యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందోచ్.. బ్యాటరీ, ధర, ఫీచర్లు అదిరిపోయాయ్.. ఇతర కంపెనీలకు ముచ్చెమటలే
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచదేశాల్లోని టాప్ కంపెనీలు అన్ని కూడా భారత ఈవీ మార్కెట్‌పై కన్నేశాయి. దీంతో వెంట వెంటనే కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. పోటీ పడి మరి అధునాతన ఫీచర్లను వాటిలో అందిస్తూ తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ కంపెనీలు కూడా తమ సత్తా చాటడానికి ఈవీ విభాగంపై దృష్టి పెట్టి కొత్త మోడళ్లతో పాటు, తమ పాత వాటిని సైతం ఈవీ వేరియంట్లలో తీసుకొస్తున్నాయి. తాజాగా దేశీయ దిగ్గజ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(Honda Motorcycle and Scooter India)విక్రయిస్తున్న తన ఫేమస్ స్కూటర్‌ను ఈవీ వెరియంట్‌లో తీసుకురావాలని చూస్తుంది.
హోండా కంపెనీ నుంచి దేశంలో రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేస్తున్న ప్రముఖ స్కూటర్ యాక్టివా(Activa)ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో యాక్టివా ఈవీ(Activa Ev) వేరియంట్ వస్తుందని సోషల్‌మీడియాలో కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, యాక్టివా ఈవీ మోడల్ అతి త్వరలో నవంబర్ 27వ తేదీని గ్రాండ్‌గా ఆవిష్కరిస్తారని తెలుస్తుంది.

కానీ కంపెనీ నుంచి ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే తేదీన హోండా ఈవీ స్కూటర్‌ను ఆవిష్కరిస్తుందని కొన్ని రోజులుగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అది యాక్టివా ఈవీ వెర్షన్ లాంచ్ అదే రోజున ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈవీ స్కూటర్ల విభాగంలో ఇతర కంపెనీలు ముందు వరుసలో ఉండగా, కంపెనీకి యాక్టివా ఈవీ అత్యంత కీలకం కానుంది.
హోండా కంపెనీ భారత్‌లో ప్రసిద్ధ టూవీలర్ తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటికే బైకులు, స్కూటర్ల విభాగంలో టీవీఎస్, బజాజ్, హీరో కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే ఈ కంపెనీలు ఈవీ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురాగా అవన్నీ కూడా దాదాపు సక్సెస్ అయ్యాయి. వీటికి తోడు ఈవీ స్కూటర్ల పరంగా ఓలా ఎలక్ట్రిక్ సైతం భారత్‌లో 30 శాతానికి పైగా వాటాను సంపాదించింది.

వీటన్నింటిని దాటి ఈవీల్లో కూడా అగ్ర స్థానం సంపాదించడానికి హోండా ప్రత్యేకంగా దృష్టి సారించి తన అమ్మకాలలో ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేస్తున్నటుంటి యాక్టివాను ఎంచుకుని ఇదే మోడల్‌ను ఈవీ వేరియంట్‌లో తీసుకొచ్చి మిగతా కంపెనీల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించి ఈవీ స్కూటర్లలో కూడా టాప్ ప్లేస్‌ను పొందాలని భావిస్తుంది.
హోండా యాక్టివా ఇండియాలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోతున్న స్కూటర్. దేశంలోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కూడా ఈ స్కూటర్ కనిపిస్తుంది. ఇది ఫెర్ఫామెన్స్ పరంగా మిగతా వాటి కంటే అగ్రస్థానంలో ఉంటుంది. మైలేజ్ కూడా లీటర్ పెట్రోల్‌కు 55 కి.మీకు పైనే వస్తుంది. ధర కూడా లక్ష రూపాయల లోపు ఉండటంతో యాక్టివాను చాలా మంది కొనుగోలు చేస్తుంటారు.

త్వరలో రాబోయే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇతర కంపెనీల కంటే పెద్ద బ్యాటరీ ఆప్షన్‌ను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా రేంజ్‌పై దృష్టి పెట్టిన కంపెనీ ఈ ఈవీలో సింగిల్ ఛార్జింగ్‌తో 100 కి.మీకు పైగా రేంజ్‌ను అందించే బ్యాటరీని అమర్చే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఛార్జింగ్ సమస్యకు చెక్ పెడుతూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని ఈ స్కూటర్‌లో అందించే ఛాన్స్ ఉంది.
దీని డిజైన్ పెట్రోల్ పవర్డ్ యాక్టివా మాదిరిగానే ఉంటుంది. కొత్త LED హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ సీట్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక అడ్జస్టబుల్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ద్వారా ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై సాఫీగా ప్రయాణించడానికి వీలవుతుందని తెలుస్తుంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉండే అవకాశం ఉంది.
ఈ కొత్త హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు రూ. ఒక లక్ష నుండి 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో కొనుగోలుకు లభించవచ్చని సమాచారం. ఇది 2025లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్‌పై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది అమ్మకాల పరంగా మంచి గణంకాలను నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








