Ola నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 8 సంవత్సరాల వారంటీ, 190 కి.మీ రేంజ్..!
ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త S1 X 4 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ లాంచ్ చేసింది. ఈ Ola S1 X 4 kWh స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 190 కిమీ పరిధిని అందించనుంది. S1X లైనప్ లలో 4 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉన్న స్కూటర్ ఇదే కావడం విశేషం.
ఓలా S1 X 4 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ₹ 1.10 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది S1 X 3 kWh వేరియంట్ కంటే దాదాపు ₹20,000 ఖరీదైనది. ప్రారంభ స్థాయి Ola S1 X 2 kWh ట్రిమ్ రూ.79,999 వద్ద అందుబాటులో ఉంది.

Ola S1 X 4 kWh S1X 3kWh ఉండే మెకానిజం తో పనిచేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 0-40 kmph వేగాన్ని 3.3 సెకన్లలో అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 90 kmph వేగంతో ప్రయాణించవచ్చు. ఎలక్ట్రిక్ మోటార్ 6 kW (8 bhp) ఉత్పత్తిని కొనసాగిస్తుంది. ఈ స్కూటర్ మూడు రైడింగ్ మోడ్లతో వస్తుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్ లలో రానున్నాయి.
ఏప్రిల్ నుంచి S1 X 2 kWh మరియు 3 kWh వేరియంట్ డెలివరీలు ప్రారంభమవుతాయని Ola ధృవీకరించింది. కొత్త S1X4 kWh వేరియంట్ యొక్క డెలివరీలు కూడా ఏప్రిల్లో ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ టాప్ వేరియంట్ కోసం బుకింగ్ లను సంస్థ స్వీకరిస్తుంది.

ఈ ఏడాది ఏప్రిల్ నాటికి తమ సర్వీస్ నెట్ వర్క్ లను ప్రస్తుత 400 నుండి 600 అవుట్ లెట్ విస్తరించే ప్రణాళికలు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతే కాకుండా, ఏప్రిల్ నాటికి 10,000 ఫాస్ట్ ఛార్జర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
చివరగా, ఓలా ఎలక్ట్రిక్ S1 ఎయిర్ మరియు S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాల/80,000 కిమీ వారంటీని ప్రారంభించింది. అంతే కాకుండా అదనంగా ₹5,000కి లక్ష కిమీల పొడిగించిన వారంటీని అందించనుంది. అయితే 1.25 లక్షల కిమీ పొడగింపు వారంటీ కావాలంటే రూ.12,500 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ & MD భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. "ఉత్పత్తులు, సేవలు, ఛార్జింగ్ నెట్‌వర్క్ మరియు బ్యాటరీ వారంటీలపై అన్ని అడ్డంకులను అధిగమించడానికి ఒక పెద్ద ముందడుగు వేసినట్లు చెప్పారు. సరికొత్త S1 X 4kWhని తక్కువ ధరలో కస్టమర్లకు అందించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
భారతదేశం అంతటా మా సేవ మరియు ఛార్జింగ్ నెట్‌వర్క్‌ని విస్తరించడంతో పాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మా 8 సంవత్సరాల పొడిగించిన బ్యాటరీ వారంటీ EV పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మా కస్టమర్‌లందరికీ పెంచుకోవడానికి ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








