రికార్డు స్థాయిలో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రిజిస్ట్రేషన్లు.. మార్చిలో వాటిపై ఏకంగా రూ. 25 వేల తగ్గింపు.!!

దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్‌ సరికొత్త రికార్డును సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యధికంగా 35,000 ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric Registrations) స్కూటర్ల రిజిస్ట్రేషన్లను సాధించినట్లు ఓలా ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. ఓలా బ్రాండ్‌తో సరసమైన ధర, అధిక రేంజ్‌, స్టైలిష్‌ మోడల్‌, ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను నిత్యం ఆకట్టుకుంటూనే ఉంటోంది. అత్యాధునిక ఫీచర్ల మేళవింపుతో ఉన్న ఓలా స్కూటర్లను జనం ఎగబడి మరీ కొంటున్నారు.

Ola-Electric-Highest-Registarions-In-February

అందుకు నిదర్శనమే.. ఫిబ్రవరి నెలలో ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric) స్కూటర్ల రిజిస్ట్రేషన్లు. ఈ సారి ఓలా ఎలక్ట్రిక్‌ సరికొత్త రికార్డును నెలకొల్పుతూ ఈవీ సెగ్మెంట్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఫిబ్రవరి నెలలో అత్యధికంగా 35,000 రిజిస్ట్రేషన్లు సాధించడమే కాకుండా.. 42 శాతం మార్కెట్‌ వాటాతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

కాగా ఓలా ఎలక్ట్రిక్‌ గత మూడు నెలల్లో దాదాపు లక్ష రిజిస్ట్రేషన్లు నమోదు చేసింది. గతేడాది డిసెంబర్‌, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో 30,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లను నమోదు చేసి.. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 100 శాతం వృద్ధిని సాధించింది.

Ola-Electric-Highest-Registarions-In-February

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అత్యధిక రిజిస్ట్రేషన్లతో పాటు మార్కెట్‌ వాటాలో స్థిరమైన వృద్ధిని సాధించినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ మార్కెటిగంగ్‌ ఆఫీసర్‌ అన్షుల్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లను తీసుకువస్తున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (PLI)కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్‌.. తన స్కూటర్ల ధరలు తగ్గించడం కూడా విశేషం. పీఎల్‌ఐ స్కీమ్‌ కింద.. ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1 ప్రో స్కూటర్లు సర్టిఫికేషన్ పొందాయి. ఈ స్కీమ్ ద్వారా ఓలా స్కూటర్లపై రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

Ola-S1X

బడ్జెట్ ధరలో స్కూటర్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌.. ఇటీవలే రూ. 79,999 ధరతో Ola S1X స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఓలా ప్రస్తుతం మార్కెట్లో ఓలా S1 Pro, S1 ఎయిర్, S1 X+ ను విక్రయిస్తుండగా.. S1 X స్కూటర్‌ను 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంచింది.

కాగా ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌ తన S1 సిరీస్‌ పోర్ట్‌పోలియోపై రూ.25,000 భారీ తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఆఫర్‌ నిన్నటితో ముగియడంతో సంస్థ కస్టమర్లు మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ బంపరాఫర్‌ను ఈ మార్చి నెలాఖరు వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లు ఓలా ఎస్‌1 స్కూటర్లపై రూ. 25,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Ola-S1X-Plus

ప్రస్తుతం ఓలా ఎస్‌1 ప్రో రూ.1.30 లక్షలు, ఎస్‌1 ఎయిర్‌ రూ. 1.05 లక్షలు, S1(X) 4kwh బ్యాటరీ ప్యాక్‌ రూ. 1.10 లక్షలు, S1X+ 3kwh రూ. 84,999, S1X(3kwh) 89,999, S1X(2kwh) 79,999 ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. తాజా ఆఫర్‌ ప్రకారం కస్టమర్లకు ఈ స్కూటర్లపై రూ. 25,000 తగ్గింపును అందిస్తోంది.

ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు. అంతే కాకుండా ఈవీ సెగ్మెంట్‌లో మరింతగా సత్తా చాటేందుకు.. ఏప్రిల్ 2024 నాటికి దేశవ్యాప్తంగా ఓలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లను 600 కు పెంచుకోవాలని చూస్తోంది. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 414 సర్వీస్ సెంటర్‌లు ఉన్నాయి. ఈ మేరకు సర్వీస్‌ సెంటర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించే యోచనలో ఓలా ఎలక్ట్రిక్‌ ఉంది.

Ola-S1-2Kwh

దీంతో పాటు వచ్చే త్రైమాసికం నాటికి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను 10,000 పాయింట్లకు పెంచాలని కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ భావిస్తోంది. అంతే కాకుండా.. కంపెనీ 3KW యొక్క పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్ అనుబంధాన్ని కూడా ఇటీవల తీసుకువచ్చింది. దీని ద్వారా రైడర్లు సౌకర్యవంతమైన, అడ్డంకి లేని జర్నీని స్టార్ట్‌ చేయవచ్చు. ఇది ధర రూ. 29,999 వద్ద కొనగోలుకు అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2024, 19:47 [IST]
English summary
Ola electric records highest registrations in february 2024 one lakh sales in just 3 months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+