కనీవినీ ఎరుగని డిస్కౌంట్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండోయ్..
టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ కంపెనీలు తన ఎలక్ట్రిక్ వాహనాల మీద డిస్కౌంట్స్ ప్రకటించిన తరువాత ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఎట్టకేలకు తమ స్కూటర్ల మీద కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ ఎస్1 స్కూటర్ లైనప్ కోసం గరిష్టంగా రూ. 25000 డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి (ఫిబ్రవరి 29) వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అంతే కాకుండా డిస్కౌంట్ అనేది కేవలం ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ మరియు ఎస్1 ఎక్స్ ప్లస్ (3 kWh) మోడల్‌లకు మాత్రమే వర్తిస్తుంది.

డిస్కౌంట్ తరువాత ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ (3 kWh) ధర రూ. 1.10 లక్షల నుంచి 85000 రూపాయలకు చేరింది. అంటే ఈ స్కూటర్ కొనుగోలుపై కస్టమర్ రూ. 25000 తగ్గింపు పొందవచ్చు. అయితే ఓలా ఎంట్రీ లెవెల్ మోడల్ ఎస్1 ఎక్స్ (2 kWh) మీద ఎలాంటి డిస్కౌంట్ లేదు. కాబట్టి దీని ధర రూ. 79999 (ఎక్స్ షోరూమ్) వద్ద అలాగే కొనసాగుతుంది.
ఇక ఓలా ఎస్1 ఎయిర్ మరియు ఓలా ఎస్1 ప్రో కూడా వరుసగా రూ. 15000, రూ. 18000 డిస్కౌంట్స్ పొందుతాయి. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రస్తుత ధరలు రూ. 104999 (ఎస్1 ఎయిర్), రూ. 129999 (ఎస్1 ప్రో) వద్ద ఉన్నాయి. ఈ ఆఫర్స్ లేదా డిస్కౌంట్ కేవలం మరి కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 29 తరువాత ఈ ఆఫర్ అందుబాటులో ఉండకపోవచ్చు.

డిస్కౌంట్స్ మాత్రమే కాకుండా.. కంపెనీ ఈ నెల ప్రారంభం నుంచి తమ మొత్తం ఉత్పత్తి శ్రేణికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 8 సంవత్సరాలు/80000 కిమీ ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వ్యారంటీ కూడా అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత పెంచడానికి కూడా సన్నద్ధం అవుతోంది. ప్రస్తుతం కంపెనీకి దేశ వ్యాప్తంగా 414 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఇవి 2024చివరి నాటికి 600లకు పొడిగించడానికి సంస్థ యోచిస్తోంది.
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అద్భుతమైన అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి కృషి చేస్తూనే ఉంది. దీంతో కంపెనీ అమ్మకాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. 2024లో కంపెనీ అమ్మకాల్లో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. సంస్థా గత నెలలో ఏకంగా 32వేల కంటే యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. ఈ అమ్మకాలు 2024 డిసెంబర్ కంటే ఎక్కువ కావడం గమనార్హం.
ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలను పొందటానికి ప్రధాన కారణం.. ఆధునిక ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టడమే. ఇప్పటికే సంస్థ ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త స్కూటర్లను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అంతే కాకుండా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తమ సంస్థ ఉనికిని మరింత విస్తరించడానికి తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ తమ ఉత్పత్తుల మీద డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ ప్రకటించడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా తమ ఉత్పత్తుల మీద ఆకర్షణీయమైన ఆఫర్స్ అందించింది. ఎక్కు వమంది కస్టమర్లను ఆకర్శించడమే కాకుండా.. మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెంచడం, రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్న కాలుష్య ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఓలా ఎలక్ట్రిక్ తనదైన పాత్ర పోషిస్తోంది.


Click it and Unblock the Notifications








