తగ్గిన అమ్మకాలు పెంచుకునేందుకు హోండా మాస్టర్ ప్లాన్.. రూ.678కే కొత్త బ్యాటరీ.. ఇప్పుడైనా క్లిక్ అయ్యేనా ?
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా ఎన్నో ఆశలు పెట్టుకున్న హోండా యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవల మార్కెట్‌లోకి వచ్చింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే నంబర్ వన్ స్కూటర్‌గా హోండా యాక్టివాకు మంచి పేరు ఉంది.
అందుకే, దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌గా వచ్చిన యాక్టివా E పై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, ఆ అంచనాలను హోండా యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ మాత్రం అందుకోలేకపోయిందని గత కొన్ని నెలల అమ్మకాల సంఖ్యను చూస్తే అర్థం అవుతుంది.

గత జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో హోండా యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి హోండా కంపెనీ భారతదేశంలోని తమ ఫ్యాక్టరీలలో దీని ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే, గత ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఈ నాలుగు నెలల్లో కేవలం 9,432 యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.
ఇందులో అత్యధికంగా గత మార్చి నెలలో 4,570 యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్పత్తి అయ్యాయి. కానీ, ఈ నాలుగు నెలల్లో ఉత్పత్తి అయిన 4,570 యూనిట్లలో ఒక్క మార్చి నెలలోనే అమ్ముడవలేదు, నాలుగు నెలల్లో కలిపి కేవలం 4,178 యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

అత్యధికంగా, మార్చి నెలలో హోండా కంపెనీ 2,102యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. కానీ, గత మే నెలలో కేవలం 676 యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మన దేశంలో అమ్ముడవుతున్న యాక్టివా Eఎలక్ట్రిక్ స్కూటర్లలో 75శాతం కంటే ఎక్కువ ఈ స్కూటర్ తక్కువ ధర వేరియంట్ అయిన QC1 నే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వాళ్లు మాత్రమే వేరే వేరియంట్లను కొనుగోలు చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ విధంగా యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు నిరంతరం పడిపోతూ ఉన్నాయి. హోండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ కోసం కొత్త లైట్ అనే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్‌కు బ్యాటరీని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా హోండా అందజేస్తుంది.

అంటే బ్యాటరీలో ఛార్జ్ అయిపోతే దగ్గర్లోని హోండా బ్యాటరీ స్వాపింగ్ సెంటర్‌లో పాత బ్యాటరీని ఇచ్చేసి, ఫుల్ ఛార్జింగ్ ఉన్న ఇంకో బ్యాటరీని కొంత మొత్తం చెల్లించి తీసుకోవచ్చు. దీనివల్ల ఛార్జింగ్ కోసం వెయిట్ చేసే టైం తగ్గుతుంది. అంతేకాకుండా స్కూటర్ ధర కూడా తగ్గుతుంది. చాలా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. హోండా కూడా ఇదే ఫాలో అవుతుంది.
యాక్టివా E బ్యాటరీ కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా అందించబడుతున్నాయి. ఇప్పుడు, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియాకు చెందిన అనుబంధ సంస్థ అయిన హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా కొత్తగా 'లైట్' అనే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త ప్లాన్ ప్రకారం యాక్టివా E ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఇంతకుముందు ఉన్న బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కంటే 50శాతం తక్కువ ఖర్చుతో లైట్ ప్లాన్ వస్తుంది. 50శాతం ఖర్చు తగ్గడానికి అనుగుణంగా, బ్యాటరీ పవర్, బ్యాటరీలను ఎక్చేంజ్ చేసుకునే సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. కొత్త లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారం నెలవారీ ఖర్చు కేవలం రూ.678 మాత్రమే.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో ప్రతి నెల లక్షల సంఖ్యలో అమ్ముడయ్యే స్కూటర్‌గా హోండా యాక్టివా ఉండగా, దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను చాలామంది కొనడానికి ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికే కొత్త లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఎంతవరకు లాభిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications








