ప్రతి గల్లీలో ఈ స్కూటర్ ఉంటుంది.. సామాన్యుడికి నమ్మిన నేస్తం ఇదే.. టాప్ 10 సేల్స్ లిస్ట్‎లో ఇదే టాప్

భారతీయ టూ వీలర్ మార్కెట్‌లో స్కూటర్ల హవా మళ్లీ ఓ రేంజ్‌లో ఊపందుకుంది. బైకుల కంటే ఈజీగా నడపడానికి వీలుండటం, మైలేజ్ పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు స్కూటర్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 నెలవారీ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, టూ-వీలర్ మార్కెట్ రారాజు హోండా యాక్టివా(Honda Activa) మరోసారి సత్తా చాటి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. కేవలం గత 30 రోజుల్లోనే లక్షలాది మంది కస్టమర్లు యాక్టివాను తమ ఇంటికి తీసుకెళ్లారు. హోండాతో పాటు టీవీఎస్, సుజుకి, బజాజ్ బ్రాండ్లు కూడా గట్టి పోటీనిస్తూ టాప్-10 జాబితాలో నిలిచాయి.

భారతదేశంలో స్కూటర్ అంటే మొదట గుర్తొచ్చే పేరు హోండా యాక్టివా. ఏప్రిల్ 2026 లో ఈ స్కూటర్ ఏకంగా 2,20,774 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే ఏప్రిల్ నెలలో యాక్టివా 1,94,787 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి వార్షిక ప్రాతిపదికన (YoY) 13.34 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఫ్యామిలీ రైడర్లకు నమ్మకమైన మోడల్‌గా మారడం, రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉండటంతో యాక్టివా హవాకు అడ్డులేకుండా పోతోంది.

top 10 selling scooter in india april 2026 honda activa jupiter access sales report telugu

అమ్మకాల లిస్ట్‌లో ఎప్పటిలాగే టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter) తన రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. గత నెలలో 14.42 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 1,17,383 యూనిట్ల జుపిటర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇక సుజుకి కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ 125 సీసీ స్కూటర్ సుజుకి యాక్సెస్ (Suzuki Access) 70,339 యూనిట్ల సేల్స్‌తో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ స్కూటర్ అమ్మకాల్లో 8.04 శాతం వార్షిక వృద్ధి కనిపించింది. ఈ రెండు స్కూటర్లు వాటి అద్భుతమైన మైలేజ్, కంఫర్ట్ రైడింగ్ కారణంగా భారత మార్కెట్లో సుదీర్ఘకాలంగా మంచి డిమాండ్‌ను కలిగి ఉన్నాయి.

పెట్రోల్ స్కూటర్లకు పోటీగా ఎలక్ట్రిక్ స్కూటర్లు (EVs) కూడా టాప్-10 అమ్మకాల జాబితాలో చోటు దక్కించుకుని ఆశ్చర్యపరిచాయి. ఇందులో టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) 34.74 శాతం బంపర్ గ్రోత్‌తో 37,193 యూనిట్లను విక్రయించి నాల్గో స్థానంలో నిలిచింది. దీనికి గట్టి పోటీ ఇస్తూ బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఏకంగా 78.52 శాతం అత్యధిక వార్షిక వృద్ధితో 34,304 యూనిట్ల అమ్మకాలను జరిపి ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ రేంజ్‌లో ఈవీ స్కూటర్లు అమ్ముడవుతుండటం దేశంలో మారుతున్న ట్రెండ్‌కు అద్దం పడుతోంది.

top 10 selling scooter in india april 2026 honda activa jupiter access sales report telugu

యువతను ఎంతగానో ఆకట్టుకునే స్పోర్టీ లుక్ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq) ఏప్రిల్ నెలలో 33.92 శాతం వృద్ధితో 33,994 యూనిట్లు అమ్ముడై ఆరో స్థానంలో నిలిచింది. అయితే, ఈ లిస్ట్‌లో అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది మాత్రం హీరో డెస్టినీ (Hero Destini). ఈ స్కూటర్ ఏకంగా 488.69 శాతం అద్భుతమైన వార్షిక వృద్ధిని నమోదు చేసి, ఒకేసారి 25,861 యూనిట్ల అమ్మకాలతో ఏడో స్థానానికి దూసుకొచ్చింది. కంపెనీ తెచ్చిన కొత్త అప్‌డేట్స్ ఈ మోడల్‌కు బాగా కలిసివచ్చాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ జాబితాలో సుజుకి బర్గ్‌మన్ (Suzuki Burgman) అమ్మకాలు ఈసారి కాస్త తగ్గాయి. 16.11 శాతం వార్షిక క్షీణతతో 19,337 యూనిట్లు అమ్ముడై ఎనిమిదో స్థానానికి పడిపోయింది. కాగా, సరికొత్త ఫ్యామిలీ ఈవీ స్కూటర్ ఏథర్ రిజ్తా(Ather Rizta) 78.67 శాతం వృద్ధితో 17,960 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి తొమ్మిదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక చివరిగా పదో స్థానంలో యామహా రే-జెడ్ఆర్ (Yamaha RayZR) నిలిచింది. ఇది 21.96 శాతం వృద్ధితో గత నెలలో 17,298 యూనిట్ల మార్కును అందుకుంది.

Article Published On: Tuesday, May 19, 2026, 11:46 [IST]
English summary
Top 10 selling scooter in india april 2026 honda activa jupiter access sales report telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+