Ola Commercial E Scooter వాణిజ్య అవసరాల కోసం ఓలా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌.. స్వాపబుల్‌ బ్యాటరీ ఫీచర్‌.!!

ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పేటెంట్ దాఖలు చేసింది. ఈ స్కూటరును వాణిజ్య అవసరాల(Ola Commercial Electric Scooter) కోసం రూపొందిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వివరాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..

దేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్ హవా కొనసాగుతోంది. గతేడాది 40 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు దేశంలో ప్రజాదరణ కూడా విపరీతంగా పెరుగుతోంది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌.. తమిళనాడులో ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది.

Ola-Commercial-E-Scooter

కాగా భారత మార్కెట్లో కమర్షియల్ విభాగంలోనూ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ తన కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి పేటెంట్ దాఖలు చేసినట్లు సమాచారం.

అయితే ఓలా తన కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పేటెంట్‌ను నమోదు చేసి కూడా దాదాపు ఏడాది పూర్తయింది. అయితే, తాజాగా దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులోకి రావడంతో.. ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలను చూస్తుంటే.. ఈ స్కూటర్‌ ఎక్కువ బాడీ ప్యానెల్స్ లేకుండా దాదాపు సైకిల్‌లా కనిపించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

సాధారణ గొట్టపు ఛాసిస్‌పై ఈ స్కూటర్‌ను ఓలా ఎలక్ట్రిక్‌ నిర్మించింది. కాంపాక్ట్ సైజులో ఓలా కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారవుతున్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గుతుంది. హ్యాండిల్‌బార్ పరిమాణం కూడా చిన్నదిగా కనిపిస్తోంది. అయితే ఓలా S1 స్కూటర్ల మాదిరిగా ఈ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో టెక్నాలజీ ఫీచర్లను అందించకపోవచ్చని తెలుస్తోంది.

అయితే, ఈ ఫొటోలను పరిశీలిస్తే.. ఓలా కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ హ్యాండిల్‌బార్ మధ్యలో ఒక చిన్న ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పరిశీలించవచ్చు. దీని ప్రకారం ఈ ఇన్‌స్ట్రుమెంటల్‌ క్లస్టర్‌(Ola Commercial Electric Scooter Twin Battery Setup)ను డిజిటల్ రూపంలో అందించవచ్చు. అయితే LCD ఫీచర్‌ అనేది స్టాండర్డ్‌గా వస్తుంది.

ఇక సస్పెన్షన్‌ సెటప్‌ విషయానికొస్తే.. ఓలా కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ ముందు భాగంలో ట్విన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ లాగా కనిపించడాన్ని చూడవచ్చు. కానీ ఇది సింగిల్ ఫోర్క్ సెటప్‌గా వస్తుందని ఆశించవచ్చు. ఎందుకంటే ప్రస్తుత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్నీ సింగిల్ ఫోర్క్ సస్పెన్షన్‌తో వస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా ఓలా కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో సీటు కింద ఎక్కువ స్థలాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా, ఓలా తన S1 స్కూటర్‌లో డ్రైవర్ ఫుట్‌బోర్డ్ క్రింద బ్యాటరీని తీసుకువచ్చింది. కానీ ఓలా ఈ వాణిజ్య స్కూటర్‌లో బ్యాటరీని స్వాపబుల్‌ ఫెసిలిటీ(Removable Battery Facility)తో అందించే అవకాశం ఉంది. కాగా కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా రూపొందించరు.

నిత్యం లోడ్లు మోయగలిగేంత బలంగా మరియు సమర్థవంతంగా కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉంటాయి. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని రూపొందిస్తారు. అయితే వాణిజ్య వాహనాల విక్రయ ఒప్పందం సాధారణంగా రెండు కంపెనీల మధ్య జరుగుతుంది. దీని ద్వారా ఓలా నేరుగా కస్టమర్లను సంప్రదించాల్సిన అవసరం లేకుండా వీటి విక్రయాలు జరుగుతాయి.

ఇంకా ఓలా కమర్షియల్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సింగిల్-పీస్ సీటును అందించనున్నట్లు ఈ ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇంకా కార్గో సేవల కోసం పెద్ద లగేజ్ రాక్‌ను కల్పిస్తుంది. ఇక వీల్స్‌ 10-అంగుళాలు ఉండవచ్చు. ఇందులో హై-ప్రొఫైల్ ట్యూబ్‌లెస్ టైర్‌లను ఉపయోగించవచ్చు. ఇక ఇందులో ఉపయోగించే బ్యాటరీ 3 kWh ప్యాక్‌తో 150 కి.మీ రేంజ్‌తో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 27, 2024, 12:49 [IST]
English summary
Ola patents for new commercial electric scooter removable battery feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+