హైదరాబాద్ మార్కెట్లో హోండా డ్రీమ్ నియో విడుదల

By Ravi

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఇటీవలే ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ జపనీస్ ఆటో దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా గడచిన ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన బడ్జెట్ మోటార్‌సైకిల్ 'హోండా డ్రీమ్ నియో'ను ఇప్పు రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో హోండా డ్రీమ్ నియో బైక్ ప్రారంభ ధర రూ.44,319 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

హోండా అందిస్తున్న డ్రీమ్ సిరీస్‌లో నియో బైక్ రెండవది (డ్రీమ్ యుగ మొదటిది). ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న 'హీరో స్ప్లెండర్'ను సవాల్ చేస్తూ హోండా తమ 'డ్రీమ్ నియో' బడ్జెట్ బైక్‌ను విడుదల చేసింది. భారత్‌లో హోండా నుంచి లభిస్తున్న అత్యంత చవకైన బైక్‌గా కూడా డ్రీమ్ నియో కావటం విశేషం.


హోండా డ్రీమ్ నియోలో 109సీసీ, ఫోర్-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.25 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 74 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

హోండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం 'హోండా ఎకో టెక్నాలజీ' (హెచ్ఈటి)ని ఈ ఇంజన్‌లో ఉపయోగించారు. ఈ టెక్నాలజీలో మెరుగైన కంబస్టియన్, నికెల్ ప్లేటెడ్ స్పార్క్ ప్లగ్ వలన ఉత్పన్నమయ్యే క్లీన్ స్పార్క్ మరియు ఆప్టిమైజ్డ్ ఇన్‌లెట్ పోర్ట్‌లు ఉంటాయి. కార్బురేటర్ ద్వారా ఇంధన సరఫరా జరిగే ఈ ఇంజన్ గరిష్ట మైలేజీనివ్వటంలో సహకరిస్తుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • హోండా డ్రీమ్ నియో (కిక్ స్టార్ట్ / డ్రమ్ బ్రేక్స్ / స్పోక్ వీల్స్) - రూ.44,319
  • హోండా డ్రీమ్ నియో (కిక్ స్టార్ట్ / డ్రమ్ బ్రేక్స్ / అల్లాయ్ వీల్స్) - రూ.45,336
  • హోండా డ్రీమ్ నియో (సెల్ఫ్ స్టార్ట్ / డ్రమ్ బ్రేక్స్ / అల్లాయ్ వీల్స్) - రూ.48,478

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Wednesday, August 7, 2013, 11:48 [IST]
English summary
Honda Motorcycle and Scooters India has launched its new motorcycle ‘Dream Neo’ in Hyderabad with starting price of Rs 44,319, making it the company’s cheapest two-wheeler in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+