అత్యంత చౌకైన ఓలా S1X డెలివరీలు ప్రారంభం.. 8 ఏళ్ల వారంటీ, అదరగొట్టే ఫీచర్లు

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) ఇటీవల సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ S1 X మోడల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. అత్యంత సరసమైన ధర, మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ పూర్తి వివరాలు ఈ కథనంలో..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. ఫ్యూయెల్ ఖర్చుల భారం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా ఈవీ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ అగ్రగామిగా ఉంటోంది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తూ మార్కెట్లో 40 శాతం వాటాను దక్కించుకుంది.

Ola-S1X-E-Scooter-Deliveries-Commence

ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్(Ola S1X Deliveries) ఇటీవల అత్యంత చౌక ధరలో ఓలా S1X ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్లో S1X రూ. 69,999 ప్రారంభ ధర వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కాగా ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.

ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కస్టమర్లు 3 విభిన్న బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. Ola S1X స్కూటర్ 2 kWh, 3 kWh మరియు 4 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో సంస్థ తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 X మరియు Ola S1 X+ అనే రెండు వేరియంట్లలోనూ లభ్యమవుతుంది.

Ola-S1X-E-Scooter-Deliveries-Commence

కస్టమర్లు Ola S1 X ను 2kWh, 3kWh మరియు 4kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. Ola S1 X ప్లస్ మాత్రం 3kWh ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంది. S1X 3kwh ధర రూ.84,999 కాగా 4kwh ధర రూ.99,999. ఓలా S1X 2kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 95 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

కాగా 3kWh బ్యాటరీ ప్యాక్ 143 కి.మీ నుంచి 151 కి.మీల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇక ఓలా S1X 4 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపిక మాత్రం 190 కి.మీ రేంజ్ అందిస్తుంది. అయితే Ola S1X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ 5-అంగుళాల స్క్రీన్‌తో వస్తుండగా.. మిగతా అన్ని ఇతర వేరియంట్‌లు మాత్రం 4.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తాయి.

ఇంకా Ola S1X ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కీలెస్ ఆపరేషన్, స్మార్ట్ కనెక్టివిటీ, మల్టీ-కలర్ ట్రిమ్, ఫ్లాట్ ఫుట్‌రెస్ట్, 34 లీటర్ బూట్ స్పేస్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ స్కూటర్ గరిష్ఠంగా 90 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా ఇందులో క్రూయిజ్ కంట్రోల్ మరియు అధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే ఇందులో 6 కిలోవాట్ల మోటారును ఉపయోగించారు. ఇది కేవలం 3.3 సెకన్లలో 40 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. రైడర్ల కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ ఉన్నాయి.

అంతేకాకుండా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం సంస్థ 8 ఏళ్లు/80 వేల కిలోమీటర్ల వారంటీని ప్రకటించింది. అయితే కస్టమర్లు ఈ వారంటీని మరింత పెంచుకోవచ్చని కూడా తెలిపింది. అయితే 1 లక్ష కి.మీ వారంటీకి రూ. 4,999 మరియు 1.25 లక్షల కి.మీ వారంటీకి రూ.12,999 చెల్లించాల్సి ఉంటుంది.

Article Published On: Saturday, May 11, 2024, 8:10 [IST]
English summary
Ola electrics cheapest e scooter s1x deliveries commence check price features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+