పెట్రోల్‌కు బదులుగా ఇవి వాడండి.. ఇండియాలో బెస్ట్ హైబ్రిడ్, CNG బైక్స్–స్కూటర్లు చూసేయండి!

పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో టూవీలర్ కొనుగోలుదారుల ఆలోచనా విధానంలో కూడా మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ మాత్రమే మొదటి ఎంపికగా ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైబ్రిడ్, CNG టెక్నాలజీతో వచ్చిన టూ-వీలర్లకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. సాధారణ పెట్రోల్ టూ-వీలర్లతో పోలిస్తే ఈ కొత్త తరం వాహనాలు మంచి మైలేజ్ అందిస్తాయి. ముఖ్యంగా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇవి పెట్రోల్ ఖర్చును గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో పలు కంపెనీలు హైబ్రిడ్, CNG టూ-వీలర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ కథనంలో అలాంటి హైబ్రిడ్, CNG టూ-వీలర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Yamaha Fascino 125 Fi Hybrid: భారత మార్కెట్లో హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అత్యంత డిమాండ్ ఉన్న స్కూటర్లలో యమహా ఫాసినో 125 Fi హైబ్రిడ్ ఒకటి. ఈ స్కూటర్‌లో 125 సీసీ బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజన్‌ను యమహా అందించింది. ఇది పూర్తిస్థాయి హైబ్రిడ్ వాహనం కాకపోయినా, స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) టెక్నాలజీ సహాయంతో స్టార్ట్ చేసే సమయంలో అదనపు పవర్ అసిస్ట్‌ను అందిస్తుంది. అలాగే బ్యాటరీని సమర్థవంతంగా ఛార్జ్ చేస్తూ ఇంజన్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది.

Hybrid And Cng Bikes And Scooters Alternative For Petrol More Details Inside

ధర పరంగా ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ.77,200 నుంచి ప్రారంభమవుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే, సీటు కింద సుమారు 21 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. హెల్మెట్‌తో పాటు రోజువారీ అవసరమైన చిన్న సామాను కూడా ఇందులో సులభంగా ఉంచుకోవచ్చు. డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టైలిష్ LED లైటింగ్ ఈ స్కూటర్‌కు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకొస్తాయి. ఇది లీటరుకు గరిష్టంగా 69 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదు

Yamaha Ray ZR 125 Fi Hybrid: యమహా రే ZR 125 Fi హైబ్రిడ్ ధర రూ.77,730 నుంచి మొదలవుతుంది. ఈ స్కూటర్‌లో కూడా 125 సీసీ బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజన్‌ను అందించింది. అలాగే స్మార్ట్ మోటార్ జనరేటర్ టెక్నాలజీని ఉపయోగించారు. మైలేజ్ కూడా ఫాసినో స్థాయిలోనే ఉండటంతో తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

Hybrid And Cng Bikes And Scooters Alternative For Petrol More Details Inside

Bajaj Freedom 125 CNG: ఫ్రీడమ్ 125 CNG ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో డ్యూయల్-ఫ్యూయల్(CNG + పెట్రోల్) వ్యవస్థను కంపెనీ అందించింది. అంటే అవసరాన్ని బట్టి రైడర్ ఒక బటన్ నొక్కి CNG నుంచి పెట్రోల్‌కు లేదా పెట్రోల్ నుంచి CNGకు సులభంగా మారవచ్చు. దీంతో CNG అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ప్రయాణాన్ని ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది 124.58 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది.

మైలేజ్ పరంగా పెట్రోల్ ట్యాంక్‌తో సుమారు 130 కిలోమీటర్లు, CNG ట్యాంక్‌తో దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. రెండు ట్యాంకులను పూర్తిగా నింపితే మొత్తం సుమారు 330 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఈ బైక్‌కు ఉంది. తరచూ ఫ్యూయల్ బంక్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. ధర పరంగా బజాజ్ ఫ్రీడమ్ 125 CNG ఎక్స్-షోరూమ్ ధర రూ.90,976 నుంచి దాదాపుగా రూ.1.11 లక్షల వరకు ఉంది.

Hybrid And Cng Bikes And Scooters Alternative For Petrol More Details Inside

Yamaha FZ-S Fi Hybrid: హైబ్రిడ్ టెక్నాలజీని మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లోకి తీసుకొచ్చిన ప్రముఖ మోడళ్లలో యమహా FZ-S Fi హైబ్రిడ్ ఒకటి. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 149 సీసీ ఎయిర్-కూల్డ్, SOHC, 2 వాల్వ్ ఇంజిన్‌‌ను అమర్చారు. ధర విషయానికి వస్తే, ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.39 లక్షల నుంచి ఉంటుంది. ఇది ARAI సర్టిఫికేషన్ ప్రకారం లీటరుకు దాదాపు 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.

Article Published On: Thursday, July 16, 2026, 13:00 [IST]
English summary
Hybrid and cng bikes and scooters alternative for petrol more details inside
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+