుకి యాక్సెస్ 125 లీటర్‌కు 45 కి.మీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, సెమీ-డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్, డ్రమ్ లేదా డిస్క్ బ్రేక్ ఆప్షన్ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది. మార్కెట్లో హీరో మాస్ట్రో ఎడ్జ్ 125, యమహా ఫాసినో 125లకు స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది.

టీవీఎస్ జూపిటర్ 125: బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న మరో కొత్త స్కూటర్ TVS Jupiter 125. ధర రూ. 89,155 నుండి రూ. 99,805 ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌లో 124.8 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 8.2 hp మరియు 10.5 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టీవీఎస్ జూపిటర్ 125 లీటర్‌కు 57.27 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. ఫీచర్ల పరంగా ఇందులో LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్, USB ఛార్జింగ్ సాకెట్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మరియు LCD స్క్రీన్ వంటి అనేక ఫీచర్లతో నిండి ఉంది. భద్రత కోసం హోండా యాక్టివా మాదిరిగానే ఇందులో డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉంది.
చివరగా ఇక్కడ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఏదైనా సెకండ్ హ్యాండ్ స్కూటర్లు కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మీరు యూజ్డ్ స్కూటర్‌ను ఈఎంఐలో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. వాహన ఇన్సూరెన్స్‌తో సహా అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. టెక్నికల్ లోపాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై మంచి మెకానిక్‌ను సంప్రదించాలి.


Click it and Unblock the Notifications








