భారత్‌లో ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లు ఇవే.. ఒక మోడల్ ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!
ప్రస్తుతం భారత ఆటో రంగంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ అనే పదం తరచుగా వినిపిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సాంకేతికతను ప్రోత్సహిస్తోంది. దీంతో వాహన తయారీ కంపెనీలు ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నాయి. ఫ్లెక్స్-ఫ్యూయల్ అంటే సాధారణ పెట్రోల్‌తో పాటు 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ (E20 నుంచి E85) కలిగిన ఇంధనంపై కూడా నడిచేలా రూపొందించిన ఇంజన్. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఇంజన్లు వివిధ శాతం ఇథనాల్ మిశ్రమాలను గుర్తించి, వాటికి అనుగుణంగా పనితీరును సర్దుబాటు చేసుకుంటాయి. దీంతో పెట్రోల్ లేదా అధిక ఇథనాల్ మిశ్రమంతో కూడా బాగా పనిచేస్తుంది.
ముఖ్యంగా మోటార్‌సైకిల్ విభాగంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో మొత్తం నాలుగు ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పెట్రోల్‌తో పాటు అధిక ఇథనాల్ మిశ్రమంతో కూడా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. హీరో, యమహా వంటి తయారీదారులు ఈ విభాగంలో ఇప్పుడు ముందు స్థానంలో ఉన్నారు. ఈ కథణంలో అందుబాటులో ఉన్న ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ గురించి చూద్దాం.

స్ప్లెండర్+ ఫ్లెక్స్-ఫ్యూయల్: ఇటీవల హీరో మోటోకార్ప్ తన స్ప్లెండర్+ మోడల్‌ను ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో భారత మార్కెట్లో పరిచయం చేసింది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 82,810గా నిర్ణయించబడింది. ప్రారంభంలో ఈ మోడల్ డెలివరీలను జూలై నెల నుంచే ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అనంతరం డిమాండ్‌ను బట్టి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఈ బైక్ E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఇంధనంపై నడిచేలా ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. అయితే ఇది కేవలం ఇంజన్ అప్‌డేట్‌తో మాత్రమే పరిమితం కాలేదు. సాధారణ స్ప్లెండర్+తో పోలిస్తే ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌కు ప్రత్యేక గ్రాఫిక్స్, కొత్త బ్యాడ్జింగ్, ఇంకా పలు మార్పులను కూడా చేశారు. దీంతో ఈ మోడల్‌ను సాధారణ స్ప్లెండర్+ నుంచి సులభంగా గుర్తించవచ్చు.

హీరో HF డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్: స్ప్లెండర్+ ఫ్లెక్స్-ఫ్యూయల్ కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.72,792. ఈ బైక్‌లో 97.2 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఇది E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఇంధనంపై పనిచేసేలా ప్రత్యేకంగా రూపొందించారు. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తొలిసారిగా ఈ బైక్‌ను ప్రదర్శించగా, తర్వాత భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
యమహా FZ ఫ్లెక్స్-ఫ్యూయల్: జపాన్‌కు చెందిన యమహా కూడా భారత ఫ్లెక్స్-ఫ్యూయల్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. కంపెనీ తన ప్రసిద్ద మోడల్ FZ బైకును ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌లో విడుదల చేసింది. భారతదేశంలో యమహా నుంచి వచ్చిన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ ఇదే. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.24 లక్షలు. దీనికి E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఇంధనంపై నడిచే సామర్థ్యం దీనికి ఉంది.

సుజుకి గిక్సర్ SF250 ఫ్లెక్స్-ఫ్యూయల్: సుజుకి గిక్సర్ SF250 ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌ను 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇది కాన్సెప్ట్ లేదా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నప్పటికీ, త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మోడల్‌లో 250 సీసీ సామర్థ్యం గల శక్తివంతమైన ఇంజన్ ఉండనుంది. E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై కూడా పనిచేసేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications