అత్యంత చౌకగా ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు.!!
కొత్త స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఓలా ఎలక్ట్రిక్ అదిరిపోయే న్యూస్‌ను తీసుకువచ్చింది. Ola Electric తన S1X స్కూటర్ వేరియంట్ ధరలను భారీగా తగ్గించింది. ఈ స్కూటర్ వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. మరి దేనిపై ఎంత మేర ధరలు తగ్గాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్.. మార్కెట్లో సూపర్ పర్ఫామెన్స్ స్కూటర్లను విక్రయిస్తోంది. S1, S1X సిరీస్ స్కూటర్లను విక్రయిస్తూ ప్రతి నెలా విక్రయాల పరంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ సంస్థ.. తన ప్రముఖ S1X సిరీస్ స్కూటర్ల ధరలను మరోసారి తగ్గించింది. దీంతో మరింత సరసమైన ధరలో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

Ola Electric S1X వేరియంట్ మోడల్స్‌ను చౌకైన ధరల్లో తీసుకువచ్చింది. S1X ప్రారంభ ధర రూ. 69,999 గా ఉంది. అంతేకాకుండా బ్యాటరీ వారంటీని కూడా తీసుకువచ్చింది. కాగా S1X వివిధ kWh వేరియంట్‌లతో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సవరించిన ధరలతో కొత్త S1X స్కూటర్ డెలివరీలు వచ్చే వారం నుంచి ప్రారంభమవుతాయి.
ఇక ఓలా ఎలక్ట్రిక్.. తన S1X సిరీస్ స్కూటర్లను 2 KWh, 3 KWh, 4 KWh బ్యాటరీ ప్యాక్‌ల్లో విక్రయిస్తోంది. కాగా Ola S1X (4kWh) ధర ప్రస్తుతం రూ. 10,000 తగ్గి రూ. 99,999 వద్ద అందుబాటులో ఉంది. గతంలో ఈ స్కూటర్ ధర రూ. 1.09 లక్షలుగా ఉంది.

ఇక ఓలా S1X స్కూటర్ 3 kWh వేరియంట్ ధర రూ. 84,999కి తగ్గింది. చివరగా.. 2 kWh బ్యాటరీతో నడిచే చౌకైన స్కూటర్‌ను రూ. 69,999 ప్రారంభ ధరలో సొంతం చేసుకోవచ్చు. ధరల తగ్గుదలతో మార్కెట్లో S1X స్కూటర్ల సేల్స్ మరింతగా పెరుగుతాయని ఓలా ఎలక్ట్రిక్ ఆశాభావంతో ఉంది.
ఓలా S1X ప్రస్తుతం ఏడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కాగా స్కూటర్ డెలివరీలు వచ్చే వారం నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి గల కస్టమర్లు సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఇక ధరలు సవరించిన ఈ స్కూటర్లలోని ఫీచర్లు, ప్రత్యేకతలను పరిశీలిస్తే..

Ola S1Xలో 5-అంగుళాల స్క్రీన్, 34 L బూట్ స్పేస్, అదే ఐకానిక్ Ola హెడ్‌ల్యాంప్ మరియు గ్రాబ్ రైల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా Ola S1X 2 kWh మరియు 3 kWh మోడల్‌లు ఫిజికల్ కీలతో వస్తాయి.
ఓలా S1X 4 kWh మోడల్ పూర్తి ఛార్జింగ్‌పై 190 km IDC రేంజ్‌ను ఇస్తుందని సంస్థ తెలిపింది. కాగా S1X 2 kWh మరియు 3 lkWh మోడల్‌లు వరుసగా 95 కి.మీ మరియు 143 కి.మీ రేంజ్‌ను అందిస్తాయని సంస్థ వెల్లడించింది.
కాగా Ola ఎలక్ట్రిక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో S1 X+, S1 ఎయిర్ మరియు S1 ప్రో ధరలను గణనీయంగా తగ్గించింది. ఆ సమయంలో, Ola S1X+ ధరను రూ. 25,000 కు పైగా తగ్గించింది. అంతేకాకుండా Ola తన మొత్తం స్కూటర్ల లైనప్ కోసం ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా 8-సంవత్సరాలు లేదా 80,000 కి.మీ పొడిగించిన బ్యాటరీ వారంటీని కూడా తీసుకువచ్చింది.


Click it and Unblock the Notifications








