భారత్‌లో హ్యర్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ గ్లైడ్ విడుదల; ధర, ఫీచర్లు

By Ravi

ప్రముఖ అమెరికన్ లీజర్ మోటార్‌సైకిల్ కంపెనీ హ్యార్లీ డేవిడ్‌సన్ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న 'స్ట్రీట్ గ్లైడ్' (Street Glide) టూరింగ్ మోటార్‌సైకిల్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ గ్లైడ్ మోటార్‌సైకిల్ ధరను రూ.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ ప్రకాష్ తెలిపారు.

రష్‌మోర్ ప్రాజెక్ట్‌లో భాగంగా కంపెనీ ఈ క్రూజర్‌ను 'హై అవుట్‌పుట్ ట్విన్ క్యామ్ 103' ఇంజన్‌తో తయారు చేసింది. హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ మోటార్‌సైకిల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు. రష్‌మోర్ అనేది, వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చేసుకొని హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లను అప్‌గ్రేడ్ చేసే ప్రాజెక్ట్.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ గ్లైడ్ మోటార్‌సైకిల్‌లో అత్యంత హై-టెక్ ఫీచర్లను, అధునాతన ఇంజన్ టెక్నాలజీలను ఉపయోగించారు. ఈ మోడల్‌ను వినియోగదారులు కోరుకున్నట్లుగా కంట్రోల్, ఇన్ఫోటైన్‌‌మెంట్, ఫీల్, స్టైల్ విభాగాలను పరిగణలోకి తీసుకొని అప్‌గ్రేడ్ చేశారు. మరి ఈ మోటార్‌సైకిల్ ఇంత అధిక ధర పలకడానికి కారణమైన ఇందులోని ఆ హై-టెక్ ఫీచర్లేంటో తెలుసుకుందాం రండి..!

కంట్రోల్

కంట్రోల్

కొత్త 2014 హ్యర్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ గ్లైడ్ మోటార్‌సైకిల్‌లో 1690 సీసీ, వి-ట్విన్ ఎయిర్-కూల్డ్, హై అవుట్‌పుట్ ట్విన్ క్యామ్ 103ఇంజన్‌ను ఉపయోగించారు. అలాగే ఇందులో, ఇంప్రూవ్డ్ డ్యూయెల్ హ్యాలోజెన్ లైటింగ్, రిఫ్లెక్స్ లింక్డ్ బ్రేక్స్ విత్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇంప్రూవ్డ్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటి మార్పులు చేశారు.

ఇన్ఫోటైన్‌మెంట్

ఇన్ఫోటైన్‌మెంట్

ఈ మోటార్‌సైకిల్‌లో కొత్త కలర్ స్క్రీన్ బూమ్ బాక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (4.3 ఇంచ్ హై రెజల్యూషన్ డిస్‌ప్లేతో కూడిన స్క్రీన్)ను అమర్చారు. ఇది 5.25 ఇంచ్ స్పీకర్లకు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ సిస్టమ్ బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివీలను సపోర్ట్ చేస్తుంది. అలాగే వాయిస్ రికగ్నైజేషన్, టెక్స్ట్ టూ స్పీచ్ టెక్నాలజీ, జిపిఎస్ నావిగేషన్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఫీల్

ఫీల్

స్ప్లిట్‌స్ట్రీమ్ వెంటింగ్‌తో కూడిన బ్యాట్‌వింగ్ ఫెయిరింగ్ (ఇది ఏరోడైనమిక్స్‌ను మెరుగుపరచేందుకే కాకుండా, వర్షపు నీరు డ్యాష్ ప్యానెల్‌పై పడకుండా ఉండేందుకు కూడా సహకరిస్తుంది), రీఫైన్డ్ ప్యాసింజర్ సీటింగ్ ఏరియా, మెరుగైన ఏరోడైనమిక్స్ అండ్ ఎర్గోనమిక్స్‌తో ఇది మంచి లుక్ అండ్ ఫీల్‌ను కలిగి ఉండటమే కాకుండా, కంఫర్ట్‌ను కూడా అందిస్తుంది.

స్టైల్

స్టైల్

రీషేప్డ్ టూర్ ప్యాక్, శాడల్‌బ్యాగ్స్ (సైడ్ బాక్సులు), సన్నటి ఫెండర్స్, ఇన్‌ట్యూటివ్ హ్యాండ్ కంట్రోల్ స్విచ్‌లు, కొత్త బ్యాట్‌వింగ్ ఫెయిరింగ్, కొత్త తేలికపాటి ఎన్‌ఫోర్సర్ కాస్ట్ 10 స్పోక్ ఇంపెల్లర్ కాస్ట్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్, కొత్త జ్యూక్ బాక్స్, వన్-టచ్ ఫ్యూయెర్ డోర్ వంటి అనేక స్టైలింగ్ ఫీచర్లను కొత్త హ్యర్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ గ్లైడ్ మోటార్‌సైకిల్‌లో జోడించారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

More from DriveSpark

Article Published On: Friday, October 11, 2013, 9:02 [IST]
English summary
Harley Davidson has launched 2014 Project Rushmore Street Glide, one of its most advanced cruiser bike in India. The cruiser, part of the Rushmore Project comes powered by a ‘High Output Twin Cam 103' engine. The bike will com to India via the import route and hence will be priced at INR 29 lakhs (ex-showroom).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+