ఆఫీసుకెళ్లినా, అంగడికెళ్లినా హోండానే.. చివరకు అత్తారింటికి వెళ్లాలన్నా హోండానే.. కోటి మంది నమ్మకం
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత ఆటోమొబైల్ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. దేశంలోని తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి హోండా కంపెనీ ఏకంగా కోటి (10 మిలియన్లు) వాహనాల విక్రయాలను పూర్తి చేసింది. ఈ ప్రాంతాల్లోని సామాన్యుడి రవాణా అవసరాలను తీర్చడంలో హోండా బ్రాండ్ ఎంతలా మమేకమైందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం నగరాలే కాకుండా మారుమూల పల్లెల్లో కూడా హోండా వాహనాల హవా నడుస్తోంది. ఏ ఏ మోడల్స్ ఎంతలా క్లిక్ అయ్యాయో వివరంగా చూద్దాం.
హోండా యాక్టివా (Honda Activa) :
హోండా కోటి మార్కును చేరుకోవడంలో ప్రధాన పాత్ర యాక్టివాదే. భారతదేశంలో స్కూటర్ అంటే యాక్టివా అనే పేరు పడిపోయింది. ఈ మోడల్ కేవలం ఫిబ్రవరి 2026 నెలలోనే దేశవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల యూనిట్ల సేల్స్‌ను సాధించింది. తూర్పు రాష్ట్రాల్లో దీని క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా మహిళలు, ఆఫీసుకెళ్లే వారు, ఫ్యామిలీ మ్యాన్లకు ఇది మొదటి ఛాయిస్. దీనిలోని హెచ్-స్మార్ట్ (H-Smart) టెక్నాలజీ, యాంటీ తెఫ్ట్ సిస్టమ్, అదిరిపోయే మైలేజ్ దీనిని నంబర్ 1 స్థానంలో నిలబెట్టాయి.

హోండా షైన్ 125 (Honda Shine 125):
మోటార్ సైకిళ్ల విభాగంలో హోండా షైన్ 125 ఒక సంచలనం. 125సీసీ సెగ్మెంట్‌లో దీనికి ఎదురులేదు. ఫిబ్రవరి 2026 నాటికి షైన్ 125 స్థిరమైన అమ్మకాలతో హోండా ఆదాయాన్ని పెంచుతోంది. స్మూత్ ఇంజన్, స్టైలిష్ లుక్, అత్యధిక రీసేల్ వాల్యూ ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. షైన్ 110సీసీ మోడల్ కూడా 114% వృద్ధిని సాధించి, ఎంట్రీ లెవల్ బైక్ సెగ్మెంట్‌లో దూసుకుపోతోంది.
హోండా ఎస్‌పి 125 (Honda SP125):
యువతను ఆకట్టుకోవడంలో హోండా ఎస్‌పి 125 సక్సెస్ అయింది. షైన్ కంటే కొంచెం స్పోర్టీ లుక్ ఉండటం, ఫుల్లీ డిజిటల్ మీటర్, ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఉండటంతో కాలేజీ కుర్రాళ్లు దీనిపైనే మనసు పడుతున్నారు. గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటి సేఫ్టీ ఫీచర్లు దీనికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. తూర్పు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఎస్‌పి 125 అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగాయి.

హోండా డియో (Honda Dio):
స్కూటర్ అంటే కేవలం ఫ్యామిలీ కోసం మాత్రమే కాదు, స్టైల్ కోసం కూడా అని నిరూపించింది హోండా డియో. ఇందులో వచ్చిన డియో 125 మోడల్ ఇటీవల 44% వృద్ధిని నమోదు చేసింది. దీనిలోని అగ్రెసివ్ డిజైన్, స్పోర్టీ గ్రాఫిక్స్ యువతను ఆకర్షిస్తున్నాయి. డియో 125 లో ఉన్న టీఎఫ్‌టీ (TFT) స్క్రీన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు దీనిని ఒక ప్రీమియం స్కూటర్ గా మార్చేశాయి.
హోండా నెట్‌వర్క్, భవిష్యత్తు ప్రణాళికలు
కేవలం వాహనాలు అమ్మడమే కాదు, వాటి సర్వీస్ విషయంలో కూడా హోండా చాలా పక్కాగా ఉంది. తూర్పు ప్రాంతంలోనే హోండాకు 1,200 కంటే ఎక్కువ సేల్స్, సర్వీస్ పాయింట్లు ఉన్నాయి. కోల్‌కతా, పాట్నా, రాంచీ, భువనేశ్వర్, గౌహతి వంటి నగరాలు ఈ కోటి మైలురాయిని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించి, తన మార్కెట్‌ను మరింత విస్తరించాలని హోండా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.



Click it and Unblock the Notifications








