Honda NX500 హోండా నుంచి NX500 బైక్ లాంచ్.. బుకింగ్‌లు ప్రారంభం.. ధర, ఫీచర్ల వివరాలివే.!!
భారత్‌లో హోండా మోటార్స్ కంపెనీకి చెందిన బైక్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్ ధరలో అధిక మైలేజ్ ఇచ్చే ద్విచక్ర వాహనాలతో పాటు అడ్వెంచరస్ రైడ్‌ను కోరుకునే రైడర్లకు హోండా ఆ థ్రిల్‌ను అందిస్తోంది. కాగా నేడు తాజాగా హోండా మోటార్స్ నుంచి అడ్వెంచరస్ బైక్ NX500 లాంచ్ అయింది.
హోండా మోటార్‌సైకిల్స్(Honda Motocycles) నుంచి కొత్త అడ్వెంచరస్ బైక్ NX500 నేడు మార్కెట్లోకి విడుదలైంది. కాగా ఇప్పటికే ఈ బైక్‌కు సంబంధించి బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. రూ. 5.90 లక్షల(ఎక్స్-షోరూమ్) పరిచయ ధరతో సంస్థ ఈ బైక్‌ను విడుదల చేసింది. తెలుపు, నలుపు, ఎరుపు ఆకర్షణీయమైన కలర్స్‌లో NX500 అందుబాటులో ఉంది. డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభం అవుతాయి.

హోండా NX500(Honda NX500) బైక్ ఇంజిన్ విషయానికొస్తే.. లిక్విడ్-కూల్డ్, 471cc, సమాంతర-ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8,000 rpm వద్ద 47.5 hp మరియు 6,500 rpm వద్ద 43 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్‌ను కలిగి ఉంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
హోండా NX500 సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే.. USD ఫోర్క్ మరియు ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్‌తో సస్పెండ్ చేయబడిన డైమండ్ ఫ్రేమ్‌తో ఉంటుంది. 17.5 లీటర్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాగా ఈ బైక్ బరువు 196 కిలోలు. CB500X కంటే 3 కేజీలు తక్కువ. బ్రేకింగ్ విషయానికొస్తే ముందు భాగంలో 296 mm ట్విన్ డిస్క్‌లను కలిగి ఉంది. వెనుక భాగంలో ఒకే 240 mm డిస్క్‌తో వస్తుంది.

బైక్ ముందు వైపు 19-అంగుళాల మరియు వెనుక వైపు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. కాగా ఆఫ్-రోడ్ పనితీరు కోసం ఈ బైక్‌కు బ్లాక్-ప్యాటర్న్ టైర్‌లను అమర్చారు. హోండా NX500 డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ బైక్ 830 mm సీట్ ఎత్తును కలిగి ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే NX500లో 5-అంగుళాల TFT డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. దీనిని మీ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది నావిగేషన్ డేటా మరియు నోటిఫికేషన్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఇంకా స్విచ్ యాక్సెసబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను కలిగి ఉంది. భారత మార్కెట్లో కవాసకి వెర్సీస్ 650 (Kawasaki Versys 650) బైక్‌కు గట్టి పోటీనివ్వనుంది.

కాగా హోండా CB500X ను నిలిపివేయడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు అడ్వెంచర్ టూరింగ్ సెగ్మెంట్‌లో హోండా NX500 ను విడుదల చేసింది. ఇది ర్యాలీ-బైక్ స్టైల్ ఫెయిరింగ్‌తో పాటు పొడవైన విండ్‌స్క్రీన్ మరియు ఎర్గోనామిక్ సీటింగ్ పొజిషన్‌తో వస్తుంది. హోండా NX500 బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో రూ. 10,000 టోకెన్ మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








