ఈ స్కూటర్‌కు రైడర్‌ అవసరం లేదు.. అటనామస్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసిన ఓలా.. స్పెషాలిటీస్‌ ఏంటంటే.!!

ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో ఉన్న అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ నుంచి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. AI టెక్నాలజీ ఆధారంగా ఓలా ఎలక్ట్రిక్‌ దీన్ని రూపొందించింది. ఆటోమేటిక్‌, సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌గా పనిచేసే స్కూటర్‌ తయారీపై దృష్టి సారించిన ఓలా.. సోమవారం(ఏప్రిల్‌ 1) ఈ సెల్ఫ్‌ రైడింగ్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది.

ఇప్పటివరకూ మీరు డ్రైవర్‌లెస్‌ కార్ల గురించి విని ఉంటారు. సోషల్‌ మీడియాలో ఆ వాహనాలు ఎలా నడుస్తాయో చూసి ఉంటారు. డ్రైవర్‌ అవసరం లేకుండా.. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీ సాయంతో ఈ వాహనాలు వాటంతంటే సెల్ఫ్‌ డ్రైవింగ్‌లో వెళ్తుంటాయి. కానీ ఈ టెక్నాలజీని మీరెప్పుడైనా బైక్‌ లేదా స్కూటర్‌లో చూశారా..?? ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్‌ ఆ పనిలోనే ఉంది.

Ola-Solo-Autonomous-Self-Driving-E-Scooter

త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ సోలో(Ola Solo) సెల్ఫ్‌ డ్రైవింగ్‌ స్కూటర్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు 'Ola Solo' పేరుతో అటానమస్‌, సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తమ ఇంజనీర్లు ఈ స్కూటర్‌ తయారీ పనిలో నిమగ్నమయ్యారని వెల్లడించారు.

ఓలా సోలో పేరుతో వస్తున్న అటనామస్‌(Ola Solo Autonomous Self Driving Scooter), సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ స్కూటర్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. పేరుకు తగ్గట్టే ఈ స్కూటర్‌లో AI సాంకేతికత ఆధారంగా పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరిచారు. భారత్‌లో మొట్టమొదటి అటనామస్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఇదే కావడం విశేషం.

Ola-Solo-Autonomous-Self-Driving-E-Scooter

"ఓలా సోలో - భారతదేశపు మొట్టమొదటి అటనామస్ ఎలక్ట్రిక్ స్కూటర్. AI టెక్నాలజీతో కూడిన ఫుల్లీ అటనామస్ ట్రాఫిక్ స్మార్ట్ స్కూటర్. మా ఇంజినీరింగ్ బృందం ఆ ఊహను నిజం చేసి చూపించింది. ఓలా ఎలక్ట్రిక్‌, ఓలా క్యాబ్స్, కృత్రిమ్ పరస్పర సహకారంతో ఇది సాధ్యమైంద"ని ఎక్స్ పోస్ట్‌లో భవిశ్ అగర్వాల్ ట్వీట్‌ చేశారు.

ఓలా సోలో పేరుకు తగినట్లుగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో AI టెక్నాలజీ ఆధారంగా పలు ఫీచర్లను సంస్థ పొందుపరిచింది. రైడర్ లేకుండానే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సోలోగా వెళ్లిపోగలదు. అంతేకాదు ఇందులోని టెక్నాలజీ 22 భాషల్లో ఆదేశాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది.

Ola-Solo-Autonomous-Self-Driving-E-Scooter

ఫేషియల్ రికగ్నిషన్, హెల్మెట్ యాక్టివేషన్ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. వైబ్రేటింగ్ సీట్, లిడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్), రాడార్ (రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్), కెమెరా సిస్టమ్, అల్ట్రాసోనిక్ సెన్సార్ మరియు GPS కూడా ఓలా సోలో ఇ స్కూటర్‌ కలిగి ఉంటుంది.

ఓలా సోలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లోని మరో ప్రత్యేకత ఏంటంటే.. ఛార్జింగ్ తక్కువగా ఉంటే దగ్గరలోని ఛార్జింగ్ పాయింట్‌ ఎక్కడ ఉంటే అక్కడకు దానికదే స్వయంచాలకంగా వెళ్లిపోతుందని ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ఇందుకోసం ఓలా ఎలక్ట్రో స్నూజ్ క్వాంటమ్ ఆన్ సోలో అనే ఫీచర్‌ను అందిస్తోంది. పార్కింగ్ కూడా దానికదే చేసుకుంటుంది. అంతే కాకుండా టర్నింగ్‌లు, స్పీడ్ బ్రేకర్లను గుర్తించి దానికి అనుగుణంగా రైడ్‌ చేసుకుంటూ వెళ్లిపోతుంది.

Ola-Solo-Autonomous-Self-Driving-E-Scooter

అయితే ఈ వీడియోను చూసిన చాలా మంది ఏప్రిల్‌ 1st ఫూల్స్ డే సందర్భంగా విడుదల చేసినట్లు కామెంట్స్ చేస్తున్నారు. నిన్న ఏప్రిల్ 1 కావడంతో చాలా మంది ఇలా కామెంట్స్ చేస్తున్నారు. కానీ, "ఇది ఫేక్‌ కాదు. ఇది మా టెక్నాలజీ" అని ఓలా సీఈఓ భవిశ్‌ చెప్పారు. కాబట్టి త్వరలో ఓలా ఈ సెల్ఫ్ పవర్డ్ సోలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయానికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 2, 2024, 17:00 [IST]
English summary
Ola electric launches autonomous self driving electric scooter solo with ai technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+