నో పెట్రోల్ నో టెన్షన్, హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌లో 100 కిమీ రేంజ్!
ఎలక్ట్రిక్ స్కూటర్లకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైంది. దేశంలోనే అత్యంత ఫేమస్ స్కూటర్ హోండా యాక్టివా (Honda Activa) ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రాబోతుంది. దీనికి సంబంధించి ఆ సంస్థ టీజర్‌ని విడుదల చేసింది. మార్కెట్‌లో దీనికి ప్రత్యేక డిమాండ్ ఉండటం వల్ల జనాలు కూడా దీని రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో టీవీఎస్, బజాజ్, హీరో వంటి టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. అయితే వీటితో సమానంగా సాంప్రదాయ వెహికిల్స్ అమ్మకాల్లో గట్టి పోటీదారుగా ఉన్న హోండా మోటార్ సైకిల్ ఇండియా లిమిటెడ్ మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రవేశపెట్టలేదు. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకువస్తున్నట్లు తీపికబురు చెప్పింది.
ఈ స్కూటర్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే ఇతర కంపెనీల అమ్మకాలకు పెద్ద దెబ్బపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా ఈవీ తొలి స్థానంలో ఉంది. స్కూటర్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న హోండా యాక్టివా వంటి ఫేమస్ లైనప్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకురావడం ఓ పెద్ద స్ట్రాటజీగానే భావించాలి. ఎందుకంటే దీనికి కంపెనీ ప్రత్యేకంగా మార్కెటింగ్ చేయాల్సిన పనిలేదు.

ఇది భారతదేశంలో అమ్మకానికి రానున్న మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కావడం వల్ల తాజా టీజర్‌తో మరింత ఆసక్తిని హోండా పెంచింది. ప్రస్తుతం ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లలో మిడ్-డ్రైవ్ పర్మినెంట్ మాగ్నెటిక్ సింక్రోనస్ (PMS) మోటారును ఉపయోగిస్తుండగా.. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మోటార్ స్వింగ్ ఆర్మ్-మౌంట్ యూనిట్‌తో తీసుకువస్తున్నారు. మార్కెట్‌లో BLDC హబ్స్, స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటార్లను ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
బజాజ్ చేతక్, విడా వి 1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటార్లతో కొనుగోలుకి అందాబుటులో ఉన్నాయి. పైన చెప్పిన విధంగా హోండా తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కూడా ఇదే సిస్టమ్‌తో వస్తుంది. స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోటారును ఉపయోగించడం ద్వారా మంచి ఫర్ఫామెన్స్‌ని అందించే అవకాశం ఉంది. అలాగే సిటీ డ్రైవింగ్‌లో మంచి గ్రిప్, స్టెబిలిటీని అందించేందుకు ఎంఆర్ఎఫ్ టైర్లను అందించారు.

ఇక ఇందులో ఫీచర్లు కొదువ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న రెగ్యూలర్ స్కూటర్లలో టాప్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. వీటిని కొనసాగించే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్‌కి అనువుగా ఫీచర్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇది పొడవైన సీటుతో వస్తుందని టీజర్‌ని చూస్తే అర్థం అవుతుంది. ఇది ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా రాబోతుందని స్పష్టం అయ్యింది.
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో లేనప్పటికీ అతి త్వరలో రాబోయే హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో సహా మరెన్నో కీలక ఫీచర్లతో వస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని నవంబర్ 27, 2024 న విడుదల చేయనుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అవకాశం ఉంది. మార్కెట్లో ఇతర రెగ్యూలర్ స్కూటర్లతో ఇది మంచి ఫర్ఫామెన్స్‌ని అందించనుంది.
ఇక ధరపై ఎటువంటి సమాచారం లేదు. అయితే మార్కెట్‌లో మంచి పోటీని ఇవ్వాలంటే సుమారు రూ .1 లక్షకు దగ్గర్లో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ హోండా ఈవీ మార్కెట్‌లో నేరుగా ఓలా S1 ప్రో, అథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450X, బజాజ్ చేతక్ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది. బ్రాండింగ్ హోండా యాక్టివా అమ్మకాలకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








