స్కూటర్‌ కొనేవారు కాస్త ఆగండి.. తక్కువ ధర, అధిక మైలేజ్‌తో త్వరలో హోండా యాక్టివా 7G.!!

భారత మార్కెట్లో స్కూటర్‌ విభాగంలో హోండా యాక్టివా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దాని స్టాండర్డ్‌ డిజైన్‌, శక్తివంతమైన పనితీరుతో భారతీయ కస్టమర్లకు ఫేవరెట్‌గా మారింది. ఈ క్రమంలో త్వరలో హోండా యాక్టివా 7G(Honda Activa 7G) వెర్షన్‌ విడుదల కాబోతుంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

గతేడాది భారత మార్కెట్లో హోండా యాక్టివా(Honda Activa 6G) 6G వెర్షన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరిన్ని ఫీచర్లు, టెక్నాలజీతో హోండా యాక్టివా 7G రాబోతుంది. ఇప్పటికే సరసమైన ధర, మంచి మైలేజ్‌, నమ్మకమైన పనితీరుతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న హోండా యాక్టివా.. నిరంతరం అప్‌డేట్లతో టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. దీంతో కస్టమర్లలో ఈ స్కూటర్‌పై భారీ అంచనాలు నెలకొనడంతో భారత్‌ రోడ్లపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

Honda-Activa-7G-Launch-Soon

కాగా హోండా యాక్టివా 7G గురించి పూర్తి సమాచారాన్ని సంస్థ ఇంకా ధ్రువీకరించలేదు. అయితే అత్యాధునిక టెక్నాలజీ మరియు ఫీచర్ల ప్యాక్‌తో యాక్టివా అభిమానుల హృదయాలను గెలుచుకుంటుందని సంస్థ ధీమాతో ఉంది. సరసమైన ధర, అధిక మైలేజ్‌తో ఈ స్కూటర్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 65 కి.మీ మైలేజ్‌తో ఈ స్కూటర్‌ విడుదల కానున్నట్లు సమాచారం.

హోండా యాక్టివా 7G ఇంజిన్‌: ఇంజిన్‌ విషయానికొస్తే హోండా యాక్టివా 7G స్కూటర్‌లో 110 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. తద్వారా ఇది Activa 6G కంటే కూడా సున్నితమైన, శక్తివంతమైన రైడ్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. నగరాల్లో ట్రాఫిక్‌, ఇరుకైన రోడ్లపై సైతం సులభంగా నడిపేలా ఇందులో స్పెసిఫికేషన్లు ఉండనున్నాయి. అందుకు అనుగుణంగా అద్భుతమైన స్పెక్స్‌, ఫీచర్లను అందించారు.

Honda-Activa-7G-Launch-Soon

హోండా యాక్టివా 7G డిజైన్‌: సింపుల్‌ అట్రాక్టివ్‌ డిజైన్‌తో హోండా Activa 7G ను సంస్థ రూపొందిస్తోంది. కొత్త 12-అంగుళాల ఫ్రంట్ వీల్ మరియు 10-అంగుళాల రియర్‌ వీల్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన హ్యాండ్లింగ్ మరియు గ్రిప్‌ను అందించడంతో పాటు.. ఎలాంటి రోడ్లపై అయినా పట్టును కలిగి ఉంటూ రైడర్లకు సురక్షితమైన రైడింగ్‌ను అందించేలా రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది.

హోండా యాక్టివా 7G ఫీచర్లు: ఫీచర్ల విషయానికొస్తే హోండా యాక్టివా 7G లో యూజర్-ఫ్రెండ్లీ ఫీచర్లను సంస్థ అందించనుంది. ఇన్ఫర్మేషన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, విశాలమైన అండర్-సీట్ స్టోరేజ్ మరియు రాత్రి వేళల్లో మెరుగైన విజిబిలిటీ కోసం LED హెడ్ ల్యాంప్ వంటి ఫీచర్లను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆకర్షణీయమైన కలర్స్‌లో ఈ స్కూటర్‌ను ప్రవేశపెట్టవచ్చు.

హోండా యాక్టివా 7G బ్రేకింగ్‌: బ్రేకింగ్‌ పనితీరును చూసుకుంటే.. హోండా యాక్టివా 7G లో కాంబీ బ్రేకింగ్‌ సిస్టమ్‌- సీబీఎస్‌ను ఊహించవచ్చు. ముందు వైపు డిస్క్‌ బ్రేక్‌లు లేదా డ్రమ్‌ బ్రేక్‌ ఆప్షన్లతో రావచ్చని తెలుస్తోంది. లైట్‌ వెయిట్‌తో నగర రోడ్లకు అనుగుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

కాగా హోండా యాక్టివా 7G లాంచ్‌ డేట్‌పై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ధర గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ.. ఈ స్కూటర్‌ ధర రూ. 89,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2024, 14:18 [IST]
English summary
Honda activa 7g launch soon at affordable price and high mileage check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+