ఓలా ఎలక్ట్రిక్‌ తిరుగులేని రికార్డు.. మార్చిలో ఏకంగా 53,000 రిజిస్ట్రేషన్లు

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric) అగ్రగామిగా ఉంది. తక్కువ ధరలో అద్భుతమైన పనితీరు కనబరిచే ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టడంతో ప్రతి నెలా విక్రయాల పరంగా ఓలా ఎలక్ట్రిక్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈవీ కంపెనీలకే కాకుండా సాంప్రదాయ టూ వీలర్‌ కంపెనీలకు సైతం ఈ దిగ్గజ సంస్థ గట్టిపోటీనిస్తోంది.

ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి ఓలా ఎలక్ట్రిక్(Ola Electric Sales March 2024) స్కూటర్ల సేల్స్‌ వివరాలను సంస్థ ప్రకటించింది. రికార్డు స్థాయిలో ఓలా స్కూటర్ల విక్రయాలు నమోదైనట్లుగా నివేదికలు సూచిస్తున్నాయి. గతంలో కంటే మరింత పురోగతిని సాధిస్తూ మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

Ola-Electric-Sales-In-March-2024

ఓలా ఎలక్ట్రిక్‌ మార్చిలో 53,000 కంటే ఎక్కువ ఓలా స్కూటర్ల(Ola Electric Sales) రిజిస్ట్రేషన్లను పూర్తి చేసింది. దేశీయ మార్కెట్లో కంపెనీ అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం వరుసగా ఇది 5వ నెల కావడం విశేషం. కాగా గత ఆర్థిక సంవత్సరం 2022-23 తో పోలిస్తే సంస్థ.. 1,52,741 యూనిట్లను విక్రయించగా.. 2023-24లో 3,28,785 యూనిట్లను విక్రయించి 115 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ప్రస్తుతానికి, ఓలా దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సెగ్మెంట్‌లో తన ఉనికిని కొనసాగిస్తూ.. త్రైమాసిక విక్రయాల్లో కూడా మంచి పురోగతిని సాధించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఆర్థి సంవత్సరం నాలుగో త్రైమాసికం అంటే జనవరి నుంచి మార్చి వరకు.. 1,19,310 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి.. 42 శాతం ఆధిక్యాన్ని కొనసాగించింది.

Ola-Electric-Sales-In-March-2024

ప్రస్తుతం భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ S1 సిరీస్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన S1 X Plus (S1 X+) ధర రూ. 84,999 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 3 KWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండగా.. పూర్తి ఛార్జింగ్‌పై 151 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. గరిష్ఠంగా గంటకు 90 కి.మీ (టాప్ స్పీడ్) వేగంతో ప్రయాణిస్తుంది.

ఇక Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కస్టమర్లు రూ.1.05 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 3 KWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు, ఇది పూర్తి ఛార్జింగ్‌పై 151 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఇందులో ఉపయోగించిన హబ్ మోటార్ 6 KW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

Ola-Electric-Sales-In-March-2024

ఓలా స్కూటర్లలో టాప్-ఎండ్ వేరియంట్, Ola S1 Proను, రూ. 1.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో సంస్థ విక్రయిస్తోంది. ఇందులో 4 KWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. పూర్తి ఛార్జ్‌పై 195 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. గరిష్ఠంగా గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 7-అంగుళాల TFT డిస్‌ప్లేతో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.

Ola-Electric-Sales-In-March-2024

భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు.. టీవీఎస్, హీరో, బజాజ్ మరియు ఏథర్ ఎనర్జీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అతిపెద్ద పోటీగా ఉన్నాయి. అయితే, Ola స్కూటర్లు ఆకర్షణీయమైన డిజైన్‌లు, ఫీచర్లు మరియు మంచి పనితీరుతో ఉండటంతో.. కస్టమర్లు వీటిని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా మార్కెట్లో అత్యధిక శాతం వాటాను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, April 1, 2024, 19:02 [IST]
English summary
Ola electric records 53 thousand registrations in march and marks highest yoy growth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+