6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
భారత్‌లో హోండా బైక్‌లు, స్కూటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా భారత మార్కెట్లో ఆధిపత్యం(Honda Sales In India) చెలాయిస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రముఖ సంస్థ గణనీయమైన మైలురాయిని సాధించింది. 6 కోట్ల దేశీయ విక్రయాలతో కంపెనీ చారిత్రక మైలురాయిని సాధించి రికార్డు సృష్టించింది.
భారత మార్కెట్‌లో హోండా.. తనకున్న తిరుగులేని నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. 6 కోట్ల(Honda Record Sales 6 Crores Customers) టూ వీలర్లను భారత్‌లో విక్రయించి కస్టమర్ల గుండెల్లో ఫేవరెట్‌గా నిలిచిపోయింది. జూన్ 2001లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన హోండా.. రెండు దశాబ్దాలకు పైగా మెరుగైన పనితీరుతో భారతీయ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

కాగా మొదటి కోటి మంది కస్టమర్లను పొందడానికి హోండాకు ఏకంగా 11 సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఆ తర్వాత సంస్థ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం మూడేళ్లలో 2 కోట్ల మార్కును తాకడంతో రికార్డు సృష్టించింది. తర్వాత 2017 ఏప్రిల్‌లో 3 కోట్ల మైలురాయిని సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంది.
ఇక హోండా భారత్ మార్కెట్లోకి ప్రవేశించిన 16 ఏళ్లలో 3 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకోగా.. మిగిలిన 3 కోట్ల మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ తర్వాత ఏడేళ్లలోనే.. మరో 3 కోట్ల మంది కస్టమర్లు హోండా(Honda Motorcycle And Scooter India) ఫ్యామిలీలో చేరారు. తద్వారా మార్చి 2024 నాటికి 6 కోట్ల దేశీయ విక్రయాల మైలురాయిని చేరుకుని రికార్డు సృష్టించింది.

హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా.. తన మొదటి ద్విచక్ర వాహనం యాక్టివాతో 2001లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత స్కూటర్ విభాగంలో యాక్టివా అగ్రగామిగా ఉంది. ఇప్పటికీ స్కూటర్ విభాగంలో యాక్టివా యూత్ ఫేవరెట్‌గా ఉంది. సేల్స్ పరంగా అనేక మైలురాళ్లను సాధిస్తూ.. యూత్ అత్యంత ఇష్టపడే ద్విచక్ర వాహన బ్రాండ్‌లలో ఒకటిగా గుర్తింపు సాధించింది.
అంతేకాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ హోండా.. యాక్టివాను అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఈ కారణంగా టూ వీలర్ విభాగంలో సంస్థకు యాక్టివా మంచి సేల్స్‌ను అందిస్తోంది. త్వరలో యాక్టివా 7G వెర్షన్(Honda Activa 7G)ను హోండా మోటార్స్ విడుదల చేయనుంది.

యాక్టివా తర్వాత హోండా కస్టమరల్లకు అత్యంత ప్రియమైన మోటార్‌సైకిల్ షైన్(Honda Shine). 6 కోట్ల మైలురాయిని సాధించడంలో యాక్టివా మరియు షైన్‌లు కీలక పాత్ర పోషించాయి. వాటి విశ్వసనీయత, పనితీరు మరియు అధునాతన ఫీచర్ల కారణంగా వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్లుగా మారాయి.
హోండా తిరుగులేని రికార్డుపై హోండా ఎండీ, ప్రెసిడెంట్ మరియు సీఈఓ సుట్సుము ఒటాని హర్షం వ్యక్తం చేశారు. 'మాకు 6 కోట్ల మంది హ్యాపీ కస్టమర్‌లు ఉన్నారు. ఈ అమ్మకాల మైలురాయిని సాధించడం ద్వారా హోండా బ్రాండ్‌పై భారతీయ కస్టమర్లు ఉంచిన విశ్వాసానికి నిదర్శనం' అని ఆయన అన్నారు.
ఈ విజయానికి చాలా గర్వపడుతున్నట్లు చెప్పారు. భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధి మరియు అభివృద్ధికి సానుకూలంగా దోహదపడేందుకు అంకితభావంతో పనిచేస్తున్నట్లు సుట్సుము చెప్పుకొచ్చారు. ఈ ప్రయాణంలో సహకరించిన కస్టమర్లు, భాగస్వాములకు మరియు వాటాదారులందరికీ హోండా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ కృతజ్ఞతలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications








