మహిళల కోసం ‘ఓలా ఎలక్ట్రిక్‌' బంపర్‌ ఆఫర్‌.. ఆ స్కూటర్లపై స్పెషల్‌ డిస్కౌంట్స్‌.. కొన్ని గంటలే ఛాన్స్‌

ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్‌ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు తన S1 సిరీస్‌ స్కూటర్ల(Ola Electric)పై రూ. 25 వేల భారీ తగ్గింపును అందిస్తోన్న ఈ దిగ్గజ సంస్థ.. ఇప్పుడు మరో ఆఫర్‌తో మహిళలకు తీపికబురు తీసుకువచ్చింది. మరి ఈ ఆఫర్‌ ఎప్పటివరకు ఉంది.. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ దూసుకుపోతోంది. మార్కెట్‌లో 40 శాతం వాటాతో ఐసీఈ వాహనాలకు సైతం గట్టిపోటీనిస్తోంది. ఈ సందర్భంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ఓలా ఎలక్ట్రిక్‌ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ చాలా తక్కువ టైం వరకు మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునే మహిళలు.. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Ola-Electric-Women s-Day-Offers

ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric Women's Day Offers) ఇటీవల తన S1 సిరీస్‌ పోర్ట్‌ఫోలియోపై భారీగా ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29 వరకు ఉన్న ఈ ఆఫర్‌ను.. కస్టమర్ల కోసం మరో నెల రోజుల పాటు పొడిగించింది. అంటే ఈ మార్చి 31 వరకు వర్తిస్తుంది. ఓలా S1 సిరీస్‌ స్కూటర్లపై గరిష్ఠంగా రూ. 25 వేల తగ్గింపు ఉంది.

అయితే మహిళా దినోత్సవం(Ola Electric Women's Day Discounts) సందర్భంగా ఓలా ప్రకటించిన ఈ ఆఫర్లు.. రూ. 25 వేల తగ్గింపు ఉన్న స్కూటర్లపై మాత్రమే వర్తిస్తాయని గమనించాలి. కాగా ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. మార్చి 10 లోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ స్పెషల్ డిస్కౌంట్ వర్తించనుంది.

Ola-Electric-Women s-Day-Offers

ఈ ప్రత్యేక ఆఫర్ సమయంలో కొనుగోలు చేసే మహిళా కస్టమర్లకు.. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్‌ ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఎస్1 మోడళ్లపై ఉన్న తగ్గింపుపై అదనంగా మరో రూ.2000 డిస్కౌంట్ లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఇంకా సాధారణ డిస్కౌంట్‌పై అదనంగా రూ.2 వేల తగ్గింపు పొందవచ్చని వెల్లడించింది. మార్చి 8 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఈ స్పెషల్‌ ఆఫర్లు వర్తిస్తాయి.

క్యాబ్‌ రంగంలోకి అడుగుపెట్టి ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో స్టార్టప్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్‌.. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టూ వీలర్‌ తయారీ కంపెనీగా ఎదిగింది. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు, పలు ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం S1 సిరీస్‌ స్కూటర్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.

Ola-Electric-Women s-Day-Offers

ఎంట్రీ లెవెల్ ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్‌పై గరిష్ఠంగా రూ.25 వేల వరకు ఆఫర్‌ ఉంది. ఓలా S1 X+ 3Kwh స్కూటర్‌ను ప్రస్తుతం రూ.85 వేలకే కొనుగోలు చేయవచ్చు. ఎస్1 ప్రోపై రూ. 17,500 తగ్గింపుతో.. ప్రస్తుతం రూ. 1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర) వద్ద అందుబాటులో ఉంది.

ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.15 వేలు తగ్గింపుతో.. ధర రూ.1.05 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు వుమెన్స్ డే ఆఫర్‌లో భాగంగా మహిళలు అదనంగా మరో రూ.2 వేల తగ్గింపును పొందవచ్చు. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు. ఈ డిస్కౌంట్ ఆఫర్‌తో ఓలా సేల్స్ భారీగా పెంచుకునే యోచనలో సంస్థ ఉంది.

Ola-Electric-Women s-Day-Offers

మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునే మహిళలకు ఇది సువర్ణావకాశం. పర్యావరణ హితంగా ఉండే ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీలో భాగంగా స్టార్టప్‌లు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇలాంటి ఆఫర్లు మళ్లీ మళ్లీ రావు. మహిళలు వీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

More from DriveSpark

Article Published On: Saturday, March 9, 2024, 11:42 [IST]
English summary
Womens days special discounts on ola electric scooters offer valid till march 10th
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+