రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్‌ వచ్చేసింది.. ఆరు కలర్లు, తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గెరిల్లా 450 (Royal Enfield Guerrilla 450) బైక్‌ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. ఇది షెర్పా (Shepra) 450 ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా వచ్చిన ప్రీమియం మోడరన్‌ రోడ్ స్టర్‌ బైక్‌గా వచ్చింది. ఈ బైక్‌లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆర్టికల్స్‌లో ముందే చెప్పినట్లుగా అదే హిమాలయన్ 450 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్‌లో 452 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలదు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను తీసుకువచ్చి కస్టమర్లను ఆకర్షించనుంది. ఈ బైక్‌ రాకతో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సేల్స్‌ మరింత పెరుగుతాయని సంస్థ భావిస్తోంది.

గెరిల్లా 450 బైక్‌లోని 452 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ షెర్పా ఇంజన్, 4-వాల్వ్ డిఓహెచ్‌సీ సెటప్‌తో పనిచేస్తుంది. ఇది 8,000 rpm వద్ద 40 ps శక్తిని మరియు 5,500 rpm వద్ద 40 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని టార్క్ 85 శాతానికి పైగా 3000 rpm నుంచి లభిస్తుంది.

Royal-Enfield-Guerrilla-450-Launched

ఇంటిగ్రేటెడ్ వాటర్ పంప్, ట్విన్ పాస్ రేడియేటర్, ఇంటర్నల్ బైపాస్‌ వాటర్ కూల్డ్ సిస్టమ్‌ని ఈ బైక్‌లో అందించారు. అసిస్ట్ మరియు స్లిప్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ గెరిల్లా 450 బైకులో స్టెప్డ్ సీటు, 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ఇంటిగ్రేటెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో కూడిన LED హెడ్‌లైట్లు ఉన్నాయి. ఇందులో అప్‌స్వెప్టెడ్ సైలెన్సర్ మరియు స్టీల్ ట్విన్-స్పార్ ట్యూబ్యులర్ ఫ్రేమ్ ఉన్నాయి.

దీని ఫ్రంట్ సస్పెన్షన్‌లో 43 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో లింకేజ్ టైప్ మోనో షాక్ ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ ముందు, వెనక 17 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు కలవు. ఇది 1440 ఎంఎం వీల్ బేస్‌తో నడుస్తుంది. ఇది 169 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. 2090 మి.మీ పొడవు, 833 మి.మీ వెడల్పు, ఎత్తు 1125 మిమీ ఉంది. దీని పేలోడ్ సామార్థ్యం 191 కిలోలుగా ఉంది.

Royal-Enfield-Guerrilla-450-Bike-Price

ఇక ఫ్రంట్ బ్రేక్‌లో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్, 310 మిమీ వెంటిలేటెడ్ డిస్క్, డబుల్ పిస్టన్ కాలిపర్ బ్రేక్‌ కలదు. ఇక వెనుక బ్రేకులు కూడా హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌తో, 270 మిమీ వెంటిలేటెడ్ డిస్క్, సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో వస్తాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ బ్రేకింగ్‌ మరింత సేఫ్టీని అందించనుంది.

ఈ బైక్‌లోని రైడింగ్ మోడ్స్, టెక్నాలజీ హైలైట్స్‌ అని చెప్పవచ్చు. ఇందులోని ఇంజిన్ మేనేజ్ మెంట్ సిస్టం (EMS), రైడ్ బై వైర్ టెక్నాలజీ మంచి రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఈ బైక్‌లోని పెర్ఫార్మెన్స్ మోడ్ మరియు ఎకో మోడ్‌లు రైడర్లను వివిధ రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడానికి అనుమతిస్తాయి. వీటిలో మంచి ఫర్ఫామెన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా అందిస్తుంది.

Royal-Enfield-Guerrilla-450-Features

గెరిల్లా 450 ఇన్‌ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, ట్రిప్పర్ డాష్, 4-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంది. ఇది జీపీఎక్స్‌ ఫార్మాట్‌లో రూట్ రికార్డింగ్, మ్యూజిక్ కంట్రోల్, వెదర్‌ అలర్ట్స్‌ ఇతర పూర్తి వెహికిల్‌ సమాచారాన్ని అందిస్తుంది. గెరిల్లా 450 పనితీరు మరియు శైలిని మెరుగుపరచడానికి వివిధ రకాల యాక్ససరీలను జోడించారు. ఇందులో పెద్ద ఇంజిన్ గార్డులు, సంప్ గార్డులు, అర్బన్ సీటు, టింటెడ్ ఫ్లైస్క్రీన్, బ్లాక్ అవుట్ అద్దాలు ఉన్నాయి.

వీటితో పాటు బెంచ్ సీటు, సిల్వర్ సంప్ గార్డ్, హెడ్ గ్రిల్, హాల్సియోన్ బ్లాక్ ఇన్‌స్ట్రూమెంట్ కౌల్, కాంపాక్ట్ ఇంజిన్ గార్డులు, బార్ ఎండ్ అద్దాలు, సాఫ్ట్ పానియర్స్‌ని కూడా గమనించవచ్చు. ఈ బైక్‌ ఆరు కలర్‌ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్‌పై కంపెనీ పూర్తి స్థాయి వారంటీని అందిస్తుంది. కాబట్టి రైడర్లు ఎటువంటి ఆందోళన లేకుండా ఈ బైక్‌ని వినియోగిచవచ్చు.

Royal-Enfield-Guerrilla-450-News

ఈ బైక్‌కి సంబంధించిన బుకింగ్స్‌ భారత్‌తో పాటు యూరప్‌లో స్లాట్స్‌ ఓపెన్‌ అయ్యాయి. దేశంలో దీని ప్రారంభ ధరను రూ .2,39,000 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. భారత్‌లో దీని టెస్ట్ రైడ్స్, రిటైల్ సేల్స్ ఆగస్టు 1 2024 నుంచే ఆరంభం కానున్నాయి. ఇక యూరప్‌లో రిటైల్ అమ్మకాలు ఆగస్టు మధ్యలో ప్రారంభం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 17, 2024, 8:29 [IST]
English summary
Royal enfield guerrilla 450 launched in india at rs 239000 full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+