Ola MoveOS 4 ఓలా స్కూటర్లలో కొత్త అప్‌డేట్.. జియో ఫెన్సింగ్, థెఫ్ట్ అలర్ట్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) తన S1 సిరీస్ స్కూటర్లకు కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు ఓలా ఇ స్కూటర్లకు MoveOS 4 అప్‌డేట్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో ఓలా కొత్త ఫీచర్లను తీసుకురాగా.. మరికొన్నిటిని అప్‌డేట్ చేసింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో స్కూటర్లను విక్రయిస్తూ సేల్స్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. తక్కువ ధర, అధిక రేంజ్, మెరుగైన పనితీరుతో యువ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కమ్యూటర్లు ఓలా S1 సిరీస్ స్కూటర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు.

ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ తన S1 సిరీస్ స్కూటర్లలో MoveOS 4 అనే సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్(OTA) డేటా ద్వారా సమాచారం కస్టమర్లకు అందనుంది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో రైడర్‌కు మరింత మెరుగైన రైడింగ్ అనుభవం అందుతుందని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.
ఓలా మ్యాప్స్(Ola Maps), AI ఆధారిత నియంత్రణలను ఈ అప్‌డేట్‌లో ఓలా ఎలక్ట్రిక్ పొందుపరిచింది. MoveOS 4 ద్వారా రైడర్లు తమ ఓలా స్కూటర్‌లో రోజూ ఉపయోగించే ఆప్షన్లకు ఒకే ట్యాప్ ద్వారా యాక్సెస్ లభించేలా దీనిని అప్‌డేట్ చేశారు.

అదే విధంగా ఓలా S1 సిరీస్ స్కూటర్లలో MoveOS 4 అప్‌డేట్ ద్వారా నావినేషన్ విభాగంలోనూ మార్పులు చేశారు. ఇందులోని ఓలా మ్యాప్స్ ద్వారా 'Find My Scooter' ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా యాప్ నుంచి నేరుగా రైడర్ లొకేషన్‌ను షేర్ చేయవచ్చు. ఈ సరికొత్త ఫీచర్ రైడర్‌కు కొత్త ప్రయాణ అనుభూతిని ఇస్తుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.
ఇక ఓలా తీసుకొచ్చిన MoveOS 4 అప్‌డేట్‌లో AI ఆధారిత ఇండికేటర్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా స్కూటర్ టర్న్ అయినప్పుడు వచ్చే ఇండికేటర్ సిగ్నల్స్‌ను ఆటోమేటిక్‌గా ఈ ఆప్షన్ ఆఫ్ చేస్తుంది. అంతే కాకుండా రైడర్ సేఫ్టీ కోసం ఇప్పటికే ఓలా స్కూటర్లలో ఉన్న ఫీచర్లను సంస్థ మరింత మెరుగుపరిచింది.

ఓలా ఎలక్ట్రిక్ తీసుకువచ్చిన కొత్త ఫీచర్లలో ట్యాంపర్ అలర్ట్, ఫాల్ అలర్ట్ ఇవి రెండూ AI ఆధారంగా పనిచేస్తాయి. ఇంకా ఇందులోని హిల్ డిసెంట్ కంట్రోల్ ఫీచర్.. మీ స్కూటర్ స్పీడ్‌ను అదుపులో ఉంచడమే కాకుండా మీ రైడర్‌కు మెరుగైన కంట్రోలింగ్‌ను కూడా అందించడంలో సహాయపడుతుంది. మరో చెప్పుకోదగ్గ ఫీచర్ జియోఫెన్సింగ్.
MoveOS 4 అప్‌డేట్‌లోని మరో ఫీచర్ జియోఫెన్సింగ్.. రైడర్ నిర్దిష్ట సమయం వరకు స్కూటర్‌ను నడపడానికి అనుమతిస్తుంది. ఒకవేళ రైడర్ తమ స్కూటర్ పాస్‌కోడ్‌ను మరిచిపోయినట్లయితే క్లౌడ్, బ్లూటూత్ ద్వారా పాస్‌కోడ్ రికవరీ చేసుకునేందుకు అప్‌డేట్‌ను కూడా సంస్థ అందించింది. వీటితో పాటు మరిన్ని ఫీచర్లను సంస్థ అప్‌డేట్ చేసింది.

గ్యారేజ్ మోడ్, కేర్ మూడ్, స్పీడ్ హైపర్ ఛార్జింగ్, డార్క్ మోడ్, కాన్సర్ట్ మోడ్, రైడ్ జర్నల్ ఫీచర్, మొదలైన అప్‌డేట్లను ఓలా ఎలక్ట్రిక్ MoveOS 4 ద్వారా తీసుకువచ్చింది. ఇవన్నీ AI ఆధారితంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మీరు రైడింగ్‌లో ఉన్నప్పుడు ఫేవరెట్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులు మాత్రమే కాల్ చేసే ఆప్షన్‌ను కొత్త అప్‌డేట్‌లో తీసుకువచ్చారు.

ఇక ట్యాంపర్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా ఎవరైనా మీ స్కూటర్ చోరీకి యత్నిస్తే.. ఈ ఫీచర్ యూజర్‌ను అలర్ట్ చేస్తుంది. ఓలా S1 సిరీస్‌లోని S1 ప్రో సెకండ్ జెన్, S1 ఎయిర్, S1 జనరేషన్1 పోర్ట్‌ఫోలియో మోడల్స్‌లో MoveOS 4 అప్‌డేట్ అందుకుంటాయని సంస్థ తెలిపింది. Ola SX మోడళ్లకు రానున్న నెలల్లో అప్‌డేట్ ఇవ్వనున్నారు.


Click it and Unblock the Notifications








