చూసి కొనండి.. రెండూ పట్నం నుంచి పల్లె వరకు పాపులర్.. Activa vs Jupiter రెండింటిలో ఏది బెస్ట్ ?

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే మొదటి రెండు పేర్లు హోండా, టీవీఎస్. ముఖ్యంగా ఫ్యామిలీ సెగ్మెంట్‌లో 125cc స్కూటర్ కొనాలనుకునే వారికి హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపిటర్ 125 మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకరు బ్రాండ్ వాల్యూ, మైలేజీలో రారాజు అయితే.. మరొకరు ఫీచర్లు, స్టోరేజ్ స్పేస్‌లో కింగ్. మరి 2026లో మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ స్కూటర్ బెస్ట్? ఏది కొంటే మీ డబ్బుకు సరైన విలువ దక్కుతుంది? ఈ కంపారిజన్లో తెలుసుకుందాం.

ధరలో తేడా ఎంత?
మొదట ధర విషయానికి వస్తే, టీవీఎస్ జుపిటర్ 125 ఇక్కడ కొంచెం పైచేయి సాధిస్తుంది. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ.75,000 నుంచి ప్రారంభమై హై-ఎండ్ వేరియంట్ రూ.87,000 వరకు ఉంటుంది. అదే హోండా యాక్టివా 125 విషయానికి వస్తే, ఇది కొంచెం ఖరీదైనది. దీని ప్రారంభ ధర దాదాపు రూ. 91,128 నుంచి మొదలవుతుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కావాలనుకుంటే జుపిటర్ వైపు మొగ్గు చూపవచ్చు.

Honda Activa 125 vs TVS Jupiter 125 Which Scooter Should You Buy in 2026

ఇంజిన్, పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ పరంగా రెండూ దాదాపు ఒకేలా ఉన్నా, జుపిటర్ ఇంజిన్ కొంచెం శక్తివంతంగా కనిపిస్తుంది.
హోండా యాక్టివా 125: ఇందులో 123.92 cc ఇంజిన్ ఉంది, ఇది 8.31 HP పవర్, 10.5 Nm టార్క్‌ను ఇస్తుంది.
టీవీఎస్ జుపిటర్ 125: ఇందులో 124.8 cc ఇంజిన్ ఉంది, ఇది 8.44 HP పవర్, 10.5 Nm టార్క్‌ను అందిస్తుంది.
రోజూ నగరాల్లో ట్రాఫిక్‌లో ప్రయాణించడానికి రెండూ సౌకర్యవంతంగా ఉంటాయి, కానీ జుపిటర్ కొంచెం ఎక్కువ పంచ్ ఇస్తుంది.

మైలేజీలో ఎవరు తోపు ?
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అన్నింటికంటే ముఖ్యమైనది మైలేజీ. ఇక్కడ హోండా తన పట్టును నిలబెట్టుకుంది. యాక్టివా 125 సుమారు 60 km/l మైలేజీని ఇస్తుండగా, టీవీఎస్ జుపిటర్ 125 దాదాపు 57 km/l మైలేజీని అందిస్తోంది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి యాక్టివా 125 కొన్ని లీటర్ల పెట్రోల్ ఖర్చును ఖచ్చితంగా తగ్గిస్తుంది.

Honda Activa 125 vs TVS Jupiter 125 Which Scooter Should You Buy in 2026

స్టోరేజ్, ఫీచర్లు
జుపిటర్ 125 నిజమైన ఫ్యామిలీ స్కూటర్ అనిపించుకోవడానికి ప్రధాన కారణం దాని అండర్-సీట్ స్టోరేజ్. ఇందులో ఏకంగా 33 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది. అంటే సీటు కింద రెండు హెల్మెట్లు సులభంగా పెట్టుకోవచ్చు. యాక్టివాలో ఇంత స్పేస్ ఉండదు.

ఫీచర్లు: జుపిటర్ 125లో స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ, యూఎస్‌బీ ఛార్జింగ్, ఎర్గోనామిక్ డిజైన్ ఉన్నాయి. యాక్టివా 125లో హోండా ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, డిజిటల్ అనలాగ్ మీటర్, ప్రీమియం ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Honda Activa 125 vs TVS Jupiter 125 Which Scooter Should You Buy in 2026

ఫైనల్ గా ఏది కొనాలి?
యాక్టివా 125 ఎవరి కోసం?: మీకు బ్రాండ్ వాల్యూ ముఖ్యం, ఎక్కువ మైలేజీ కావాలి, స్మూత్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కావాలి, ఎక్కువ కాలం మన్నిక ఉండాలి అనుకుంటే కళ్ళు మూసుకుని హోండా యాక్టివా 125 కొనేయండి.

జుపిటర్ 125 ఎవరి కోసం?: మీకు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కావాలి, డిక్కీలో ఎక్కువ సామాను పెట్టుకోవాలి (ముఖ్యంగా కిరాణా షాపింగ్ చేసేవారికి), చూడటానికి మోడ్రన్‌గా ఉండాలి అనుకుంటే టీవీఎస్ జుపిటర్ 125 బెస్ట్ ఛాయిస్.

Article Published On: Sunday, May 3, 2026, 19:08 [IST]
English summary
Honda activa 125 vs tvs jupiter 125 which scooter should you buy in 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+