హోండా యాక్టివా 3జి విడుదల; త్వరలో 15 కొత్త మోడళ్లు
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ ఏడాది మొత్తం 15 మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది. వీటిలో కొన్ని సరికొత్త మోడళ్లు అలాగే కొన్ని రిఫ్రెష్డ్ మోడళ్లు ఉండనున్నాయి. జనవరిలో సరికొత్త సిబి యునికార్న్ 160 బైక్‌ను విడుదల చేసిన హోండా, తాజాగా యాక్టివా 3జి పేరిట ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
ఐకానిక్ యాక్టివా ఇప్పుడు యాక్టివా 3జి
హోండా 2001లో తమ యాక్టివా స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా.. ఈ బ్రాండ్‌లో ఇప్పుడు యాక్టివా 3జి పేరిట కొత్తతరం స్టయిలింగ్‌తో కూడిన మోడల్‌ను విడుదల చేసింది. స్టయిలింగ్ పరంగా కొత్త యాక్టివా 3జిలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. కానీ ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి 110సీసీ ఇంజన్‌తోనే ఇది లభిస్తుంది.

హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ), సిబిఎస్ (కాంబీ బ్రేకింగ్ సిస్టమ్), కంఫర్టబల్ సీటింగ్ పొజిషన్, విశాలమైన సీట్, పేటెంటెడ్ క్లిక్ మెకానిజం, విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్, మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, ఫుల్ మెటల్ బాడీ, ట్యూబ్‌లెస్ టైర్స్, కీలాక్ షట్టర్ వంటి ఫీచర్లతో ఇది లభ్యం కానుంది. ఇది మొత్తం 5 ఆకర్షనీయమైన రంగులలో (రెండు కొత్త రంగులు) లభిస్తుంది.
హోండా యాక్టివా 3జి ధర - రూ.48,852 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా యాక్టివాతో పాటుగా కంపెనీ మరికొన్ని మోడళ్ల డిజైన్‌ను రిఫ్రెష్ చేసింది. సిబి షైన్, డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో మోటార్‌సైకిళ్లు మరియు డియో స్కూటర్ డిజైన్‌ను హోండా రిఫ్రెష్ చేసింది. కొత్త గ్రాఫిక్స్, కొత్త ఫీచర్స్‌తో రానున్న ఈ రిఫ్రెష్డ్ మోడళ్లు మరికొద్ది రోజుల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








