ఏప్రిల్‌ 15 న ఓలా S1X పై కీలక అప్‌డేట్‌లు.. కొత్త ధరలపై ప్రకటన.!!

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric).. ఈ ఏడాది ఏప్రిల్‌ 15న 2024 ఓలా S1X ఇ-స్కూటర్‌కు సంబంధించి కీలక సమాచారం వెల్లడి కానుంది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవిష్‌ అగర్వాల్ వెల్లడించారు. ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అదే రోజున వెల్లడించనుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్‌ సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ నంబర్‌ 1 గా కొనసాగుతోంది. మార్కెట్లో 40 శాతానికి పైగా వాటాతో ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్‌ తన లైనప్‌లో S1, S1 Pro, S1 Air సిరీస్‌ స్కూటర్లను విక్రయిస్తోంది.

Ola-S1X-Update-Version-On-April-15th

ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్‌ కొత్త బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్‌తో 2024 ఓలా S1X స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఈ క్రమంలో 2024 ఓలా S1X ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు సంబంధించి అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను ఈ నెల 15 న సంస్థ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్‌ అగర్వాల్‌.. X వేదికగా వెల్లడించారు.

ఓలా S1X స్కూటర్‌కు సంబంధించి అప్‌డేట్‌ వెర్షన్‌ పూర్తి వివరాలు, ఓలా స్కూటర్ల కొత్త ధరలు అదే రోజు వెల్లడి కానున్నాయి. కొత్త ఓలా S1X సిరీస్‌ అప్‌డేట్‌ వెర్షన్‌లో.. S1 ప్రో, S1 ఎయిర్ మోడల్స్‌లో అందించిన ఫీచర్లు ఉంటాయని భవిష్‌ వెల్లడించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ వెర్షన్‌కు ఫిజికల్‌ కీ కూడా ఉండనుంది.

Ola-S1X-Update-Version-On-April-15th

ఓలా S1X లో ఫిజికల్‌ కీ ద్వారా రైడర్లకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించవచ్చని సంస్థ చెబుతోంది. సెక్యూరిటీ కోడ్ లాక్/అన్‌లాక్ ఆప్షన్‌తో ఎదురవుతున్న ఇబ్బందులను ఫిజికల్ కీ దూరం చేయనుంది. కాగా X లో షేర్ చేసిన ఫొటోలను బట్టి చూస్తే, డిజైన్ పరంగా కొత్త ఎడిషన్‌లో పెద్దగా మార్పులు లేనట్లే తెలుస్తోంది. అయితే ఈ స్కూటర్‌ కొత్త కలర్‌ ఆప్షన్లకో రానున్నట్లు సమాచారం.

ఇక అప్‌డేటెడ్ ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొత్త ఫీచర్లతో రానుంది. ఈ క్రమంలో ఈ స్కూటర్‌ ధరలు కూడా పెరగనున్నట్లు తెలుస్తోంది. FAME-2 సబ్సిడీ స్కీమ్ గడువు కూడా ముగియడంతో.. ప్రస్తుతం ఉన్న వాటి కంటే ఈ ధరలు లేటెస్ట్ ఎడిషన్ S1X సిరీస్ ధరలు ఎక్కువగా ఉండనున్నాయి.

Ola-S1X-Update-Version-On-April-15th

కాగా FAME సబ్సిడీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను ప్రవేశపెట్టింది. అయితే FAME-2తో పోలిస్తే ఈ స్కీమ్‌లో సబ్సిడీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఓలా S1X తో పాటు మిగతా అన్ని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం Ola S1X లైనప్‌ S1X, S1X+ వంటి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇంకా 4 kWh, 3 kWh, 2 kWh అనే మూడు బ్యాటరీ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఓలా S1X (2 kWh) వేరియంట్‌ ధర రూ.80,000 నుంచి ప్రారంభం కాగా.. మిడ్-స్పెక్ ఓలా S1X+ (3 kWh) ఎడిషన్ ధర రూ.85,000గా ఉంది.

Ola-S1X-Update-Version-On-April-15th

ఇక S1X (4 kWh బ్యాటరీ) ధర రూ.1.10 లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ క్రమంలో ఏప్రిల్ 15న ఓలా ఎలక్ట్రిక్‌ తన వివిధ ప్రొడక్ట్స్ గురించి కీలక వివరాలు వెల్లడించనుంది. అంతే కాకుండా S1X డెలివరీ టైమ్‌లైన్‌ వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 12, 2024, 16:53 [IST]
English summary
Ola electric s1x updated version will be launched on april 15th check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+