Harvest Festival సంక్రాంతికి ఓలా ఎలక్ట్రిక్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆ స్కూటర్లపై ఏకంగా రూ. 15 వేలు తగ్గింపు

సంక్రాంతి పండుగ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric) కస్టమర్లకు మరోసారి ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. పండుగల సీజన్లలో ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా.. ఈ సారి కూడా భారీ తగ్గింపులతో ముందుకు వచ్చింది. ఓలా తన స్కూటర్లపై ఎంత ఆఫర్‌ ప్రకటించింది.. ఎప్పటి వరకు ఉంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయంలో అగ్రగామిగా ఉంది. తన S1 సిరీస్‌ స్కూటర్ల సిరీస్‌తో ప్రత్యేక బ్యాటరీ ప్యాక్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్ల కారణంగా 2023 లో ఓలా ఎలక్ట్రిక్‌ 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించి మార్కెట్లో 40 శాతం వాటాను దక్కించుకుంది.

Ola-Harvest-Ola-Electric

కాగా ఇటీవల ఏథర్ ఎనర్జీ తన సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఏథర్ 450ఎస్ ధరను భారీ మొత్తంలో తగ్గించిన సంగతి తెలిసిందే. రూ. 20 వేల వరకు తగ్గింపు ధరను ప్రకటించింది. దీంతో పోటీని తట్టుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్‌ కూడా 'హార్వెస్ట్‌ ఫెస్టివల్‌(Harvest Festival)' పేరిట ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

హార్వెస్ట్‌ ఫెస్టివల్‌ ద్వారా ఓలా తన కస్టమర్లకు రూ.15,000 ప్రయోజనాన్ని అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికే ఓలా ఎలక్ట్రిక్‌ తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ జనవరి 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్‌ స్పష్టం చేసింది.

Ola-Harvest-Ola-Electric

ర్వెస్ట్ ఫెస్టివల్ స్కీమ్‌ ద్వారా ఓలా కంపెనీ రూ. 6,999 విలువైన బ్యాటరీ వారంటీ ప్లాన్ మరియు రూ. 3,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను కస్టమర్లకు అందిస్తోంది. వీటితో పాటు ఆకర్షణీయమైన ఫైనాన్స్‌ డీల్స్‌ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లు S1 ప్రో మరియు S1Air స్కూటర్లపై వర్తిస్తాయి.

అంతే కాకుండా ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ యొక్క సరసమైన మోడల్ S1 X Plus పై కూడా సంస్థ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఏకంగా రూ. 20,000 తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్‌ కింద ఈ స్కూటర్‌ను రూ. 89,999 వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Ola-Harvest-Ola-Electric

దీంతో పాటు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కూడా ఓలా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. నిర్దిష్ట క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి EMI ద్వారా కొనుగోలు చేసే వారికి ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. వారికి రూ. 5 వేల తగ్గింపుతో పాటు వడ్డీ లేని EMI ప్లాన్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే, వారు జీరో డౌన్‌పేమెంట్‌తో కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం భారత మార్కెట్లో, ఓలా ఎలక్ట్రిక్ ఐదు రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. అవి S1 ప్రో (రెండవ తరం), S1 ఎయిర్ మరియు S1 X. ఇందులో S1X మాత్రమే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. అవి S1 X-Plus (S1 X+), S1 ఎక్స్‌ 3kWh (S1 X 3kWh) మరియు S1 ఎక్స్‌ 2kWh (S1 X 2kWh) బ్యాటరీ ప్యాక్‌తో ఉన్నాయి.

Ola-Harvest-Ola-Electric

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 12, 2024, 11:07 [IST]
English summary
Ola electric announces harvest festival offers up to rs 15 thousand for limited time
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+