జనవరి 29న హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ విడుదల; ధర లీక్
దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గడచిన అక్టోబర్ నెలలో 15 కొత్త అప్‌గ్రేడెడ్ ఉత్పత్తులను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. వీటన్నింటినీ ఈ ఏడాది మార్చి నాటికి మార్కెట్లో విడుదల చేస్తామని ఆ సందర్భంలో కంపెనీ వెల్లడించింది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ అప్‌గ్రేడెడ్ ఉత్పత్తుల్లో మొదటగా, సరికొత్త స్ప్లెండర్ ఐస్మార్ట్ (Splendor iSmart) ఈనెలలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, సరికొత్త హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ విడుదల తేది మరియు అంచనా ధరలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ కొత్త బైక్‌ను జనవరి 29, 2014న మార్కెట్లో విడుదల చేయవచ్చని, దీనిని కేవలం రూ.57,000 (అంచనా ఆన్-రోడ్ ధర) లకే ఆఫర్ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే, సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో లభ్యం కానున్న సరికొత్త బైక్‌గా స్ప్లెండర్ ఐస్మార్ట్ రికార్డ్ సృష్టిచనుంది.
ఇది కూడా చదవండి:15 కొత్త మోడళ్లను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ టెక్నాలజీతో లభ్యం కానుంది. ఇప్పటి వరకు కార్లకు మాత్రమే పరిమితమైన ఈ ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌ను ఇండియన్ మోటార్‌సైకిళ్లలో కెల్లా తొలిసారిగా హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్‌లో ఆఫర్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీని ఐ3ఎస్ అని పిలువనున్నారు (మహీంద్రా స్కార్పియోలో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, దీనిని మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అని పిలుస్తారు).
సిగ్నల్స్ వద్ద ఎక్కువ సేపు వాహనం నిలిపి ఉన్నప్పుడు లేదా ఇంజన్ ఐడిల్‌గా ఉన్నప్పుడు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవటం, క్లచ్/యాక్సిలరేట్ నొక్కినప్పుడు మళ్లీ ఇంజన్ ఆన్ అవ్వటం ఈ ఫీచర్ ప్రత్యేకత. దీని వలన అధిక మైలేజీని పొందటమే కాకుండా, తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువరించేందుకు కూడా ఇది సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








