Ola E-Bike Taxi హైదరాబాద్‌లో ఓలా ఇ- బైక్ ట్యాక్సీ సర్వీస్.. చాలా తక్కువ ధరలకే సేవలు.!!
దేశంలో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా.. ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో తన ఇ-బైక్(Ola E-Bike Taxi Service) టాక్సీ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే క్యాబ్ సర్వీస్‌లో దూసుకుపోతున్న ఓలా.. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీతో ప్రయాణికులకు మరింత చేరువ కానుంది. బెంగళూరులో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఈ రెండు నగరాల్లో తీసుకువచ్చింది.
కాల్ ట్యాక్సీ సర్వీస్‌తో భారత్‌లో అడుగుపెట్టిన ఓలా.. క్రమంగా టూ వీలర్ సెగ్మెంట్‌లోకి కూడా విస్తరించింది. ఓలా ఎలక్ట్రిక్ పేరుతో ఇ స్కూటర్లను విక్రయిస్తూ టాప్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం.. Ola S1 ప్రో, Ola S1 ఎయిర్ మరియు Ola S1 X+ అనే తన లైనప్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఓలా త్వరలో ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ దశలో భారత్‌లో ఓలా ఈ-బైక్(Ola E-Bike Taxi Delhi and Hyderabad) టాక్సీ సేవలను తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో నడిచే బైక్ టాక్సీ సేవలను ప్రారంభించింది. కాగా మొదటి దశలో, ఈ సర్వీస్‌ను కేవలం రెండు నగరాల్లో మాత్రమే ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్ ఢిల్లీ మరియు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటుంది.
ఓలా ఇ బైక్ ట్యాక్సీ(Ola E-Bike) సర్వీస్ ద్వారా.. దాదాపు 100 కోట్ల మందికి సేవలందించాలని భావిస్తోంది. కాగా ఓలా ఈ-బైక్ టాక్సీ 2023 సెప్టెంబర్‌లో బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ టెక్ సిటీలో ప్రయాణికుల మంచి ఆదరణ లభిస్తుండటంతో.. ఈ క్రమంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో ఓలా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

కాగా వచ్చే రెండు నెలల్లో దాదాపు 10,000 ఎలక్ట్రిక్(Ola Electric) ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఓలా వెల్లడించింది. దీని ద్వారా భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఇ-బైక్‌లతో ఓలా అతిపెద్ద ట్యాక్సీ కంపెనీగా నిలుస్తుంది. అయితే అతి తక్కువ ఛార్జీలతో ఓలా ఈ సేవలను అందించాలని భావిస్తోంది.
దీని ప్రకారం ప్రతి 5 కిలోమీటర్లకు రూ. 25 మాత్రమే వసూలు చేయనున్నారు. 10 కిలోమీటర్లకు 50 రూపాయలు, 15 కిలోమీటర్లకు 75 రూపాయలు ఛార్జ్ చేయనుంది. తక్కువ ఛార్జీలతో ఓలా ఈ-బైక్ టాక్సీ సేవకు దేశంలో మంచి ఆదరణ లభిస్తుందని యోచిస్తోంది. ప్రధానంగా ఆటో, బైక్‌ల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేయడంతో కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించవచ్చని భావిస్తోంది.

దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌పై ఓలా తీవ్రంగా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఇటీవల తన S1 సిరీస్ స్కూటర్లలో MoveOS పేరుతో సరికత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను తీసుకువచ్చిన ఓలా.. ఇప్పుడు టాక్సీ విభాగంలో తన మార్క్‌ను ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ఈ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఓలా ప్రస్తుతం ఈ-ట్యాక్సీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది.
ఓలా ఇ బైక్ సేవను ప్రారంభించడంతో, దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు అనేక రెట్లు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పెట్రోల్ ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్లతో లాభాలు ఎక్కువగా ఉండటంతో.. ప్రస్తుతం ఓలా బైక్ టాక్సీ సర్వీస్‌లో పెట్రోల్ బైక్‌లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఉపయోగిస్తారని ఆశిస్తోంది.

బెంగళూరులో ఇప్పటికే ఓలా ఇ-బైక్ ట్యాక్సీ సర్వీస్ 1.75 మిలియన్ రైడ్లను పూర్తి చేసింది. ఇందుకోసం బెంగళూరులో 200 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. క్రమంగా ఈ సర్వీస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలనేదే తమ లక్ష్యమని ఓలా మొబిలిటీ సీఈవో హేమంత్ భక్షి తెలిపారు. ఈ సేవలను అందుబాటులోకి తీసుకవచ్చే ఇతర ప్రాంతాల్లోనూ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని వెల్లడించారు.


Click it and Unblock the Notifications








