Revolt RV400 BRZ తక్కువ ధరలో రివోల్ట్‌ మోటార్స్‌ నుంచి ఎలక్ట్రిక్ బైక్‌ లాంచ్‌.. 150 కి.మీ రేంజ్‌

భారత మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదలైంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు Revolt Motors రివోల్ట్‌ మోటార్స్‌ RV400 BRZ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌, అద్భుతమైన ఫీచర్లతో ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. ధర, ఫీచర్లు, బ్యాటరీ పనితీరు గురించి ఇక్కడ అందిస్తున్నాం.

దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది. గత రెండేళ్లుగా ఈవీలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ ధరలో మంచి పనితీరుతో పాటు ఇంధన బాధలు తప్పించడమే ఇందుకు కారణం. ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే మార్కెట్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నంత అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్‌ బైకులు అందుబాటులో లేవనేది వాస్తవం.

Revolt-RV400-BRZ-Bike-Launch-Price-Battery

చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కొరత తీర్చేందుకు హర్యానాకు చెందిన ఆటో కంపెనీ రివోల్ట్‌ మోటార్స్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను ప్రవేశపెట్టింది. RV400 బైక్‌ యొక్క కొత్త వేరియంట్‌ RV400 BRZ ఎలక్ట్రిక్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. ఈ బైక్‌ ధర రూ. 1.34 లక్షలు(ఎక్స్‌ షోరూమ్‌).

బ్యాటరీ విషయానికొస్తే కొత్త రివోల్ట్ RV400 BRZ ఎలక్ట్రిక్ బైక్‌లో 72V 3.24 kWh లిథియం - అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్ బ్యాటరీ కేవలం 3 గంటల్లో 0 నుంచి 75 శాతం ఛార్జ్ అవుతుండగా.. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటల సమయం పడుతుందని సంస్థ తెలిపింది.

Revolt-RV400-BRZ-Bike-Launch-Price-Battery

రైడర్ల కోసం రివోల్ట్ మోటార్స్‌ కొత్త RV400 BRZ ఎలక్ట్రిక్‌ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తోంది. అవి ఎకో, నార్మల్‌, స్పోర్ట్‌ మోడ్‌లు. పూర్తి ఛార్జ్‌ చేసినప్పుడు ఈ మోడ్‌లలో వరుసగా బైక్‌ 150 కి.మీ, 100 కి.మీ మరియు 80 కి.మీ రేంజ్‌ను అందిస్తాయని రివోల్ట్‌ మోటార్స్‌ వెల్లడించింది.

Revolt-RV400-BRZ-Bike-Launch-Price-Battery

రివోల్ట్ RV400 BRZ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో సైడ్-స్టాండ్ కట్-ఆఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ లూనార్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, డార్క్ సిల్వర్, రెబెల్ రెడ్‌తో సహా 5 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

Revolt-RV400-BRZ-Bike-Launch-Price-Battery

కొత్త రివోల్ట్ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్‌ చేయడంపై రివోల్ట్‌ మోటార్స్‌ అధికారి అంజలి రత్తన్ హర్షం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారుల అవసరాలను తెలుసుకుని, వారి అభిప్రాయాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఈ బైక్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. కొత్త RV400 BRZ బైక్‌ రైడింగ్‌లో కస్టమర్లు మంచి అనుభూతిని పొందుతారని వెల్లడించారు.

తక్కువ ధరలో అధిక రేంజ్‌ ఇచ్చే బైక్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి Revolt RV400 BRZ ను ఓ సారి పరిశీలించవచ్చు. బ్యూటిఫుల్‌ డిజైన్‌, ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు ఆకట్టుకునే రంగుల్లో ఈ బైక్‌ అందుబాటులోకి వచ్చింది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా అధీకృత డీలర్‌షిప్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చు.

Revolt-RV400-BRZ-Bike-Launch-Price-Battery

కాగా ప్రస్తుతం, దేశంలో కొనుగోలుకు Revolt RV400 మోడల్‌ అందుబాటులో ఉంది. ఈ బైక్‌ ధర రూ. 1.27 లక్షల నుండి రూ. 1.38 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది 3 KWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 24, 2024, 9:27 [IST]
English summary
Revolt rv400 brz electric bike launched price features battery range details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+