ఈ స్కూటర్ ఇంటి ముందుంటే పక్కింటి వాళ్లు అసూయపడాల్సిందే.. 125cc సెగ్మెంట్‌లో టాప్-5 స్కూటర్లు ఇవే

ప్రస్తుత కాలంలో టూ వీలర్ మార్కెట్లో 125cc స్కూటర్ల హవా నడుస్తోంది. ఒకప్పుడు 100cc లేదా 110cc స్కూటర్ల వైపు మొగ్గు చూపిన కస్టమర్లు ఇప్పుడు మెరుగైన పవర్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, స్టైలిష్ లుక్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా 80 వేల నుంచి లక్ష రూపాయల బడ్జెట్ లో మైలేజ్ తో పాటు మెయింటెనెన్స్ తక్కువగా ఉండే స్కూటర్ల కోసం జనం వెతుకుతున్నారు. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ 125cc స్కూటర్ల గురించి, వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125):
125cc సెగ్మెంట్ లో సుజుకి యాక్సెస్ ఒక నమ్మదగ్గ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా క్లాసిక్ లుక్స్ ఇష్టపడే వారికి ఇది మొదటి ప్రాధాన్యత. దీని కొత్త వేరియంట్లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా జోడించారు. బ్లూటూత్ ద్వారా మీ ఫోన్ ని స్కూటర్ కు కనెక్ట్ చేస్తే.. కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి వివరాలు డిస్‌ప్లేపై కనిపిస్తాయి. ఆఫీస్ కు వెళ్లే వారికి ఈ ఫీచర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 78,184 గా ఉంది.

Top 5 Best 125cc Scooters in India Stylish Powerful and Budget Friendly Rides for 2026

టీవీఎస్ జూపిటర్ 125 (TVS Jupiter 125):
భారతీయ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ ఈ స్కూటర్ ను రూపొందించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. సీటు కింద ఉండే భారీ స్టోరేజ్ స్పేస్. రెండు హెల్మెట్లు పెట్టేంత స్థలం ఇందులో ఉంటుంది. అంతేకాకుండా, దీని డిజిటల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ యాప్స్ తో అనుసంధానమై రైడ్ డేటా, మెయింటెనెన్స్ రిమైండర్లు వంటి ముఖ్యం సమాచారాన్ని అందిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ ముందు భాగంలో ఉండటం వల్ల పెట్రోల్ పోయించుకోవడం చాలా సులభం. కుటుంబ అవసరాలకు సరిపోయే ఈ స్కూటర్ ప్రారంభ ధర సుమారు రూ.77,000లుగా ఉంది.

Top 5 Best 125cc Scooters in India Stylish Powerful and Budget Friendly Rides for 2026

హోండా యాక్టివా 125 (Honda Activa 125):
విశ్వసనీయతకు మారుపేరు హోండా యాక్టివా. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్ల జాబితాలో ఇది ఎప్పుడూ ముందుంటుంది. దీని 125cc వేరియంట్ లో ప్రీమియం ఫీచర్లను అందించారు. స్మార్ట్ కీ ఫీచర్ తో పాటు డిజిటల్-అనలాగ్ మీటర్ ఇందులో ఉంటుంది. రియల్ టైమ్ మైలేజ్, ఎంత దూరం ప్రయాణించవచ్చు (Distance to Empty) వంటి వివరాలను ఇది చూపిస్తుంది. హోండా సర్వీస్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా ఉండటం వల్ల దీని మెయింటెనెన్స్ కూడా చాలా సులభం. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.89,652 లుగా ఉంది.

Top 5 Best 125cc Scooters in India Stylish Powerful and Budget Friendly Rides for 2026

టీవీఎస్ ఎన్-టార్క్ 125 (TVS Ntorq 125):
కేవలం యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వచ్చిన స్కూటర్ ఇది. దీని స్పోర్టివ్ లుక్స్, పవర్ ఫుల్ పికప్ కు యువత ఫిదా అవుతున్నారు. టెక్నాలజీ పరంగా ఇది సెగ్మెంట్ లోనే టాప్ అని చెప్పొచ్చు. దీని SmartXonnect సిస్టమ్ ద్వారా నావిగేషన్ అసిస్టెన్స్, లాస్ట్ పార్క్డ్ లొకేషన్, రైడ్ అనలిటిక్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లభిస్తాయి. రేసింగ్ ప్రేమికులకు నచ్చేలా దీని సౌండ్ మరియు హ్యాండ్లింగ్ ఉంటాయి. ఈ స్కూటర్ ప్రారంభ ధర సుమారు రూ.81,250 లుగా ఉంది.

Top 5 Best 125cc Scooters in India Stylish Powerful and Budget Friendly Rides for 2026

యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125):
స్టైలిష్ గా, మోడ్రన్ గా ఉండాలని కోరుకునే వారికి ఫాసినో బెస్ట్ ఆప్షన్. దీని బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్ లో నడపడం చాలా సులభం. ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందించారు, ఇది పికప్ సమయంలో అదనపు బూస్ట్ ఇస్తుంది. దీని డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా రైడింగ్ హిస్టరీ, పార్కింగ్ లొకేషన్ వంటివి తెలుసుకోవచ్చు. తక్కువ బరువు, మంచి మైలేజ్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.74,910 లుగా ఉంది.

Top 5 Best 125cc Scooters in India Stylish Powerful and Budget Friendly Rides for 2026

చివరగా, మీరు ఏ స్కూటర్ ఎంచుకోవాలి అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఫ్యామిలీ కోసం అయితే జూపిటర్, పవర్, టెక్నాలజీ కోసం అయితే ఎన్-టార్క్, ఇక నమ్మకం, సింపుల్ లుక్ కోసం యాక్సెస్ లేదా యాక్టివాను ఎంచుకోవచ్చు. మీ బడ్జెట్, ఫీచర్ల ప్రాధాన్యతను బట్టి ఈ ఐదింటిలో ఒకటి మీ సొంతం చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 17, 2026, 14:15 [IST]
English summary
Top 5 best 125cc scooters in india stylish powerful and budget friendly rides for 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+